Kia India March 2026 Offers: ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా ఇండియా, మార్చి 2026 నెలకు సంబంధించి తన కార్ల లైనప్‌పై ఆకర్షణీయమైన ఆఫర్లను విడుదల చేసింది. ఎస్‌యూవీలు, ఎమ్‌పీవీల అమ్మకాలను పెంచడమే లక్ష్యంగా ఈ లిమిటెడ్ పీరియడ్ డీల్స్ తీసుకొచ్చింది. ఇందులో ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, లాయల్టీ రివార్డులు, స్క్రాపేజ్ ఇన్సెంటివ్స్, కార్పొరేట్ డిస్కౌంట్లు ఉన్నాయి. డీలర్ల వద్ద ఉన్న స్టాక్, నగరం, కస్టమర్ అర్హతను బట్టి ఈ ఆఫర్లలో మార్పులు ఉండవచ్చు.
కియా కార్నివాల్ (Kia Carnival)
కియా ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన కార్నివాల్‌పై ఈ నెలలో అత్యధికంగా రూ. 1 లక్ష వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇందులో నేరుగా క్యాష్ డిస్కౌంట్ లేకపోయినా, పాత కారు మార్పిడిపై వచ్చే ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ స్కీమ్స్ ద్వారా భారీగా పొదుపు చేయవచ్చు. లగ్జరీ ప్రయాణాన్ని కోరుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం.
కియా క్యారెన్స్ క్లావిస్ ఈవీ (Carens Clavis EV)
ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో తన పట్టును పెంచుకునేందుకు కియా క్యారెన్స్ క్లావిస్ ఈవీపై రూ. 90,000 వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్లు, కార్పొరేట్ ఇన్సెంటివ్స్ ఉన్నాయి. ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రయాణం కోరుకునే ఈవీ ప్రియులకు ఇది మంచి ఆప్షన్. దీని ఐసీఈ (ICE) వెర్షన్ అయిన క్యారెన్స్ క్లావిస్‌పై కూడా రూ. 80,000 వరకు ఆఫర్లు ఉన్నాయి.
కియా సైరోస్ (Kia Syros), సెల్టోస్ (Seltos)
ఇటీవల మార్కెట్లోకి వచ్చిన కియా సైరోస్ మోడల్‌పై రూ. 60,000 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. పాపులర్ మోడల్ కియా సెల్టోస్‌పై రూ. 40,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. సెల్టోస్ విషయంలో నేరుగా ధర తగ్గించకుండా ఎక్స్ఛేంజ్ బోనస్, ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్యాకేజీల వంటి వాల్యూ-యాడెడ్ ఆఫర్లపై కంపెనీ దృష్టి పెట్టింది. సాధారణ కియా క్యారెన్స్ మోడల్‌పై కూడా రూ. 40,000 వరకు తగ్గింపు లభిస్తోంది.
కియా సోనెట్ (Kia Sonet)
చిన్న ఎస్‌యూవీ విభాగంలో క్రేజ్ ఉన్న కియా సోనెట్‌పై మొత్తం రూ. 35,000 వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్‌లతో పాటు అర్హతను బట్టి స్క్రాపేజ్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ఈ ఆఫర్లు కేవలం మార్చి నెలాఖరు వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. పూర్తి వివరాల కోసం దగ్గరలోని కియా షోరూమ్‌ను సంప్రదించడం ఉత్తమమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
