Mahindra Thar On Road Price Hyderabad: రోడ్డుపై వెళ్తుంటే అందరి దృష్టిని ఆకర్షించే ఏకైక రఫ్‌ టఫ్‌ ఎస్‌యూవీ మహీంద్రా థార్. నేటి జెన్‌జీ, మిలియనియల్స్‌ డ్రీమ్ కార్ల లిస్ట్‌లో థార్‌దే అగ్రస్థానం. సిటీ రోడ్లపై దర్జాగా వెళ్లడమే కాకుండా, టఫ్‌ రోడ్లపైకూడా దూసుకెళ్లే ఈ వెహికల్‌ కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్‌ లాంటి మెట్రో నగరంలో ఉన్న వారు ఈ కారు కొనాలి అంటే మొత్తం ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదు. నెల నెల ఈఎంఐ ద్వారా చెల్లించి తీసుకోవచ్చు. అయితే ఇలా ఈఎంఐపై కారు కొనాలి అంటే డౌన్‌పేమెంట్ ఎంత చెల్లించాలి? ఆన్‌రోడ్ ప్రైస్ ఎంతో చూద్దాం.

Continues below advertisement

మహీంద్రా థార్ కొనుగోలు చేసే ముందు ఆన్‌రోడ్ ప్రైస్, వేరియంట్లు గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఈ థార్ లైనప్‌లో రియల్ వీల్ డ్రైవ్, ఫోర్‌ వీల్ డ్రైవ్ అనే రెండు ప్రధాన కేటగిరీలు ఉన్నాయి. నగరంలో మాత్రమే డ్రైవ్ చేస్తూ, లుక్స్ మాత్రమే కావాలనుకునే వారికి RWD మోడల్స్‌ బెస్ట్‌ బడ్జెట్ ఆప్షన్. అదే సమయంలో ఆఫ్‌ రోడింగ్‌, అడ్వెంచర్ ఇష్టపడే వారికి 4X4 వేరియంట్లు పర్ఫెక్ట్‌. 

మహీంద్రా థార్ ఆన్‌రోడ్‌ ప్రైస్ ఎంత?

హైదరాబాద్‌లో తెలంగాణ లైఫ్‌ టైమ్ రోడ్ టాక్స్‌, ఇన్సూరెన్స్‌, ఫాస్టగ్, టీసీఎస్‌ కలుపుకొని ఆన్‌రోడ‌ ధరలు ఇలా ఉన్నాయి. మహీద్రా థార్ RWD AX(O) హార్డ్‌ టాప్ డీజిల్‌ ఎక్స్‌ షోరూమ‌ ధర సుమారు 11.35 లక్షలు కాగా, హైదరాబాద్‌లో అన్ని పన్నులతో కలిపి ఆన‌రోడ్‌ ధర దాదాపు 13.80 లక్షలు ఉంటుంది. 

Continues below advertisement

మహీంద్రా థార్‌ RWD LX హార్డ్‌ టాప్ డీజిల్‌  కారు బెస్ట్ సెల్లింగ్ వెర్షన్. ఎక్స్‌ షోరూమ్‌ ధర 12.85 లక్షలు ఉండగా, హైదరాబాద్‌ ఆన్‌రోడ్‌ ధర 15. 55 లక్షల వరకు ఉంటుంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్ కోరుకునే వారి కోసం మహీంద్రా థార్ 4X4 LX హార్డ్ టాప్ పెట్రోల్‌     (AT) మంచి ఆప్షన్. హైదరాబాద్‌లో ఆన‌రోడ్‌ ధర 18.40 లక్షలు. ఆఫ్‌ రోడింగ్‌ ప్రియుల హాట్ ఫేవరేట్‌గా ఉన్న మహీంద్రా థార్ 4X4 LX హార్డ్ టాప్ డీజిల్‌ మాన్యువల్ కారు ధర హైదరాబాద‌లో 18.90 లక్షలు. ఇది టాప్‌ ఎండ్‌ మోడల్‌ అయిన మహీంద్రా థార్‌ 4X4 ఎల్‌ఎక్స్‌ హార్డ్‌ టాప్‌ డీజిల్‌ ఆటోమేటిక్‌ కారు ఆన్‌రోడ్‌ ధర హైదరాబాద్‌ మార్కెట్‌లో 20.50 లక్షల వరకు చేరుకుటుంది. 

డౌన్‌పేమెంట్‌ ఎంత చెల్లించాలి?

బ్యాంకులు మీ సిబిల్ స్కోర్, ఆదాయ ప్రాతిపికన ఆన్‌రోడ్‌ ధరపై 80 శాతం నుంచి 90 శాతం వరకు కారు రుణాన్ని మంజూరు చేస్తాయి. మిగిలిన పది శాతం నుంచి ఇరవై శాతం మొత్తాన్ని మీరు డౌన్‌పేమెంట్‌ రూపంలో ీ సొంత నిధుల నుంచి చెల్లించాల్సి ఉంటుంది. 

