Mahindra Roxx 5 Door Launching on August 15: భారత్‌లో ఆఫ్‌రోడ్‌ సామర్థ్యాలతో పాటు ఫుల్‌ప్యాక్డ్‌ ఎస్‌యూవీగా ఉన్న మోడల్‌ ఏదైనా ఉంది అంటే అది మహీంద్రా థార్ మాత్రమే. 2010లో మహీంద్రా ద్వారా ప్రారంభించి ఈ థార్ ఇప్పటివరకు లక్షలాది కస్టమర్లను సంపాదించుకుంది. మొదటి జనరేషన్ ప్రారంభంలో కేవలం ఆఫ్-రోడర్‌గా మాత్రమే పరిచయం చేసింది. ఆ తర్వాత 2nd జనరేషన్‌లో పూర్తిగా లైఫ్‌స్టైల్‌ ఆఫ్-రోడర్ SUVగా మోడీఫై చేశారు. ఈ మార్పుతో మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్‌ని థార్ సొంత చేసుకుంది. ఇప్పుడు ఆన్-రోడ్, ఆఫ్-రోడ్ అడ్వెంచర్‌లకు బెస్ట్‌ ఎస్‌యూవీగా ఉంది. 

అయితే ప్రస్తుతం ఉన్న థార్ 3-డోర్ వెర్షన్‌లో సీటింగ్‌, ఇతర ఆప్షన్స్ మైనస్‌గా ఉన్నాయి. ముఖ్యంగా సీటింగ్ కెపాసిటీ, వెనుక సీట్లలో కూర్చునేందుకు చాలామంది విముఖత చూపిస్తున్నారని పలు రివ్యూలు దీనిని హైలైట్ చేశాయి. వెనుక సీట్లలో లాంగ్ రైడ్ అసౌకర్యంగా ఉంటుందని విశ్లేషకులు కూడా పేర్కొన్నారు. ఈ చిన్నపాటి లోపాలు ఉన్నప్పటికీ ఆఫ్‌-రోడర్‌ ఎస్‌యూవీలలో థార్ అత్యంత ప్రజాదరణ పొందింది.


భారీ మార్పులతో సరికొత్తగా
ఈ సమస్యలకు చెక్‌ పెట్టేందుకు మహీంద్రా పలు మార్పులతో మహీంద్రా 5-డోర్ వెర్షన్‌ను మహీంద్రా థార్ ROXX ని పరిచయం చేస్తోంది. ఈ కొత్త మోడల్‌ని ఆగస్ట్ 15న ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనుంది. వీటికి సంబంధించిన టీజర్‌లను విడుదల చేస్తూ అంచనాలను పెంచుతోంది. 


త్వరలో విడుదల కాబోయే ఈ సరికొత్త థార్‌లో పనోరమిక్ సన్‌రూఫ్‌ని అందించనున్నారు. ఇది ప్రయాణీకులు కారు లోపల నుంచి ఆకాశంలోని అందాలను ఆస్వాదించే సన్‌రూఫ్‌ తీసుకొచ్చారు. తమ ఫేవరేట్‌ ఎస్‌యూవీ లోనూ సన్‌రూఫ్‌ ఫీచర్‌ వస్తుండటంతో కొందరి థార్ ప్రియుల ఆనందానికి అవధులు లేవు. ఇక ఈ ఆఫర్‌తో మారుతి జిమ్నీ, ఫోర్స్ గూర్ఖా వంటి పోటీదారులు థార్ ROXXకి దరిదాపుల్లో కూడా రావని అంటున్నారు. అయితే ఈ పనోరమిక్ సన్‌రూఫ్ టాప్-ఎండ్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.


ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
మిడ్-స్పెక్ వేరియంట్‌లోనూ సింగిల్-పేన్ (Single Pane) సన్‌రూఫ్‌తో రావచ్చు. అయితే పనోరమిక్ సన్‌రూఫ్‌లతో కూడిన మోడళ్ల ధర ఎక్కువగానే ఉంటుంది. ఈ లెక్కన చూసుకుంటే మహీంద్రా థార్‌ ధర కూడా ఎక్కువే ఉండే అవకాశం ఉంది. ఇక ఈ కారు ఇంటీరియర్‌ టీజర్‌ ప్రకారం బిగ్‌ ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి.


ఇంజిన్ ఆప్షన్స్‌ & సేఫ్టీ
థార్ ROXXలో సేఫ్టీ కోసం లెవల్‌ 2 ADAS ఫీచర్లను అందించనుంది. అంతే కాకుండా 360-డిగ్రీల సరౌండ్ వ్యూ మానిటర్ ఆటో-డిమ్మింగ్ IRVMలు ఉండనున్నాయి. 3-డోర్‌లో ఉపయోగించే 2.0-లీటర్ mStallion టర్బో పెట్రోల్ ఇంజిన్, 2.2-లీటర్ mHawk డీజిల్ ఇంజిన్  ఇందులోనూ వినియోగించనున్నారు. ఈ ఎస్‌యూవీ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో రానుంది. ఫోర్-వీల్ డ్రైవ్ సెటప్‌తో రియర్-వీల్ డ్రైవ్‌ను ప్రామాణికంగా అందించనున్నారు. ఈ ఫీచర్ల చేర్పుతో మహీంద్రా థార్ ROXX కేవలం ఆఫ్-రోడర్‌గా మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఎస్‌యూవీగా మారిపోనుంది.