Kia India తన ఫేమస్ 7 సీటర్ MPV Carens Clavis ICE లైనప్‌లో కొత్త వేరియంట్ HTE (EX)ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ వేరియంట్ బేస్ మోడల్ కంటే కొంచెం ఎక్కువ ఫీచర్‌లను కోరుకునే కస్టమర్‌ల కోసం తయారుచేశారు. కానీ కియా టాప్ వేరియంట్‌పై ఎక్కువ ఖర్చు అవసరం లేదు. Kia Carens Clavis HTE (EX) ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 12,54,900గా నిర్ణయించారు. ఇది దాని విభాగంలో మంచి ఎంపికగా మార్కెట్లో విక్రయాలు జరుగుతాయి. అత్యంత ఖరీదైన కారుగా ఈ కారు కనిపించి కస్టమర్లను ఆకర్షిస్తుంది.

Continues below advertisement

ధర, ఇంజిన్ ఎంపికలు

Kia Carens Clavis HTE (EX) వేరియంట్ 3 వేర్వేరు ICE పవర్‌ట్రెయిన్ ఎంపికలతో మార్కెట్లోకి వచ్చింది.  G1.5 పెట్రోల్ వేరియంట్ ధర రూ. 12,54,900, కాగా G1.5 టర్బో పెట్రోల్ వేరియంట్ రూ. 13,41,900లకు కొనుగోలు చేయవచ్చు. అదే సమయంలో D1.5 డీజిల్ వేరియంట్ ఎక్స్-షోరూమ్‌ ధర రూ. 14,52,900 నిర్ణయించారు. ఈ కొత్త వేరియంట్ ఇప్పటికే ఉన్న HTE (O) కంటే పైన నిలుస్తుంది. కియా కారెన్సన్ క్లావిస్ హెచ్‌టీఈ 7 సీటర్ కాన్ఫిగరేషన్‌లో మాత్రమే అందుబాటులోకి తెచ్చారు.

పెట్రోల్ వేరియంట్‌లో మొదటిసారిగా సన్‌రూఫ్

కియా కారెన్సన్ HTE (EX) వేరియంట్ అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే G1.5 పెట్రోల్ ఇంజిన్‌తో మొదటిసారిగా స్కైలైట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ అందించారు. ఈ ధరకు సన్‌రూఫ్ లభించడం వల్ల ఇది 7 సీటర్ విభాగంలో ప్రత్యేకంగా నిలుస్తుంది. సాధారణంగా, సన్‌రూఫ్ ఖరీదైన వేరియంట్‌లలో మాత్రమే కనిపిస్తుంది. అయితే Kia కంపెనీ దీనిని మరింత బడ్జెట్ వేరియంట్‌లో అందించడం ద్వారా కస్టమర్‌లకు గొప్ప ప్రయోజనం చేకూర్చింది.

Continues below advertisement

ఎక్కువ సౌకర్యం, కొత్త ఫీచర్‌లు

సన్‌రూఫ్‌తో పాటు, Kia Carens Clavis HTE (EX)లో క్యాబిన్‌ను మరింత సౌకర్యవంతంగా చేసే అనేక ఫీచర్‌లు అందిస్తోంది. ఇందులో పూర్తిగా ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ ిచ్చారు. దీని కారణంగా ఏ వాతావరణంలో అయినా క్యాబిన్ ఉష్ణోగ్రత సౌకర్యవంతంగా ఉంటుంది. బయటి నుంచి చూస్తే, ఇది LED డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్, LED పొజిషన్ ల్యాంప్‌లను కలిగి ఉంది. ఇది కారు లుక్ మరింత ప్రీమియంగా కనిపించేలా చేస్తుంది. క్యాబిన్ లోపల మెరుగైన లైటింగ్ కోసం LED క్యాబిన్ ల్యాంప్‌లు ఇచ్చారు. దీనితో పాటు డ్రైవర్ సైడ్ పవర్ విండోలో ఆటో అప్ అండ్  డౌన్ ఫంక్షన్ ఉంది. ఇది సౌకర్యాన్ని పెంచడమే కాకుండా భద్రత పరంగా కూడా మెరుగ్గా అనిపిస్తుంది.

Kia ఈ కొత్త వేరియంట్‌ను ఎందుకు రిలీజ్ చేసింది

కియా కారెన్స్ HTE (EX) వేరియంట్‌ను కస్టమర్ల అభిప్రాయం, మారుతున్న మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రారంభించినట్లు Kia సంస్థ తెలిపింది. మధ్యస్థ వేరియంట్‌ను కోరుకునే కస్టమర్‌లకు సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి అవసరమైన ఫీచర్‌లు బడ్జెట్ ధరకే లభించాలని కంపెనీ భావిస్తోంది.

Also Read: తొలి ఎలక్ట్రిక్ కారు Urban Cruiser BEV తెస్తున్న టయోటా.. ఒక్క ఛార్జ్‌తో 500 KM రేంజ్