థార్‌ RWD LX డీజిల్‌‌ కారు కొనాలి అంటే మీరు కనీసం ఇరవై శాతం డౌన్‌పేమెంట్‌ చెల్లించాలి. సుమారు 3.11 లక్షలు డౌన్‌పేమెంట్‌ రూపంలో చెల్లించాలి. ఒక వేళ బ్యాంక్ మీకు 90 శాతం లోన్ ఇస్తే మీ డౌన్‌పేమెం్‌ దాదాపు 1.55 లక్షలు సరిపోతుంది. అదే థార్‌ 4X4ఎల్‌క్స్ డీజిల్ కారు కొనాలి అంటే ఇరవై శాతం డౌన్‌పేమెంట్‌ ప్లాన్ ప్రకారం కనీసం 3.78 లక్షలు డౌన‌పేమెంట్ చెల్లించాలి. డౌన్‌పేమెంట్‌  ఎంత ఎక్కువ కడితే మీకు వచ్చే అప్పు తగ్గుతుంది. మీపై పడే రుణభారం తగ్గుతుంది. నెల నెలా చెల్లించే ఈఎంఐ తగ్గుతుంది. 

నెలవారీ EMI ఎంత పడుతుంది?

ప్రస్తుతం ఆటో లోన్‌పై బ్యాంకులు 8.85 నుంచి 9.50 శాతం వరకు వార్షిక వడ్డీరేటును వసూలు చేస్తున్నాయి. మనం సగటు వడ్డీ రేటును 9.5 శాతంగా భావించి EMI లెక్కలు చూద్దాం. 

థార్‌ RWD ఎల్‌ఎక్‌ డీజిల్‌ 12.44 లక్షల లోన్‌పై ఐదేళ్లకు కొనుగోలు చేస్తే నెలకు 26, 100 రూపాయల EMI చెల్లించాలి. అదే ఏడేళ్ల టెన్యూర్‌లో నెలకు 20,300 వరకు EMI చెల్లించాలి. 

ధారర్‌ 4X4 ఎల్‌ఎక్స్‌ డీజిల్ మాన్యువల్‌ కారు కొనాలి అంటే బ్యాంకు నుంచి ధర 15. 12 లక్షలు లోన్ ద్వారా తీసుకోవాలి. దీన్ని ఐదేళ్ల కాలపరిమితికి తీసుకుంటే నెలకు 31, 700 రూపాయలు చెల్లించాలి. అదే ఏడేళ్లకు తీసుకుంటే 24, 650రూపాయలు EMI చెల్లించాలి. 

మహీంద్రా థార్ కొనాలంటే మీకు నెలకు ఎంత శాలరీ రావాలి?

ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్‌ చెప్పినట్టు 20/4/10 రూల్ ప్రకారం, కనీసం 20 శాతం డౌన్‌పేమెంట్ చెల్లించాలి. లోన్ కాలపరిమితి 4 ఏళ్లకు మించకూడదు. మీ కారు ఆపరేటింగ్ ఖర్చులు మీ నెలవారీ నిక ఆదాయంలో పది శాతం నుంచి 15 శాతం మించకూడదు. 

దీని ప్రకారం థార్ RWD మోడల్‌ కోసం మీ నెలవారీ EMI సుమారు 26వేలు చెల్లించాలి. ఇంధన ఖర్చులు, ఇన్సూరెన్స్‌ రిజర్వ్‌ కలిపి నెలకు 32వేలు అవుతుంది. మీ చేతికి వచ్చే నికర జీతం నెలకు కనీసం 1, 10,000 నుంచి 1, 30,000 వరకు ఉండాలి. థార్‌4X4 మోడల్‌ కోసం మీ నెలవారీ ఈఎంఐ సుమారు 32వేలు ప్లస్‌ ఇంధన ఖర్చులు కలిపి నెలకు 40వేల దాటుతాయి. కాబట్టి మీ నెలవారీ కనీస శాలరీ లక్షా యాభైవేలకుపైనే ఉండాలి. 

మీకు ఎలాంటి ఇతర లోన్లు లేకుంటే ఈ ప్లాన్ సరిగా సరిపోతుంది. లేకుంటే లెక్కలు తప్పుతాయి. అప్పులు పాలవుతారు. 

కారు కొనే ముందు పాటించాల్సిన చిట్కాలు

మీ సిబి్ స్కోర్‌ 750 కంటే ఎక్కువ ఉంటే బ్యాంకుల్లో తక్కువ వడ్డీ రేటుకే రుణం లభిస్తుంది. హైదరాబాద్‌లోని విభిన్న మహీంద్రా డీలర్‌షిప్‌లను సంప్రదించి కార్పొరేట్‌ డిస్కౌంట్‌, ఎక్స్చేంజ్‌ బోనస్‌ , ఇన్సూరెన్స్‌ క్యాష‌బ్యాక్‌ కోసం చర్చించండి. షోరూమ్‌ ప్రతిపాదించే ఇన్సూరెన్స్‌ ప్రీమియం కంటే ఆన్‌లైన్‌లో బయట థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ పోర్టల్స్‌లో పొందే ఇన్సూరెన్స్‌ పదిహేను వేలు నుంచి 25వేల వరకు చౌకా లభిస్తుంది.