Mahindra Thar Armada 5 door Launch Date: మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి అత్యంత ఆదరణ పొందిన పొందిన కార్లలో థార్ కూడా ఒకటి. ప్రస్తుతం థార్‌లో మూడు డోర్స్ వేరియంట్ కూడా బాగా సక్సెస్ అయింది. తాజాగా Thar Armada పేరుతో 5 డోర్స్ వేరియంట్‌ను మహీంద్రా కంపెనీ లాంఛ్ చేయనుంది. ఈ 5 డోర్స్ వేరియంట్ లుక్స్ తాజాగా లీక్ అవ్వడంతో ఇది థార్ 3 డోర్స్ వేరియంట్ కన్నా చాలా స్పెషల్ గా కనిపిస్తున్నట్లు అర్థం అవుతోంది. 3 డోర్ల థార్‌తో పోల్చి చూస్తే.. 5 door Armada లో గుండ్రంగా ఉన్న ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. పైగా గ్రిల్ కూడా చాలా వైవిధ్యంగా ఉంది. డబుల్ స్లాట్స్‌తో ఉన్న ఈ డిఫరెంట్ పాటర్న్ చాలా ఆకట్టుకునేలా ఉంది. 3 door Thar లో 7 స్లాట్ గ్రిల్ ఉండేది.
5 door Armada సైడ్ వ్యూ చూస్తే.. లాంగ్ వీల్ బేస్ ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఎక్స్ ట్రా సెట్ డోర్స్ కారణంగా వాహనం పొడవుగా కనిపిస్తోంది. ఇంకా మిర్రర్ పై కెమెరా ఉండటం కూడా గమనించవచ్చు. అంటే 360 డిగ్రీ కెమెరా ఆఫర్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వెనుక డోర్ హ్యాండిల్ లొకేషన్ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మరోవైపు, ముందున్న డోర్స్ కంటే వెనుక డోర్స్ కాస్త చిన్నవిగా కనిపిస్తున్నాయి. 3 డోర్స్ థార్‌తో పోలిస్తే ఈ 5 డోర్ వేరియంట్ మరింత ప్రీమియంగా కనిపిస్తుంది. చిన్న థార్ కంటే ఈ పెద్ద థార్ చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇంకా Thar Armada లో మరింత ప్రీమియం క్యాబిన్, మరిన్ని ఫీచర్స్ ఉన్నట్లుగా చెబుతున్నారు. 10.25 అంగుళాల స్క్రీన్.. 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లేతో పాటు సన్ రూఫ్, 360 డిగ్రీస్ కెమెరా ప్లస్ ADAS ఫీచర్ టెక్నాలజీ కూడా ఉంటుంది. ఇంక ఇంజిన్ వేరియంట్‌లు థార్ 3 డోర్ వేరియంట్ మాదిరిగానే ఉండే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
దీంట్లో టర్బో పెట్రోల్, డీజిల్‌తో పాటు ఫోర్ వీల్ డ్రైవ్ పవర్ ట్రెయిన్ రెండు కలిపి లభ్యం అవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే రేర్ వీల్ డ్రైవ్ ప్రామాణికంగా ఉంటుంది. లాంచ్ ఆగస్ట్ 15వ తేదీన ఉంటుందని అంటున్నారు. 3 డోర్ కంటే ఈ 5 డోర్ థార్ ధర కొంచెం ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు. మహీంద్రా వాహనాల శ్రేణిలో ఉన్న స్కార్పియో N కంటే ఈ 5 డోర్ థార్ ఖరీదైనదిగా చెబుతున్నారు. మరిన్ని ఫీచర్ల కారణంగానే వీటి ధరల్లో బాగా వ్యత్యాసం ఉంటుందని అంటున్నారు.