Kia Seltos 2026 Details: భారత్‌లో, మధ్యతరహా ఎస్‌యూవీ విభాగంలో పోటీ తీవ్రంగా ఉంది. అయినప్పటికీ ఓ కారు మాత్రం తన క్రేజ్‌ను కొనసాగిస్తోంది. అదే కియా సెల్టోస్. భారత మార్కెట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి కస్టమర్ల ఆదరణ పొందుతున్న ఈ కారు మరో అరుదైన మైలురాయిని దాటింది. దేశీయ మార్కెట్లో కియా సెల్టోస్ అమ్మకాలు 7 లక్షల యూనిట్లను దాటాయి. 2019లో లాంచ్‌ అయిన ఈ SUV.. కియా బ్రాండ్‌కు భారత్‌లో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. తాజాగా విడుదలైన సెకండ్‌ జనరేషన్‌ మోడల్‌కు కూడా మంచి స్పందన లభిస్తోంది. 

Continues below advertisement

కియా సెల్టోస్‌ ధర రూ.11 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. అంటే, మధ్య తరగతి ప్రజల బడ్జెట్‌లో కొనదగిన కారు ఇది.

ఏడేళ్లలో 7 లక్షలకు పైగా అమ్మకాలు

Continues below advertisement

కియా కంపెనీ భారత్‌లో తయారు చేసిన తొలి కారు సెల్టోస్. 2019 ఆగస్టు 22న ఈ ఎస్‌యూవీని మార్కెట్లోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి 2026 అక్టోబర్ వరకు దేశీయ మార్కెట్లో మొత్తం 7,04,829 యూనిట్లు అమ్ముడయ్యాయి. కియా భారత్‌లో విక్రయించిన మొత్తం 16.8 లక్షల వాహనాల్లో సెల్టోస్ వాటా సుమారు 36 శాతం కావడం విశేషం.

దేశీయ మార్కెట్లోనే కాదు.. ఎగుమతుల్లోనూ ఈ కారు కియాకు కీలకంగా మారింది. ఇప్పటివరకు 1.6 లక్షలకు పైగా సెల్టోస్ కార్లను విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేశారు. దీంతో.. దేశంలో అత్యధికంగా అమ్ముడైన కియా కారుగానే కాకుండా, ఎగుమతుల్లోనూ అగ్రస్థానంలో నిలిచింది.

ఇది కూడా చదవండి: ఫుల్ ఛార్జింగ్‌తో కొండ ప్రాంతాల్లో ప్రయాణిస్తున్నారా? ఎలక్ట్రిక్‌ కారు డ్రైవర్లు తప్పక తెలుసుకోవాల్సిన విషయం!

రెండో తరం మోడల్‌తో మళ్లీ జోరు

సెల్టోస్ అమ్మకాలకు కొత్త ఊపునిచ్చింది రెండో తరం మోడల్. ఈ ఏడాది జనవరిలో కొత్త రూపంతో మార్కెట్లోకి వచ్చిన ఈ కారు కస్టమర్లను బాగా ఆకట్టుకుంటోంది. 2026 జనవరి నుంచి అక్టోబర్ వరకు మొత్తం 1,13,078 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన 60,526 యూనిట్లతో పోలిస్తే అమ్మకాలు 87 శాతం పెరిగాయి.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఫిబ్రవరి నుంచి అక్టోబర్ వరకు కేవలం తొమ్మిది నెలల్లోనే 1,02,439 కార్లు అమ్ముడయ్యాయి. అంటే ప్రతి నెలా సగటున 11,000కు పైగా వాహనాలను జనం కొన్నారు. జనవరిలోనే 10,639 యూనిట్ల అమ్మకాలతో ఐదు అంకెల విక్రయాలను అందుకుంది. ఆ తర్వాత జూన్ మినహా ప్రతి నెలా 10,000కు పైగా కార్లు అమ్ముడయ్యాయి.

అక్టోబర్‌లో కియా రికార్డు అమ్మకాలు

2026 అక్టోబర్ నెల కియా సంస్థకు మరింత ప్రత్యేకంగా నిలిచింది. ఆ నెలలో మొత్తం 33,462 వాహనాలను విక్రయించింది. కియా, భారత్‌లో ఇప్పటివరకు నమోదు చేసిన అత్యధిక నెలవారీ అమ్మకాలు ఇవే. ఈ సమయంలోనే సెల్టోస్ 7 లక్షల అమ్మకాల మైలురాయిని దాటింది.

ఇది కూడా చదవండి: ఎలక్ట్రిక్‌ కారు బ్యాటరీ విషయంలో ఈ తప్పు చేయకండి! 100% ఛార్జింగ్ దేనికి అవసరం? దేనిని 80% దగ్గర ఆపాలి?

కియా సంస్థలో రెండో అత్యధిక అమ్మకాలు సాధిస్తున్న కారు సోనెట్. అయితే దేశీయ అమ్మకాల విషయంలో ఇది సెల్టోస్ కంటే దాదాపు 1.1 లక్షల యూనిట్లు వెనుకబడి ఉంది. కేరెన్స్ సిరీస్‌ ఇప్పటివరకు 3,31,186 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.

పోటీ ఎక్కువైనా తగ్గని ఆదరణ

మధ్యతరహా ఎస్‌యూవీ విభాగంలో ప్రస్తుతం 20కి పైగా మోడళ్లు పోటీపడుతున్నాయి. ఇందులో విద్యుత్ కార్లు, హైబ్రిడ్ వాహనాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ సెల్టోస్ తన స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. 2026 జనవరి నుంచి అక్టోబర్ వరకు ఈ విభాగంలో 81,090 యూనిట్ల అమ్మకాలతో నాలుగో స్థానంలో ఉంది.

ఈ జాబితాలో Mahindra Scorpio 1,12,841 యూనిట్లతో మొదటి స్థానంలో ఉంది. Hyundai Creta 1,07,682 యూనిట్లతో రెండో స్థానంలో, Maruti Victoris 88,804 యూనిట్లతో మూడో స్థానంలో ఉన్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.