Mahindra BE 6 Sporteq Price, Range And Features Telugu: మహీంద్రా BE 6 ఇప్పుడు కొత్త రూపంలో వచ్చింది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ SUV పేరుకు Sporteq అనే కొత్త సఫిక్స్‌ను జోడించింది. దీంతో పాటు కొత్త ఫీచర్లు, కొత్త బ్యాటరీ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. వేరియంట్ల సంఖ్యను కూడా పెంచింది. మరి, వీటిలో ఏ వేరియంట్‌ కొనడం మంచిది?

Continues below advertisement

ధరలుBE 6 Sporteq ధరలు రూ.19.45 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. టాప్‌ వేరియంట్‌ ధర రూ.26.95 లక్షల వరకు ఉంటుంది. ఇవన్నీ ఎక్స్‌షోరూమ్‌ ధరలు. హోమ్‌ ఛార్జర్‌ & ఇన్‌స్టాలేషన్‌ ఖర్చులు అదనం.

వేరియంట్లుBE 6 Sporteqలో One, Two, Three, Three+, Four, FE, FE Four అనే వేరియంట్లు ఉన్నాయి. FE అంటే Formula E Freedom Edition. ఇది స్పోర్టియర్‌ డిజైన్‌తో వస్తుంది. Launch Edition కూడా ఉంది. ఇది Four వేరియంట్‌ ఆధారంగా రూపొందింది. దీనికి ప్రత్యేకమైన ఇంటీరియర్‌ & ఎక్స్‌టీరియర్‌ ఫినిష్‌లు ఉన్నాయి.

Continues below advertisement

బ్యాటరీబ్యాటరీ విషయంలోనూ మార్పు వచ్చింది. 59kWh, 79kWh బ్యాటరీలతో పాటు కొత్తగా 70kWh బ్యాటరీ ఆప్షన్‌ కూడా తీసుకొచ్చారు. ఈ మూడు బ్యాటరీ ఆప్షన్లలోనూ వెనుక వైపు ఒకే ఎలక్ట్రిక్ మోటార్‌ ఉంటుంది. ఇది రియర్‌ వీల్‌ డ్రైవ్‌ వ్యవస్థతో పనిచేస్తుంది.

ఇది కూడా చదవండి: మారుతి బలెనో కొనేవాళ్లు కొన్ని రోజులు ఆగండి, సెప్టెంబర్‌ 5న వచ్చే కొత్త మోడల్‌లో కీలక మార్పులు!

రేంజ్‌59kWh బ్యాటరీతో 231hp పవర్‌ లభిస్తుంది, దీని MIDC రేంజ్‌ 548 కిలోమీటర్లు. 70kWh బ్యాటరీ 245hp పవర్‌ ఇస్తుంది, దీని రేంజ్‌ 651 కిలోమీటర్లు. 79kWh బ్యాటరీతో 286hp పవర్‌ లభిస్తుంది, ఇది సింగిల్‌ ఛార్జ్‌తో 683 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ చెబుతోంది.

ఛార్జింగ్‌ టైమ్‌ఇక ఛార్జింగ్‌ సామర్థ్యం కూడా బ్యాటరీని బట్టి మారుతుంది. 59kWh బ్యాటరీకి గరిష్ఠంగా 120kW DC ఛార్జింగ్‌ సపోర్ట్‌ ఉంది. 70kWh బ్యాటరీ 160kW వరకు, 79kWh బ్యాటరీ 180kW వరకు DC ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేస్తుంది. 20 నుంచి 80 శాతం వరకు ఛార్జ్‌ చేయడానికి మూడు బ్యాటరీలకు దాదాపు 20 నిమిషాల సమయం పడుతుంది.

