Mahindra Electric SUV Differences: భారత ఎలక్ట్రిక్‌ SUV మార్కెట్‌లో ప్రస్తుతం Mahindra XEV 9S, XEV 9e మోడళ్లు మంచి స్పందన తెచ్చుకుంటున్నాయి. ఒకటి కూపే SUV స్టైల్‌లో వస్తే, మరొకటి మూడు వరుసల SUV గా కుటుంబాల కోసం ప్రత్యేకంగా నిలిచింది. ఇవి రెండూ Mahindra INGLO ప్లాట్‌ఫామ్‌పై తయారయ్యాయి. అయితే... డిజైన్‌, ఫీచర్లు, రేంజ్‌, ధరల్లో చాలా స్పష్టమైన తేడాలు ఉన్నాయి. ఈ కథనం చదివితే, మీకు ఏ SUV సరిగ్గా సరిపోతుందో అర్థం అయిపోతుంది.

Continues below advertisement

డిజైన్‌లో ఏది బెస్ట్?

XEV 9e పూర్తిగా స్పోర్టీగా కనిపించే కూపే SUV ప్రొఫైల్ తో వస్తుంది. దీని రూఫ్‌లైన్ కాస్త దిగువకు వంపు ఉండటం వల్ల యంగ్‌ బయ్యర్లకు ఇది బాగా నచ్చే స్టైల్‌. వెనుక భాగంలో స్లిమ్‌ కనెక్టెడ్‌ LED టెయిల్‌ల్యాంప్స్, బాక్సీ లుక్‌ ఉంటాయి.

Continues below advertisement

XEV 9S మాత్రం సాంప్రదాయ SUV మాదిరిగా ఉంటుంది. ఇది Mahindra XUV700కి దగ్గరగా కనపడేలా రూపొందించారు. మూడో వరుస సీట్లను అమర్చడానికి రూఫ్‌ను కాస్త ఎత్తుగా ఉంచారు. ఫ్రంట్‌ డిజైన్‌లో కూడా XUV700 షార్ప్‌ ఎలిమెంట్స్‌ కనిపిస్తాయి. వీల్‌ సైజులు మాత్రం XEV 9e లో పెద్దవి (19-inch), XEV 9S లో చిన్నవి (18-inch).

డిజైన్‌ పరంగా స్పోర్టీ స్టైల్‌ ఇష్టమైతే XEV 9e, ఫ్యామిలీ యూజ్‌కు సూటయ్యేది XEV 9S.

ఇంటీరియర్‌, ఫీచర్లలో ఏది లీడ్?

రెండింట్లో కూడా ఒకే తరహా మూడు స్క్రీన్‌ల సెటప్‌ - డ్రైవర్ డిస్‌ప్లే, ఇన్ఫోటైన్‌మెంట్‌, ప్యాసింజర్ స్క్రీన్‌ - ఉంది. అదే స్టీరింగ్‌, అదే సెంటర్‌ కాన్సోల్‌, అదే మెటీరియల్స్‌. కానీ ముఖ్యమైన తేడాలు రియర్‌ సీటింగ్‌లో కనిపిస్తాయి.

XEV 9e కేవలం 5 సీటర్ మాత్రమే. స్లోపింగ్ రూఫ్‌లైన్ వల్ల రెండో వరుసలో హెడ్‌రూమ్‌ కూడా కొంచెం తగ్గుతుంది.

XEV 9S లో మాత్రం 7 సీట్స్ ఆప్షన్ ఉంది. రెండో వరుసలో స్లైడ్‌ & రిక్లైన్‌ ఫీచర్లు, అలాగే వెనుక ప్రయాణికులకు ఎలక్ట్రిక్ బాస్‌ మోడ్‌, వెంటిలేటెడ్‌ రెండో వరుస సీట్లు కూడా అందుబాటులో ఉంటాయి. అదనంగా ఓపెనబుల్‌ పానోరమిక్ సన్‌రూఫ్‌ కూడా దీనిలో ఉంది. అలాగే, XEV 9S లో రియర్ ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్‌ల ఆప్షన్‌ కూడా ఉంది. అంటే, ఫీచర్ల పరంగా చూస్తే XEV 9S క్లియర్‌ విన్నర్‌.

రేంజ్‌, బ్యాటరీ ఆప్షన్లు

రెండింటికీ 59kWh, 79kWh బ్యాటరీలు ఇచ్చారు. కానీ XEV 9S కి అదనంగా 70kWh ఆప్షన్‌ కూడా ఉంది.

59kWh:

XEV 9e – 542km

XEV 9S – 521km

79kWh:

XEV 9e – 656km

XEV 9S – 679km

అంటే పెద్ద బ్యాటరీలో XEV 9S రేంజ్ ఎక్కువ. దీని 70kWh వెర్షన్ 600km రేంజ్‌ని ఇస్తుంది.

వేరియంట్లు, ధరలు – ఏ కారు చవక?

ధరల్లో పెద్ద తేడా ఉంది.

XEV 9S ధరలు XEV 9e కంటే దాదాపు ₹2 లక్షలు తక్కువ నుంచి ప్రారంభమవుతాయి.

79kWh మోడళ్లు కూడా XEV 9S లో ₹4.5 లక్షలు చవక.

70kWh మోడల్‌ కూడా XEV 9e 59kWh మోడల్‌ కంటే ₹45,000 తక్కువే.

అంటే.. ఫీచర్లు ఎక్కువగా ఉన్నా, రేంజ్‌ ఎక్కువైనా, సీట్లు ఎక్కువగా ఉన్నా – XEV 9S మరింత అందుబాటులో ఉంటుంది.

ఎవరు ఏది తీసుకోవాలి?

స్పోర్టీ లుక్‌, కూపే SUV స్టైల్‌ మీకు ఇష్టం అయితే XEV 9e తీసుకోవచ్చు.

కుటుంబం కోసం, ఎక్కువ సీట్లు, ఎక్కువ ఫీచర్లు, ఎక్కువ రేంజ్‌, తక్కువ ధరలో ఆల్‌ రౌండ్‌ ప్రాక్టికల్‌ SUV కావాలంటే XEV 9S తీసుకోవచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.