KTM 390 Adventure India: భారత మార్కెట్‌లో యూత్‌కు బాగా దగ్గరైన అడ్వెంచర్‌ బైక్‌ KTM 390 Adventure ఇప్పుడు మూడు వేర్వేరు వేరియంట్లలో అందుబాటులో ఉంది. తాజాగా KTM 390 Adventure R లాంచ్‌ కావడంతో, ఈ ఫ్యామిలీ మరింత బలపడింది. ఈ మూడు మోటార్‌ సైకిళ్లలో ఒకే 390cc ఇంజిన్‌ ఉన్నప్పటికీ... యూసేజ్‌, సస్పెన్షన్‌, వీల్స్‌, గ్రౌండ్‌ క్లియరెన్స్‌ వంటి అంశాల్లో భారీ తేడాలు ఉన్నాయి. ధరలు రూ.3.28 లక్షల నుంచి రూ.3.97 లక్షల వరకు (ఎక్స్‌-షోరూమ్‌) ఉన్నాయి.

KTM 390 Adventure X: రోడ్‌ టూరింగ్‌ లవర్స్‌ కోసం

KTM 390 Adventure X ధర రూ.3.28 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). ఇది ఈ సిరీస్‌లో ఎంట్రీ లెవెల్‌ వేరియంట్‌. ఎక్కువగా హైవేలు, నగర రోడ్లపై ప్రయాణించే రైడర్లకు ఇది బాగా సరిపోతుంది. ఈ బైక్‌లో 19 ఇంచుల ఫ్రంట్‌, 17 ఇంచుల రియర్‌ అలాయ్‌ వీల్స్‌, ట్యూబ్‌లెస్‌ టైర్లు ఉన్నాయి. సస్పెన్షన్‌ ట్రావెల్‌ ఫ్రంట్‌లో 200mm, రియర్‌లో 205mm కాగా, 228mm గ్రౌండ్‌ క్లియరెన్స్‌ ఇస్తుంది.సీట్‌ హైట్‌ 825mm, కర్బ్‌ వెయిట్‌ 181kg కావడంతో, ఈ మూడు వేరియంట్లలో ఇదే తేలికైనది.ఫీచర్లలో 5 ఇంచుల TFT డిస్‌ప్లే, ప్రొజెక్టర్‌ LED హెడ్‌ల్యాంప్స్‌, క్విక్‌షిఫ్టర్‌, క్రూయిజ్‌ కంట్రోల్‌, ట్రాక్షన్‌ కంట్రోల్‌, రైడింగ్‌ మోడ్‌లు ఉన్నాయి. కార్నరింగ్‌ ట్రాక్షన్‌ కంట్రోల్‌ లేకపోవడం తప్ప, టూరింగ్‌కు ఇది బెస్ట్‌ వాల్యూ ఆప్షన్‌గా నిలుస్తుంది.

KTM 390 Adventure R: పక్కా ఆఫ్‌రోడ్‌ రైడర్ల కోసం

KTM 390 Adventure R ధర రూ.3.78 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). ఇది ఈ లైనప్‌లో అత్యంత ఆఫ్‌రోడ్‌ ఫోకస్‌డ్‌ మోడల్‌. ట్యూబ్‌ టైప్‌ టైర్లు ఉండటం వల్ల, స్టాండర్డ్‌ అడ్వెంచర్‌తో పోలిస్తే ధర కొంచెం తక్కువగా ఉంది.ఈ బైక్‌లో 21 ఇంచుల ఫ్రంట్‌, 18 ఇంచుల రియర్‌ స్పోక్‌ వీల్స్‌, Mitas ఆఫ్‌రోడ్‌ టైర్లు ఉన్నాయి. సస్పెన్షన్‌ ట్రావెల్‌ ముందు, వెనుక రెండింటిలోనూ 230mm ఉండటం ప్రధాన హైలైట్‌.272mm గ్రౌండ్‌ క్లియరెన్స్‌, 880mm సీట్‌ హైట్‌ దీనిని అత్యంత ఎత్తైన బైక్‌గా నిలబెడతాయి. కర్బ్‌ వెయిట్‌ 183kg. ఆఫ్‌రోడ్‌ అనుభవం ఉన్న రైడర్లకు ఇది నిజమైన అడ్వెంచర్‌ ఆయుధం.

KTM 390 Adventure: ఆల్‌ రౌండర్‌ ఎంపిక

KTM 390 Adventure ధర రూ.3.97 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). ఇది X, R మధ్యలో నిలిచే మోడల్‌.21 ఇంచుల ఫ్రంట్‌, 17 ఇంచుల రియర్‌ ట్యూబ్‌లెస్‌ స్పోక్‌ వీల్స్‌, అడ్జస్టబుల్‌ సస్పెన్షన్‌ దీనికి ప్రధాన బలం. గ్రౌండ్‌ క్లియరెన్స్‌ 237mm, సీట్‌ హైట్‌ 830mm.కార్నరింగ్‌ ట్రాక్షన్‌ కంట్రోల్‌తో సహా అన్ని ఎలక్ట్రానిక్‌ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీనితో తరచూ ఆఫ్‌రోడ్‌ చేయొచ్చు & బెస్ట్‌ బ్యాలెన్స్‌ ఆప్షన్‌గానూ నిలుస్తుంది.

తెలుగు రాష్ట్రాల రైడర్లకు ఏది సరైనది?

హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో టూరింగ్‌ ఎక్కువైతే Adventure X... అడవులు, ట్రెయిల్స్‌ అంటే ఇష్టమైతే Adventure R... ఈ రెండూ కావాలంటే స్టాండర్డ్‌ Adventure మంచి ఎంపికగా చెప్పొచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.