భారత్‌లో Kia Motors కొత్త తరం Kia Seltos 2026ను ప్రవేశపెట్టింది. అదే సమయంలో Tata Motors సంస్థ తమ ఎస్‌యూవీ Tata Sierra పై నమ్మకం ఉంచింది. టాటా సియెర్రా పవర్‌ఫుల్ డిజైన్, ప్రీమియం ఫీచర్ల కారణంగా ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉంటుంది. ఈ రెండు SUVలు మిడ్-సైజ్ విభాగంలో గట్టి పోటీని ఇస్తున్నాయి. కనుక ఎవరైనా కొనాలనుకుంటే వాటిలో ఏ SUV మంచిదో చూద్దాం.

Continues below advertisement

Seltos vs Sierra ఫీచర్లలో ఏది బెస్ట్

కొత్త Kia Seltosలో కంపెనీ అనేక హై-టెక్, ప్రీమియం ఫీచర్లను చేర్చింది. ఈ SUV 30 అంగుళాల ట్విన్ డిస్‌ప్లే సెటప్‌తో వచ్చింది. ఇందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇచ్చారు. దీనితో పాటు వైర్‌లెస్ ఛార్జర్, వెంటిలేటెడ్ సీట్లు, 10 వే పవర్ డ్రైవర్ సీటు, Bose 8 స్పీకర్లు, యాంబియంట్ లైట్, పనోరమిక్ సన్‌రూఫ్, లెవెల్-2 ADAS వంటి ఫీచర్లు కియా సెల్టోస్‌ను మరింత మెరుగ్గా చేస్తాయి.

మరోవైపు Tata Sierra ఫీచర్ల పరంగా మరింత ప్రీమియంగా నిరూపితమైంది. Sierraలో LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్‌లు, కనెక్టెడ్ LED టెయిల్-లైట్‌లు, ట్రిపుల్-స్క్రీన్ సెటప్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, 360° కెమెరా, బ్లైండ్-స్పాట్ మానిటర్, Hypr HUD, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 12-స్పీకర్ డాల్బీ అట్మాస్ సిస్టమ్ ఉన్నాయి. ఈ ఎస్‌యూవీ విభాగంలోనే అతిపెద్ద పనోరమిక్ సన్‌రూఫ్‌ను కలిగి ఉంది. దీనితో పాటు, వెనుక సన్‌షేడ్, ఎయిర్ ప్యూరిఫైయర్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, పవర్డ్ టెయిల్‌గేట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఫీచర్ల పరంగా, Tata Sierra కచ్చితంగా Seltos కంటే ముందుందని కస్టమర్లు చెబుతున్నారు.

Continues below advertisement

 ఏ ఇంజిన్ ఎక్కువ శక్తివంతమైనది?

ఇంజిన్ విషయానికివస్తే కొత్త Kia Seltos మూడు ఇంజిన్ ఆప్షన్లతో వస్తుంది. అందులో 1.5L పెట్రోల్, 1.5L టర్బో పెట్రోల్, 1.5L డీజిల్ ఉన్నాయి. వాటి శక్తి 115 PS, 160 PS, 116 PS. కియా Seltos మాన్యువల్, IVT, IMT  సహా ఆటోమేటిక్ అన్ని ట్రాన్స్మిషన్ ఎంపికలను కస్టమర్లకు అందిస్తుంది. Tata Sierra సైతం 3 ఇంజిన్ ఎంపికలను కలిగి ఉంది. అందులో 1.5L టర్బో పెట్రోల్ (160 PS), 1.5L రెవోట్రాన్ పెట్రోల్ (106 PS), 1.5L డీజిల్ (118 PS) ఉన్నాయి. Sierra డీజిల్ ఇంజిన్ 280 Nm టార్క్‌ను ఇస్తుంది. ఇది Kia Seltos కంటే ఎక్కువ. దీని కారణంగా, డీజిల్ పనితీరు పరంగా Sierra బెస్ట్ అనిపించుకుంటుంది. 

కారు సైజ్‌లో ఏది పెద్దది..

సైజ్ విషయానికి వస్తే, కొత్త Kia Seltos 4,460 mm పొడవు, 1,830 mm వెడల్పు కలిగి ఉంది.దీని వీల్‌బేస్ 2,690 mm. దీనితో పోలిస్తే Tata Sierra 4,340 mm పొడవుగా ఉంది. కానీ దీని వెడల్పు 1,841 mm, వీల్‌బేస్ 2,730 mm. అంటే Seltos పొడవుగా, కొంచెం వెడల్పుగా ఉంది. అయితే  వీల్‌బేస్ ఎక్కువగా ఉండటం వల్ల Sierra క్యాబిన్‌లో ఎక్కువ స్థలం వస్తుంది.

ధర ఏది ఎక్కువ..

Tata Sierra ఎస్‌యూవీ ధర రూ. 11.49 లక్షల నుండి ప్రారంభం కాగా, టాప్ మోడల్‌లో రూ. 18.49 లక్షల వరకు ఉంటుంది. కొత్త Kia Seltos ధర జనవరి 2, 2026న ప్రకటించనున్నారు. అయితే దీని ప్రారంభ ధర Sierra కంటే కొంచెం ఎక్కువగా ఉంటుందని మార్కెట్లో వినిపిస్తుంది.