Kia Carens Facelift 2025 Features and Price Details: కియా ఇండియా, తన పాపులర్‌ MPV (Multi-Purpose Vehicle) "కారెన్స్‌" ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈసారి, కంపెనీ చాలా కాస్మెటిక్ ఛేంజెస్‌ & టెక్నాలజీ అప్‌గ్రెడేషన్లు తీసుకురాబోతోంది. ఇవి, ఈ కారును మునుపటి కంటే మోర్‌ ప్రీమియం అనిపించేలా చేయగలవు. ఈ కొత్త వెర్షన్‌ ప్రస్తుత మోడల్ కంటే కొంచెం ఎక్కువ రేటు ఉండవచ్చు & ఈ ఏడాది మే నెలలో లాంచ్‌ కావచ్చు.

ఎక్స్‌టీరియర్‌ & ఇంటీరియర్‌లో పెద్ద మార్పులు (Kia Carens Facelift 2025 Exterior & Interior)రిపోర్ట్స్‌ను బట్టి చూస్తే... కొత్త కియా కారెన్స్ ఫేస్‌లిఫ్ట్‌లో ఎక్స్‌టీరియర్‌ & ఇంటీరియర్‌ రెండింటిలోనూ మార్పులు కనిపిస్తాయి. కార్నివాల్ & సైరోస్ వంటి కొత్త మోడళ్ల తరహాలో, కారెన్స్ ఫేస్‌లిఫ్ట్‌ ఫ్రంట్-ఎండ్ డిజైన్ కూడా కొత్త కియా డిజైన్ లాంగ్వేజ్‌పై ఆధారపడి ఉంటుంది, తొలి చూపులోనే ఈ కార్‌తో ప్రేమలో పడేలా చేయగలదు. ఇంటీరియర్‌ ఫీచర్లలోనూ చెప్పుకోదగిన మార్పులు ఉండవచ్చు. మరింత ఆకర్షణీయమైన స్టీరింగ్ వీల్ డిజైన్, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త ట్రిమ్‌ & అప్‌హోల్‌స్టెరీ ఆప్షన్స్‌ ఉండవచ్చు. ఫలితంగా, ఫేస్‌లిఫ్టెడ్ కారెన్స్ ప్రస్తుత మోడల్‌ కంటే ఎక్కువ ప్రీమియం అనుభూతిని ఇవ్వగలదు.       

అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో ప్యాకింగ్‌ (Advanced features in Kia Carens Facelift 2025)కొత్త కియా కారెన్స్ ఫేస్‌లిఫ్ట్ అనేక కొత్త ఫీచర్లతో రోడ్డుపైకి వస్తుందని తెలుస్తోంది. దీనిలో 360-డిగ్రీ కెమెరా, లెవెల్-2 ADAS (Advanced Driver Assistance Systems), పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, అప్‌గ్రేడెడ్‌ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మరింత మెరుగైన సేఫ్టీ ఉండవచ్చు. కియా కారెన్స్ ఫేస్‌లిఫ్ట్, ఈ కొత్త ఫీచర్లతో, హ్యుందాయ్ ఆల్కజర్ & మహీంద్రా XUV700 వంటి ప్రీమియం 3-Row SUVలకు డైరెక్ట్‌గా పోటీ ఇస్తుంది.       

ఇంజిన్‌లో ఏమైనా మార్పులు ఉంటాయా? (Kia Carens Facelift 2025 Engine)ఎక్స్‌టీరియర్‌ & ఇంటీరియర్‌ డిజైన్ & ఫీచర్లలో కొత్తదనం తీసుకువచ్చినప్పటికీ, ఇది ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ కాబట్టి ఇంజిన్‌లో ఎటువంటి మార్పు ఉండదు. కొత్త కారెన్స్ ఫేస్‌లిఫ్ట్ కార్‌లోనూ, ప్రస్తుత మోడల్‌లో ఉపయోగిస్తున్న అవే మూడు ఇంజిన్ ఆప్షన్లు ఉంటాయి, అవి - 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌, 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ & 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్. అన్ని ఇంజిన్ ఆప్షన్లలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంటుంది. అయితే, ఈసారి కంపెనీ iMT గేర్‌బాక్స్ అందిస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.        

కొత్త కియా కారెన్స్ ఫేస్‌లిఫ్ట్ మోడర్‌ రేటు  (Kia Carens Facelift 2025 Price) ప్రస్తుత మోడల్ కంటే కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. ఫేస్‌లిఫ్ట్‌లో ఏర్పాటు చేసే ప్రీమియం ఫీచర్లు, ఎక్స్‌టీరియర్‌ & ఇంటీరియర్ డిజైన్ దీని ధర పెరగడానికి కారణమవుతాయి.