Kia Clavis EV vs Toyota Innova Hycross Comparison: కియా, ఇటీవలే భారతదేశంలో తన కొత్త ఎలక్ట్రిక్ MPV, కారెన్స్ క్లావిస్ EV ని లాంచ్ చేసింది. ఇది ఈ కంపెనీ మొట్టమొదటి ఎంట్రీ-లెవల్ EV. మరోవైపు, టయోటా ఇన్నోవా హైక్రాస్ ఇప్పటికే పాపులర్ అయిన హైబ్రిడ్ MPV. ఈ రెండు వాహనాలు వేర్వేరు సాంకేతికతలతో నడుస్తాయి (ఒకటి ఎలక్ట్రిక్ & మరొకటి హైబ్రిడ్). అయితే, పోలికలను బట్టి ఈ రెండిటిలో ఏ కారు మీ అవసరాలకు సరిపోతుందో తెలుసుకుందాం.
సైజ్‌లో ఏ కారు పెద్దది?
కారెన్స్ క్లావిస్ EV కంటే ఇన్నోవా హైక్రాస్ పెద్దది. ఇన్నోవా పొడవు 4755 mm, అయితే కారెన్స్ క్లావిస్ పొడవు 4550 mm. ఇన్నోవా పొడవు మాత్రమే కాదు, వెడల్పుగా & ఎత్తుగా కూడా ఉంటుంది. వీల్‌బేస్‌లో కూడా ఇన్నోవానే ముందుంది, దీని వీల్‌బేస్ 2850 mm, అయితే కారెన్స్ క్లావిస్ EV వీల్‌బేస్ 2780 mm ఉంది.
ఏ కారు పవర్‌ఫుల్?
పవర్ పరంగా కూడా, టయోటా ఇన్నోవా హైక్రాస్ కొంచెం ముందుంది. కారెన్స్ క్లావిస్ EV రెండు బ్యాటరీ ఎంపికలలో - 42kWh & 51.4kWh - వచ్చింది. దీని టాప్ వేరియంట్ 171 bhp పవర్ ఇస్తుంది, బేస్ వేరియంట్ 135 hp పవర్ ఇస్తుంది. ఇన్నోవా హైక్రాస్, తన హైబ్రిడ్ ఇంజిన్‌తో 184 bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంకా, ఇన్నోవా పెట్రోల్ వెర్షన్‌లో కూడా అందుబాటులో ఉంది.
మైలేజ్ & రేంజ్‌లో ఏ కారు బెటర్?
మైలేజ్ & రేంజ్ పరంగా, టయోటా ఇన్నోవా హైక్రాస్ మరింత ఉపయోగకరంగా కనిపిస్తోంది. Carens Clavis EVలో పెద్ద బ్యాటరీ (51.4kWh)ని ఫుల్ ఛార్జ్ చేస్తే 490 కి.మీ. డ్రైవింగ్ రేంజ్ (Kia Clavis EV driving range) ఇస్తుంది. ఇన్నోవా హైబ్రిడ్ ఫుల్ ట్యాంక్‌తో ఏకంగా 1000 కి.మీ. వరకు నడుస్తుంది. దీని మైలేజ్ (Toyota Innova Hycross mileage) లీటర్‌కు దాదాపు 23.24 కి.మీ., ఇది దూర ప్రాంత ప్రయాణాలకు చాలా అనుకూలంగా ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో ధర ఎంత?
ధరలను పోలిస్తే, హైదరాబాద్‌లో, కారెన్స్ క్లావిస్ ఈవీ ఎక్స్-షోరూమ్ ధర (Carens Clavis EV ex-showroom price) రూ. 17.99 లక్షల నుంచి రూ. 24.49 లక్షల వరకు ఉంటుంది. RTO, ఇన్సూరెన్స్ సహా అన్ని ఖర్చులు కలుపుకుని, హైదరాబాద్‌లో దాదాపు రూ. 19.08 లక్షల నుంచి రూ. 25.88 లక్షల ఆన్-రోడ్ ధరకు వస్తుంది. టయోటా ఇన్నోవా హైక్రాస్ ఎక్స్-షోరూమ్ ధర (Toyota Innova Hycross ex-showroom price) రూ. 19.94 లక్షల నుంచి రూ. 32.5 లక్షల వరకు ఉంటుంది. అన్ని పన్నులు, ఖర్చులు కలుపుకుని దీని ఆన్-రోడ్ రేటు దాదాపు రూ. 25.22 లక్షల నుంచి రూ. 41.49 లక్షల వరకు ఉంటుంది. ఇతర తెలుగు నగరాల్లోనూ దాదాపుగా ఇవే ధరలు ఉన్నాయి.
ఇన్నోవా హైక్రాస్‌తో పోలిస్తే కారెన్స్ క్లావిస్ చకైనది అయినప్పటికీ, దాని డ్రైవింగ్ రేంజ్ పరిమితంగా ఉంటుంది, ఇది నగరానికి అనుకూలంగా ఉంటుంది. ఇన్నోవా హైక్రాస్ ఎక్కువ దూరం ప్రయాణించగలదు, ఎక్కువ స్పేస్ & మెరుగైన పవర్‌తో మరింత ప్రాక్టికల్ ఆప్షన్ అవుతుంది.
ఈ పోలికల ఆధారంగా, మీ అవసరాలు & డ్రైవింగ్ స్టైల్‌కు అనుగుణంగా ఒక కారును ఎంచుకోవడం మీకు ఈజీ అవుతుంది.