Mahindra Scorpio N New Variant Features: మహీంద్రా & మహీంద్రా, తన సూపర్‌ పాపులర్‌ SUV స్కార్పియో N ను కొత్త అవతారంలో పరిచయం చేయబోతోంది. ఈసారి కంపెనీ Level 2 ADAS టెక్నాలజీని & మరికొన్ని ప్రీమియం ఫీచర్లను యాడ్ చేయబోతోంది. దీంతో, ఈ ఫోర్‌వీలర్‌ XUV700 & Thar Roxx వంటి మహీంద్రా ప్రీమియం SUVల లిస్ట్‌లో స్కార్పియో N కూడా చోటు సంపాదిస్తుంది.

లెవెల్‌ 2 ADAS ఫీచర్‌మహీంద్రా స్కార్పియో N కొత్త వేరియంట్ ఇప్పుడు "అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్" (ADAS) టెక్నాలజీతో రోడ్డుపైకి రావడానికి రెడీగా ఉంది. ఈ సిస్టమ్‌లో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, ఫ్రంట్ కొలిషన్ వార్నింగ్ & ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఇవన్నీ మీ డ్రైవింగ్‌కు అదనపు రక్షణ కవచాలుగా మారతాయి. అంతేకాదు, స్కార్పియో N ను ఈ విభాగంలో మరింత ప్రీమియం & స్మార్ట్ ఆప్షన్‌గా మారుస్తాయి.

ఇంజిన్ & టెక్నాలజీమహీంద్రా స్కార్పియో N కొత్త వేరియంట్ కేవలం టెక్నాలజీకే పరిమితం కాదు, ఇంటీరియర్‌ కూడా మారుతుంది. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రికల్ పవర్డ్ డ్రైవర్ సీటు, పవర్డ్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, కొత్త సీట్‌ కవర్‌ డిజైన్‌తో కారు క్యాబిన్‌ మోడర్న్‌గా & లగ్జరీగా కనిపిస్తుంది.

ఈ SUV ఇంజిన్‌ గురించి చెప్పడానికి ఏమీ లేదు, ఎందుకంటే ఎటువంటి మార్పు చేయలేదు. కొత్త స్కార్పియో N వేరియంట్‌లో మునుపటి 2.0L mStallion టర్బో పెట్రోల్ & 2.2L mHawk డీజిల్ ఇంజన్‌ ఆప్షన్సే ఉన్నాయి. అలాగే, 6-స్పీడ్ మాన్యువల్ & 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్‌లోనూ మీరు ఒకదానిని ఎంపిక చేసుకోవచ్చు.

ధర ఎంత?ఈ కొత్త వేరియంట్ స్కార్పియో N ప్రస్తుత Z8 ట్రిమ్‌ కంటే కొంచం అడ్వాన్స్‌డ్‌గా & ప్రీమియంగా ఉంటుంది. ఈ ఫోర్‌వీలర్‌ ఇంకా లాంచ్‌ కాలేదు కాబట్టి రేటు కచ్చితంగా వెల్లడికాలేదు. అయితే దీని ధర రూ. 22 లక్షల నుంచి రూ. 23 లక్షల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. మహీంద్రా స్కార్పియో N కొత్త వేరియంట్ లాంచ్ మరికొన్ని వారాల్లో ఉంటుందని భావిస్తున్నారు.

మహీంద్రా & మహీంద్రా బ్రాండ్‌ బెస్ట్‌ సెల్లర్స్‌లో మహీంద్రా స్కార్పియో N కూడా ఒకటి. ట్రెండ్‌ & టెక్నాలజీకి అనుగుణంగా మహీంద్రా పరిచయం చేస్తున్న కొత్త మార్పుల కారణంగా ఈ SUV ఇప్పటికీ కస్టమర్‌ ఫేవరెట్‌ వెహికల్‌. అయితే, ADAS వంటి అప్‌డేట్స్‌ కారణంగా ఇది XUV700 & XUV3XO వంటి తన సిస్టర్‌ SUVలతోనే పోటీ పడాల్సి ఉంటుంది. అయితే.. స్మార్ట్‌నెస్‌ను, అప్‌డేడెట్‌ టెక్నాలజీని ఇష్టపడే కస్టమర్లను స్కార్పియో N ఆకర్షిస్తుందని ఎక్స్‌పర్ట్స్‌ భావిస్తున్నారు.