KTM 390 Adventure Offer: అడ్వెంచర్‌ బైక్‌ కొనాలనుకుంటున్నవారికి KTM ఇండియా నుంచి ఓ మంచి అవకాశం వచ్చింది. KTM 390 Adventure, KTM 390 Adventure X మోడళ్లపై కంపెనీ మొత్తం ₹10,000 వరకు బెనిఫిట్స్‌ అందిస్తోంది. ఈ ఆఫర్‌ లిమిటెడ్‌ టైమ్‌ మాత్రమేనని కంపెనీ స్పష్టం చేసింది.

Continues below advertisement

ఈ ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా, కస్టమర్లకు ₹8,350 విలువైన యాక్సెసరీస్‌ను పూర్తిగా ఉచితంగా ఇస్తోంది. అలాగే సాధారణంగా అదనంగా చెల్లించాల్సిన 10 ఏళ్ల ఎక్స్‌టెండెడ్‌ వారంటీ (విలువ ₹2,650) కూడా ఫ్రీగా అందిస్తోంది.

ఫ్రీగా లభించే యాక్సెసరీస్‌ ఇవే:

Continues below advertisement

హెడ్‌ల్యాంప్‌ ప్రొటెక్టర్‌

మడ్‌ఫ్లాప్‌ ఎక్స్‌టెన్షన్‌

లోయర్‌ ఫెండర్‌

సెంటర్‌ స్టాండ్‌

టూరింగ్‌ సీట్‌

బైక్‌ కవర్‌

ఇవన్నీ ఆఫ్‌రోడింగ్‌, లాంగ్‌ టూరింగ్‌ చేసే వారికి ఉపయోగపడే యాక్సెసరీసే కావడం విశేషం.

10 ఏళ్ల వారంటీ ప్రత్యేక ఆకర్షణ

ఈ ఆఫర్‌లో మరో ముఖ్యమైన అంశం 10 ఏళ్ల ఎక్స్‌టెండెడ్‌ వారంటీ. సాధారణంగా దీనికోసం అదనంగా చెల్లించాలి. కానీ ఇప్పుడు KTM ఈ వారంటీని పూర్తిగా ఉచితంగా ఇస్తోంది. బైక్‌ను తమ దగ్గరే ఎక్కువ కాలం కొనసాగించేవాళ్లకు ఇది పెద్ద ప్లస్‌ పాయింట్‌.

ఇంజిన్‌, మెకానికల్‌ వివరాలు

ఈ బైక్‌లో 399cc సింగిల్‌ సిలిండర్‌, లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌ ఉంది. ఇది 46hp శక్తి, 39Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్‌ గేర్‌బాక్స్‌తో పాటు బై-డైరెక్షనల్‌ క్విక్‌షిఫ్టర్‌ కూడా అందుబాటులో ఉంటుంది.

ఫీచర్లు & రైడింగ్‌ అనుభవం

KTM 390 Adventure, ర్యాలీ స్పూర్తితో రూపొందించిన డిజైన్‌తో పాటు మోడ్రన్‌ ఫీచర్లను అందిస్తోంది.

క్రూయిజ్‌ కంట్రోల్‌

ట్రాక్షన్‌ కంట్రోల్‌

కార్నరింగ్‌ ABS

Rain, Street, Off-Road రైడింగ్‌ మోడ్‌లు

830mm సీట్‌ హైట్‌, 237mm గ్రౌండ్‌ క్లియరెన్స్‌ వల్ల రఫ్‌ రోడ్లపై కూడా ఈ బైక్‌ నమ్మకంగా ఉంటుంది.

ధర & పోటీ

తెలుగు రాష్ట్రాల్లో, KTM 390 Adventure ఎక్స్‌-షోరూమ్‌ ధర ₹3.97 లక్షలు. ఆన్‌రోడ్‌ ధర నగరాన్ని బట్టి సుమారు ₹4.10 లక్షల నుంచి ₹4.53 లక్షల మధ్య ఉంటుంది. ఈ బైక్‌కు Royal Enfield Himalayan, Kawasaki Versys X 300, Triumph Scrambler 400XC వంటి మోడళ్లు ప్రధాన పోటీదారులు.

విజయవాడలో ఆన్‌-రోడ్‌ ధరఎక్స్‌-షోరూమ్‌ ధర ₹ 3,96,940RTO ఛార్జీలు ₹ 49,133ఇన్సూరెన్స్‌ (కాంప్రహెన్సివ్‌) ₹ 26,338ఆన్‌-రోడ్‌ ధర ₹ 4,72,411

హైదరాబాద్‌లో ఆన్‌-రోడ్‌ ధరఎక్స్‌-షోరూమ్‌ ధర ₹ 3,96,416RTO ఛార్జీలు ₹ 72,855ఇన్సూరెన్స్‌ (కాంప్రహెన్సివ్‌) ₹ 24,867ఆన్‌-రోడ్‌ ధర ₹ 4,94,138

ఇప్పుడు ఎందుకు కొనాలి?

కొత్త చిన్న ఇంజిన్‌తో వచ్చే నెక్ట్స్‌ జనరేషన్‌ మోడళ్లకు ముందు, ఈ భారీ ప్రయోజనాలతో ప్రస్తుతం ఉన్న మోడల్‌ను కొనడం చాలా మంచి డీల్‌గా చెప్పుకోవచ్చు. అడ్వెంచర్‌ రైడింగ్‌ ప్రేమికులకు ఇది సరైన సమయం.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.