BaaSBE 6 Sporteqలో అంటే బ్యాటరీని అద్దెకు తీసుకునే విధానం (BaaS) కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ ఎంపికతో.. One వేరియంట్‌ ధర రూ.11.45 లక్షలకు, Two వేరియంట్‌ ధర రూ.12.95 లక్షలకు తగ్గుతుంది. అయితే ప్రతి కిలోమీటర్‌కు రూ.3.75 బ్యాటరీ అద్దె చెల్లించాలి.

ఫీచర్లు ఫీచర్ల విషయంలో.. బేస్‌ వేరియంట్‌ అయిన One కూడా ఏమాత్రం తగ్గడం లేదు. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, వెనుక కెమెరా, టైర్‌ ప్రెజర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌, LED హెడ్‌ల్యాంప్‌లు, ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, 12.3 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్‌, 12.3 అంగుళాల డ్రైవర్‌ డిస్‌ప్లే, వైర్‌లెస్‌ Android Auto & Apple CarPlay వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: ఒకే ఛాసిస్‌.. కానీ లుక్‌, ఇంటీరియర్‌, ఫీచర్లలో భారీ తేడాలు.. మహీంద్రా స్కార్పియో ఎన్‌ vs లైఫ్‌స్టైలర్‌!

Two వేరియంట్‌లో, One వేరియంట్‌లో ఉన్న ఫీచర్లతో పాటు 16-స్పీకర్‌ Harman Kardon ఆడియో సిస్టమ్‌, Dolby Atmos, ప్యాసింజర్‌ స్క్రీన్‌, డిజిటల్‌ కీ, 540-డిగ్రీ కెమెరా, డ్యూయల్‌-జోన్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ వంటివి అదనంగా వస్తాయి. 

Three వేరియంట్‌లో Two వేరియంట్‌లో ఉన్న ఫీచర్లతో పాటు నుంచి పానోరమిక్‌ గ్లాస్‌ రూఫ్‌, వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్లు, పవర్‌డ్‌ డ్రైవర్‌ సీటు వంటివి కూడా యాడ్‌ అవుతాయి. Three+లో Level 2 ADAS, పవర్‌డ్‌ టెయిల్‌గేట్‌, యాంబియంట్‌ లైటింగ్‌, ఫ్రంట్‌ ఫాగ్‌ ల్యాంప్స్‌ వంటి అదనపు సదుపాయాలు ఉన్నాయి.

Four వేరియంట్‌లో 79kWh బ్యాటరీ ఉంటుంది. ఇందులో, పైన చెప్పిన అన్ని ఫీచర్లతో పాటు 7 ఎయిర్‌బ్యాగ్‌లు, Level 2+ ADAS, హెడ్‌-అప్‌ డిస్‌ప్లే, ఆటో పార్క్‌ అసిస్ట్‌, క్యాబిన్‌ ఎయిర్‌ ప్యూరిఫైయర్‌, Google Gemini ఇంటిగ్రేషన్‌, డ్యాష్‌క్యామ్‌ వంటి అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు లభిస్తాయి.

ఏ వేరియంట్‌ బెస్ట్‌?అందరికీ టాప్‌ వేరియంట్‌ అవసరం లేదు. ధర, ఫీచర్లు & బ్యాటరీ ఆప్షన్లను పరిగణనలోకి తీసుకుంటే Three వేరియంట్‌ బెస్ట్‌ వాల్యూ ఆప్షన్‌గా నిలుస్తుంది. ఇందులో మూడు బ్యాటరీ ఆప్షన్లను ఎంచుకునే అవకాశం ఉంది. పానోరమిక్‌ రూఫ్‌, వెంటిలేటెడ్‌ సీట్లు, పవర్‌డ్‌ డ్రైవర్‌ సీటు, ట్రిపుల్‌ స్క్రీన్‌ సెటప్‌ వంటి ఉపయోగకరమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. కాబట్టి, ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా మంచి బ్యాలెన్స్‌ కోరుకునేవారికి BE 6 Sporteq Three వేరియంట్‌ మంచి ఎంపిక.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.