Continues below advertisement


స్టైలిష్ లుక్, అద్దిరిపోయే పెర్‌ఫార్మెన్సులతో మార్కెట్‌లోకి తన ఎలక్ట్రిక్ కార్ల ఫస్ట్‌ లుక్‌లను వదిలిన మహింద్రా ఇప్పుడు వాటి బుకింగ్స్ ప్రారంభించింది. మోస్ట్ అవైటింగ్  XEV 9e , BE 6   బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఫస్ట్ లుక్ వచ్చినప్పుడే కస్టమర్ల మనసు దోచిన ఆ కార్లు.. దేశీయ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల మార్కెట్‌ను ఓ కుదుపు కుదిపాయి. ముఖ్యంగా స్టైలిష్ కట్‌లు, అదిరిపోయే ఫీచర్స్, కళ్లు చెదిరే కలర్స్‌తో మహింద్రా SUVలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి. టెస్ట్ డ్రైవ్‌ల కోసం రోడ్లు మీద తిప్పినప్పుడు చూపురులను కళ్లు తిప్పుకోనివ్వలేదు.


అద్దిరిపోయే ఓపెనింగ్స్


మహింద్రా తీసుకొస్తున్న ఈ రెండు మోడల్స్‌కు విపరీతమైన డిమాండ్ క్రియేట్ అయింది. మహింద్రా ఎక్స్‌ క్లూజివ్ గా ఎలక్ట్రిక్ కోసం తీసుకొచ్చిన Inglo ప్లాట్‌ఫామ్‌పై ఈ కార్లు తయారయ్యాయి. ఇప్పటికే 30179 బుకింగ్స్ పూర్తయ్యాయి. ఈ రెండు కార్లలో XEV 9e అనేది కొంచం కాస్ట్లి కార్. మిడ్ రేంజ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ పరంగా చూసుకున్నా కూడా ఇదే కొంచం ఖరీదెక్కువ. ఎక్స్ షోరూం ధర 31.50 లక్షలు ఉంది. BE 6 26.90 లక్షల కాస్ట్ ఉంది. ధర ఎక్కువైనా సరే కస్టమర్స్స్ XEV 9e కొనడానికే ఆసక్తి చూపుతున్నారు. మొత్తం బుకింగ్స్ లో 56శాతం దీనికే అయ్యాయి. BE 6 44  శాతం బుకింగ్స్ వచ్చాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పవర్ ఎక్కువుగా ఉన్న వెహికిల్స్‌కే ప్రాధాన్యత కనిపిస్తోంది. అందుకే 79 kwh బ్యాటరీ ప్యాక్ ఉన్న వెహికిల్స్‌ను 73శాతం బుక్ చేశారు. ఇది టాప్ ఎండ్ మోడల్.



                                   


స్టైలిష్ XEV 9e, బీస్ట్ BE 6


డిజైన్, స్టైల్, పర్ఫార్మెన్స్ అన్ని విషయాల్లో మహింద్రా తన కాంపిటీటర్లకు గట్టి షాక్‌నే ఇస్తోంది. కార్లు రోడ్డెక్కడానికి ముందే వీటికి విపరీతమైన బజ్ వచ్చింది. బుకింగ్స్ కూడా ఆ విషయాన్ని ప్రూవ్ చేస్తున్నాయి. స్టైలిష్ డిజైన్‌తో పాటు కస్టమర్లు ఎక్కువుగా కోరుకునే లాంగ్ రేంజ్ ఇస్తుండటం ఈ వెహికిల్స్ ప్రత్యేకత. 79 kwh  బ్యాటరీ అంటే కచ్చితంగా ఎక్కువ రేంజ్, పవర్ కూడా ఇస్తుంది కదా.. XEV 9e ఏకంగా 682కిలోమీటర్ల రేంజ్ ఇస్తోంది. BE 6  656km  రేంజ్ వస్తోంది. రెండు కార్లకు బ్యాటరీ ప్యాక్‌లపై జీవితకాల వారంటీ ఉంది.


 


ఇక కంఫర్ట్ విషయంలో కూడా బెస్ట్ ఇన్ ద క్లాస్ ఫీచర్స్ ఉన్నాయి. 16 స్పీకర్ల హార్మన్ మ్యూజిక్ సిస్టమ్ .. డాల్పీ థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. కారు డాష్‌బోర్డులో ఉన్న ట్రిపుల్ స్క్రీన్‌తో హై ఎండ్ ఇన్ఫోటైన్‌మెంట్ ఫీల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక సేఫ్టీ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. Level 2+ ADAS సిస్టమ్, 7 ఎయిర్ బ్యాగ్‌లతో భద్రత విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్నారు. దీన్లోని Auto Park ఫీచర్‌ను కస్టమర్లు ఇప్పటికే వీడియోల్లో చూపి థ్రిల్ అయ్యారు. దానిని రియల్‌టైమ్ లో ఎక్స్‌పీరియెన్స్ చేయడానికి సిద్ధమవుతున్నారు.