Mahindra XEV 9S 6 Seater: మీరు కొత్త కారు కొనాలనుకుంటున్నారా.. కొత్తగా లాంచ్ అయిన కారు తీసుకోవాలని కరెక్ట్ టైమ్ కోసం వేచి చూస్తున్నారా? అయితే మీకోసమే ఓ కారు లాంచ్ అయింది. మహీంద్రా తన పాపులర్ ఎలక్ట్రిక్ కార్ XEV 9S కొత్త వెర్షన్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త కార్‌లో 6 సీట్ల ఆప్షన్ ఇచ్చారు. ఇందులో వెనుక సీట్లు కెప్టెన్ సీట్ స్టైల్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఈ కార్ 7 సీటర్‌తో పాటు 6 సీటర్‌లో కూడా అందుబాటులో ఉంది. ఎక్కువ సౌకర్యం, ప్రీమియం ఫీల్ కోరుకునే వారికి ఈ కారు సరిగ్గా సరిపోతుంది. మహీంద్రా ఎక్స్‌ఈవీ 9ఎస్ ధర ఎంత, ప్రత్యేకతలు ఏమిటో పూర్తి సమాచారం తెలుసుకుందాం.

Continues below advertisement

కొత్త 6 సీటర్ XEV 9S స్పెషాలిటీ ఏంటీ..  మహీంద్రా XEV 9S కేవలం 7 సీటర్‌గా మాత్రమే లభిస్తోంది.  ఇందులో మధ్య సీటు బెంచ్ టైప్‌లో వచ్చేది. కంపెనీ ఇందులో 6 సీటర్ లేఅవుట్‌ను యాడ్ చేసింది. ఈ కొత్త లేఅవుట్‌లో రెండవ వరుసలో బెంచ్ సీటుకి బదులుగా 2 వేర్వేరు కెప్టెన్ సీట్లు ఉంటాయి. ఈ సీట్లలో ప్రత్యేక ఆర్మ్‌రెస్ట్‌లు ఇవ్వడంతో మధ్యలో కూర్చునే ఇద్దరు వ్యక్తులకు కంఫర్ట‌బుల్‌గా ఉంటుంది. లాంగ్ జర్నీ ప్రయాణాలు కంఫర్టబుల్‌గా చేయాలనుకునే కుటుంబాలకు ఈ లేఅవుట్ సెట్ అవుతుంది. ఈ 6 సీటర్ ఆప్షన్ కారును మరింత ప్రీమియంగా చేస్తుంది. స్పేస్ కంటే కంఫర్ట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వారిని ఆకట్టుకుంటుంది.

ఈ 6 సీటర్ కెప్టెన్ సీట్ ఆప్షన్ అన్ని వేరియంట్లలో ఉండదని గ్రహించాలి. కంపెనీ దీనిని Pack Two Above, Pack Three, Pack Three Above వంటి 3 వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది. బేసిక్ వేరియంట్ Pack One Above లో ఈ ఆప్షన్ లేదు. మహీంద్రా XEV 9S ని నవంబర్ 2025 లో మొదటిసారి లాంచ్ చేశారు. అప్పటి నుంచి ఇది మహీంద్రా ఎలక్ట్రిక్ కార్ పోర్ట్‌ఫోలియోలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా నిలిచింది. గడిచిన నెలలోనే ఈ కారు 4,131 యూనిట్లు అమ్ముడుపోయాయి. 

Continues below advertisement

వీటి ధర ఎంత, వేటితో పోటీ?ఇప్పుడు దీని ధర విషయానికి వస్తే, హైదరాబాద్‌లో మహీంద్రా XEV 9S బేసిక్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 19.95 లక్షలు (ఎక్స్-షోరూమ్). కొత్త 6 సీటర్ కెప్టెన్ సీట్ వెర్షన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 25.25 లక్షల నుండి ప్రారంభమవుతుంది. 6 సీటర్ ఆప్షన్ ధర అదే వేరియంట్ 7 సీటర్ వెర్షన్ కంటే కేవలం రూ. 25,000 మాత్రమే ఎక్కువ. కొంత మొత్తం ఎక్కువ చెల్లిస్తే కస్టమర్లకు కెప్టెన్ సీట్ వంటి ప్రీమియం ఫీచర్ లభిస్తుంది. ఈ ధరలో 11.2 kW AC ఛార్జర్ ధర చేర్చలేదు. అది విడిగా యాడ్ అవుతుంది.

డౌన్‌పేమెంట్ చేసి కారు తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి..

ఒకేసారి మొత్తం ధర చెల్లించి కొనలేని వారు రూ.1.5 లక్షల డౌన్ పేమెంట్ చేస్తే కనుక మిగతాది లోన్ తీసుకుని చెల్లించాలని కంపెనీ ప్రతినిధి తెలిపారు.  21,86,483 మొత్తంలో మీరు కనుక రూ.1.5 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే.. రూ.20,35,000 లోన్ తీసుకోవాలి. 5 ఏళ్ల కాలానికి 9 శాతం వడ్డీతో ప్రతినెలా EMI రూ.42,243 చెల్లించాలి. 5 ఏళ్లలో చెల్లించే వడ్డీ నగదు రూ.5 లక్షలు అవుతుంది. ఒకవేళ 6 ఏళ్ల కాలానికి లోన్ తీసుకుంటే ప్రతినెలా EMI రూ.36,681 చెల్లిస్తుంది. 7 ఏళ్ల కాలపరిమితికిగానూ కార్ లోన్ తీసుకుంటే ప్రతినెలా EMI రూ. 32,741 చెల్లించాల్సి ఉంటుంది.