Lexus India new Smart Ownership Plan Latest Updates: లెక్సస్ ఇండియా స్మార్ట్ ఓనర్‌షిప్ అనే కొత్త ప్లాన్‌ను తాజాగా ప్రవేశపెట్టింది. దీని ఉద్దేశం విలాసవంతమైన కార్లను కొనాలనుకునే వారికి సౌకర్యవంతమైన, ఈజీగా ఉండే ఈఎంఐ లను అందిస్తోందని తెలుస్తోంది. ముఖ్యంగా, తొలిసారి లగ్జరీ కారును కొనాలనుకునే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని సమాచారం. దీని ద్వారా అతి సులభంగా లెక్సస్ వాహనాన్ని సొంతం చేసుకోనేలా ఈ ప్లాన్ ను రూపొందించారు. ఈ ప్లాన్‌ను ‘లెక్సస్ ప్రామిస్’ పధకంలో భాగంగా అందిస్తున్నారు. లెక్సస్ ఇండియా అధ్యక్షుడు హికారూ ఇకెఉచి మాట్లాడుతూ ఈ కొత్త ప్లాన్ ద్వారా తాము భారత మార్కెట్ పట్ల ఉన్న నిబద్ధతను చూపిస్తున్నామని తెలిపారు. అతిథుల అవసరాలను ముందుగానే గ్రహించి, వారు ఆశించే సౌకర్యం , కంఫర్టబిలిటీని అందించాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఇది ప్రస్తుతం మారుతున్న వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఉంటుందని, అధిక ఖర్చులు లేకుండా విలాసవంతమైన వాహనాన్ని పొందాలనుకునే వారికి ఇది సరైన మార్గమని తెలిపారు.
కీలక సదుపాయం..
ఈ స్మార్ట్ ఓనర్‌షిప్ ప్లాన్‌లో “Assured Buyback” అనే ఒక ముఖ్యమైన సదుపాయం ఉందని కంపెనీ తెలిపింది. దీని ద్వారా వినియోగదారులు పథకం గడువు ముగిసిన తర్వాత మూడు ఎంపికల్లో ఒకదాన్ని ఎంచుకోవచ్చని తెలుస్తోంది. వాహనాన్ని తిరిగి ఇవ్వవచ్చు – ఇకపై ఎలాంటి బాధ్యతలు ఉండవు. లేదా ముందే నిర్ణయించిన కొనుగోలు ధరను (Guaranteed Future Value) చెల్లించి వాహనాన్ని కొనసాగించవచ్చు లేకపోతే కొత్త లెక్సస్ కారుకు మారవచ్చు ఈ కొనుగోలు ధరను ముందుగానే తెలియజేస్తారు, అందువల్ల వాహనపు విలువ తగ్గే భయమూ ఉండదు, తిరిగి అమ్మే విషయంలో సమస్యలూ ఉండవు. ఈ ప్లాన్‌ను లెక్సస్ ES, NX, మరియు RX మోడళ్లపై అందిస్తున్నారు.
ప్రతి మూడేళ్లకోసారి..
ఇంకా, వినియోగదారులు ప్రతి 3 నుంచి 5 సంవత్సరాలకోసారి కొత్త లెక్సస్ కారుకు మారే అవకాశం పొందుతారని తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల వారు ఎప్పటికప్పుడు తాజా డిజైన్, భద్రత, కొత్త ఫీచర్లతో కూడిన కార్లను వినియోగించవచ్చు. 2017లో భారతదేశంలో లెక్సస్ ప్రారంభమైనప్పటి నుంచి, జపాన్ సాంప్రదాయమైన ‘ఒమోటెనాశి’ అనే మోడాల్ ను అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలో 2024 జూన్ 1 నుండి లెక్సస్ ఇండియాలో అమ్మే అన్ని కొత్త కార్లకు 8 సంవత్సరాలు లేదా 160,000 కిమీ వరకు వారంటీ ఇస్తున్నారు. అలాగే, వారు "లెక్సస్ లగ్జరీ కేర్" పేరుతో సేవా ప్యాకేజీలను ప్రారంభించారు. ఇవి Comfort, Relax, Premiere అనే మూడు రూపాల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ ప్యాకేజీలు 3 సంవత్సరాలు లేదా 60,000 కిమీ, 5 సంవత్సరాలు లేదా 100,000 కిమీ .. 8 సంవత్సరాలు లేదా 160,000 కిమీ వరకు అందుబాటులో ఉన్నాయి.