Skoda Kodiaq Vs Volkswagen Tiguan R-Line SUV: స్టైలిష్‌ లుక్‌, లగ్జరీ ఫీచర్ల కలబోతతో తయారైన పుల్‌ సైజ్‌ SUV కొనే ఆలోచన మీకు ఉంటే, వోక్స్‌వ్యాగన్ & స్కోడా నుంచి సుప్రీమ్‌ కార్లు అందుబాటులో ఉన్నాయి. వోక్స్‌వ్యాగన్ టిగువాన్ R-లైన్ & స్కోడా కోడియాక్ రెండూ మీ ఆలోచనలకు సరిగ్గా సరిపోతాయి, బెస్ట్‌ ఆప్షన్స్‌గా నిలుస్తాయి. ఈ రెండు లగ్జరీ కార్లు ఫీచర్లు, పెర్ఫార్మెన్స్‌తో కార్‌ ప్రియుల మతి పోగొడుతున్నాయి. ప్రీమియం లుక్‌తో కనిపించే ఈ కార్ల నుంచి చూపు తిప్పుకోవడం కూడా కష్టమే.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ R-లైన్ & స్కోడా కోడియాక్ రెండు SUVలు, ఒక్కొక్కటి రూ. 50 లక్షల లోపు ఎక్స్‌ షోరూమ్‌ రేటులో అందుబాటులో ఉన్నాయి. AWD (All-wheel drive) & ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లింక్‌ చేసిన టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను ఈ రెండు కార్లలో ఫిట్‌ చేశారు. లుక్‌, లగ్జరీ, లేటెస్ట్‌ ఫీచర్ల పరంగా ఈ రెండు కార్లు బెస్ట్‌ అయినప్పుడు, ఇప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏమిటంటే, డబ్బుకు తగిన విలువను ఏ SUV అందిస్తుంది?. వోక్స్‌వ్యాగన్ టిగువాన్ R-లైన్ & స్కోడా కోడియాక్ SUVల మధ్య తేడాలు అర్ధం చేసుకుంటే.. మీ హోదాకు, ఆలోచనలకు & డబ్బుకు తగిన కార్‌ ఏదో మీకే ఈజీగా అర్ధం అవుతుంది.

డిజైన్ & సైజ్‌టిగువాన్ R-లైన్.. బోల్డ్ ఎలిమెంట్స్, అగ్రెసివ్‌ ఫ్రంట్ ఫేషియాతో స్పోర్టి డిజైన్‌లో వచ్చింది. స్కోడా కోడియాక్‌ను చూస్తే.. మరింత ఎలగెంట్‌ & క్లాసీ లుక్‌తో కనిపిస్తుంది. SUV సైజ్‌ గురించి మాట్లాడుకుంటే.. టిగువాన్ R-లైన్ పొడవు (length) 4539 mm కాగా కోడియాక్ పొడవు 4758 mm. ఈ రెండు కార్ల వెడల్పు (width) దాదాపు ఒకేలా ఉంటుంది. కోడియాక్ వీల్‌ బేస్ ‍‌(wheelbase) 2791 mm. ఇది టిగువాన్ వీల్‌ బేస్ 2680 mm కంటే ఎక్కువ. అయితే, టిగువాన్ 176 mm గ్రౌండ్ క్లియరెన్స్‌తో (ground clearance) బెటర్‌గా ఉంటే, కోడియాక్ గ్రౌండ్ క్లియరెన్స్‌ 155 mmగా ఉంది. దీని అర్థం, టిగువాన్ కఠినమైన రోడ్లలోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా పెర్ఫార్మ్‌ చేయగలదు.

పవర్‌ఈ రెండు ఎస్‌యూవీలు AWD & 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్‌తో  2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌లకు కనెక్ట్‌ అయి ఉన్నాయి. ఈ ఇంజిన్‌ల పవర్ అవుట్‌పుట్‌లు 204 bhp & 320 Nm. అయితే, వీటి మైలేజ్ ‍‌(Mileage) భిన్నంగా ఉంటుంది. కంపెనీల వెబ్‌సైట్‌ ప్రకారం, వోక్స్‌వ్యాగన్ టిగువాన్ R-లైన్ లీటర్‌కు 12.58 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుండగా, స్కోడా కోడియాక్ లీటర్‌కు 14.86 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. అంటే, ఇంధన సామర్థ్యం పరంగా కోడియాక్ బెటర్‌గా పెర్ఫార్మ్‌ చేయగలదు.

డబ్బుకు తగిన విలువను ఏ కారు అందిస్తుంది?స్కోడా కోడియాక్ ఎక్స్‌ షోరూమ్‌ ధర (Skoda Kodiaq ex-showroom price, Delhi) రూ. 46.89 లక్షల నుంచి ప్రారంభమై రూ. 48.69 లక్షల వరకు ఉంటుంది. వోక్స్‌వ్యాగన్ టిగువాన్ R-లైన్‌ ఎక్స్ షోరూమ్‌ ధర (Volkswagen Tiguan R-Line ex-showroom price, Delhi) రూ. 49 లక్షలు. రెండు SUVలు ప్రీమియం ఫీచర్లు, గొప్ప పనితీరు, అద్భుతమైన సౌకర్యం & ఆహ్లాదకరమైన అనుభవాన్ని అందిస్తాయి, మీరు ఎక్కువ పెర్ఫార్మెన్స్‌ కోరుకుంటూ స్పోర్టి లుక్‌ను ఇష్టపడితే టిగువాన్ R-లైన్ ఉత్తమ ఎంపిక. మీ కుటుంబానికి అనుకూలమైన, ఇంధన సామర్థ్యం గల ప్రీమియం SUV కావాలనుకుంటే స్కోడా కోడియాక్ బెటర్‌ ఆప్షన్‌ కావచ్చు.