Kinetic DX Price, Down Payment, Loan and EMI Details: 90ల నాటి ఐకానిక్ బ్రాండ్ కైనెటిక్.. తన పాపులర్ మోడల్‌ను ఎలక్ట్రిక్ వెహికల్ రూపంలో Kinetic DX EV పేరుతో ఇటీవల తిరిగి మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. 90s కిడ్స్‌కు నాస్టాల్జియా అందిస్తూనే, నేటి Gen-Z & Alpha రైడర్లకు తగినట్టు మోడర్న్ టెక్నాలజీతో దీనిని డిజైన్‌ చేసింది. హైదరాబాద్‌ లేదా విజయవాడ వంటి బిజీ నగరాల్లో రోజువారీ ఆఫీస్, కాలేజ్ కమ్యూట్ కోసం ఒక పర్‌ఫెక్ట్ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌ కాగలదు.

Continues below advertisement

వాస్తవానికి, కైనెటిక్ కంపెనీ, DX 3kWh వేరియంట్‌ను (ధర రూ. 1.19 లక్షలు, ఎక్స్‌షోరూమ్‌); DX+ 3.1kWh వేరియంట్‌ను (ధర రూ. 1.28 లక్షలు, ఎక్స్‌షోరూమ్‌) కూడా తాజాగా లాంచ్‌ చేసింది. DX+ 3.1kWh వేరియంట్‌ 132 కి.మీ. IDC రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది.

హైదరాబాద్‌లో తాజా ఎక్స్‌-షోరూమ్‌ & ఆన్‌రోడ్‌ ధర వివరాలు

Continues below advertisement

భాగ్యనగరంలో Kinetic DX EV Standard వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,11,499 గా ఉంది. ఇన్సూరెన్స్, ఇతర చార్జీలు కలిపి  హైదరాబాద్‌లో ఆన్-రోడ్ ధర సుమారు రూ. 1,21 లక్షలు అవుతుంది.

బ్యాటరీ, రేంజ్ & టాప్ స్పెసిఫికేషన్లుKinetic DX EV Standard వేరియంట్‌లో 2.5 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ అందించారు. ఇది సింగిల్ ఛార్జ్‌పై 116 కి.మీ. రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. గరిష్టంగా 80 నుంచి 90 Kmph టాప్ స్పీడ్ అందుకోగలదు. కేవలం 5 గంటల్లో 0 నుంచి 100% ఛార్జింగ్ పూర్తవుతుంది. ఇందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రీజెనరేటివ్ బ్రేకింగ్, అలాయ్ వీల్స్ & రీవర్స్ మోడ్ వంటి కనెక్టెడ్ టెక్నాలజీలు ఉన్నాయి.

తక్కువ డౌన్‌పేమెంట్ & బ్యాంక్ ఫైనాన్స్ వివరాలు

హైదరాబాద్‌లోని ప్రముఖ బ్యాంకులు & ఎన్‌బీఎఫ్‌సీలు (NBFCs) ఈ స్కూటర్‌పై 8% నుంచి 14% వరకు వార్షిక వడ్డీ రేట్లతో లోన్ సౌకర్యం కల్పిస్తున్నాయి. కొనుగోలుదారులు కనీస డౌన్‌పేమెంట్ రూ. 10,000 నుంచి రూ. 20,000 చెల్లించి ఈ వెహికల్‌ను ఇంటికి తీసుకెళ్లవచ్చు.

ఇది కూడా చదవండి: టాటా కారు కొనేవాళ్లకు గుడ్‌న్యూస్‌.. ఈ నెలలో రూ.1.25 లక్షల వరకు బెనిఫిట్స్‌!

3, 4 & 5 ఏళ్ల EMI టెన్యూర్‌ల లెక్కలు:

మీరు కనీస డౌన్‌పేమెంట్ రూ.10,000 చెల్లిస్తే, మిగిలిన 1.11 లక్షలను లోన్‌గా తీసుకోవాలి. ఈ లోన్‌పై బ్యాంక్‌ 10% వార్షిక వడ్డీ రేటును వసూలు చేస్తుందని అనుకుంటే...

3 ఏళ్ల (36 నెలలు) టెన్యూర్: నెలకు రూ. 3,986 EMI చెల్లించాలి.

4 ఏళ్ల (48 నెలలు) టెన్యూర్: నెలకు రూ. 3,219 EMI కట్టాలి.

5 ఏళ్ల (60 నెలలు) టెన్యూర్: సుదీర్ఘ కాలపరిమితి ఎంచుకుంటే నెలకు రూ. 2,759 చెల్లిస్తే సరిపోతుంది.

ఇది కూడా చదవండి: కొత్త ఇంజిన్‌తో సరికొత్తగా మారిన 2026 Maruti Baleno.. ఈ ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ రోడ్డుపై ఎలా ఉంది?

కైనెటిక్ DX ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను కొనే ముందు, మీ స్థానిక డీలర్‌షిప్ వద్ద అందుబాటులో ఉన్న పండుగ డిస్కౌంట్లు & బ్యాంక్ క్యాష్‌బ్యాక్ ఆఫర్లను పరిశీలించండి. మీ క్రెడిట్ స్కోర్ (CIBIL Score) 750 కంటే ఎక్కువగా ఉంటే ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపుతో పాటు అత్యల్ప వడ్డీ రేటుకే రుణం లభించే అవకాశం ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.