Kia Carens Clavis Price, Down Payment, Loan and EMI Details: ఇండియన్‌ మార్కెట్‌లో, కియా కార్లు కిర్రాక్‌ పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా, ఈ ఫోర్‌వీలర్ల ఎక్స్‌టీరియర్స్‌ ఎక్స్‌లెంట్‌ అనే ప్రశంసలు వినిపిస్తున్నాయి, కుర్రకారును బాగా ఆకర్షిస్తున్నాయి. కియా కార్ల ఇంటీరియర్‌ & టెక్నాలజీ కూడా అడ్వాన్స్‌డ్‌గా ఉంటోంది. ఈ కారణంగా ఫ్యామిలీ మ్యాన్‌ని కూడా ఈ బండి అంటే ఎట్రాక్ట్‌ చేస్తోంది, కొనేలా ప్రేరేపిస్తోంది. ఇటీవల, కియా కంపెనీ, కారెన్స్ క్లావిస్‌ వెర్షన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఇది 7 సీట్ల కుటుంబ కారు & మల్టీ పర్సస్‌ వెహికల్‌ (MPV). ఈ కార్‌లో మంచి బూట్‌ స్పేస్‌ లభిస్తుంది, ఒక పెద్ద ఫ్యామిలీ ఇబ్బంది లేకుండా ప్రయాణించగలదు. 7-సీటర్‌ సెగ్మెంట్‌లో మారుతి ఎర్టిగా ‍‌(Maruti Ertiga) & టయోటా ఇన్నోవా ‍‌(Toyota Innova) వంటి కార్లకు పోటీగా కియా కారెన్స్‌ క్లావిస్‌ మార్కెట్‌లోకి వచ్చింది.

కియా కారెన్స్ క్లావిస్‌కు ఇప్పుడు మంచి డిమాండ్‌ ఉంది. మీరు ఈ కార్‌ కొనాలంటే మొత్తం డబ్బు ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదు, ఈ 7-సీటర్‌ MPVని ఫైనాన్స్‌లో తీసుకోవచ్చు. ముందుగా, షోరూమ్‌లో కాస్త డౌన్‌ పేమెంట్‌ చేస్తే చాలు & మిగిలిన డబ్బును ఈజీ EMI స్కీమ్‌లో కట్టేయొచ్చు.

తెలుగు నగరాల్లో కియా కారెన్స్ క్లావిస్‌ ధర ఎంత? కియా కారెన్స్ క్లావిస్ MPV ఎక్స్-షోరూమ్ ధర (Kia Carens Clavis ex-showroom price) రూ. 11.50 లక్షల నుంచి ప్రారంభమై రూ. 21.50 లక్షల వరకు ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో, కియా కారెన్స్ క్లావిస్‌ బేస్ పెట్రోల్ వేరియంట్‌ను కొనుగోలు చేస్తే, ఆన్-రోడ్ ధరగా (Kia Carens Clavis on-road price) రూ. 14.23 చెల్లించాలి. ఇంత డబ్బు మీ దగ్గర లేకపోయినా పర్లేదు, కేవలం రూ. 2 లక్షలు ఉంటే చాలు. ఈ రూ. 2 లక్షలను షోరూమ్‌లో డౌన్ పేమెంట్ చేస్తే, మిగిలిన రూ. 12.23 లక్షలు మీకు కారు లోన్‌ రూపంలో వస్తుంది. మీరు ఈ మొత్తాన్ని బ్యాంకు లేదా ఫైనాన్స్ కంపెనీ నుంచి 9% వడ్డీ రేటుకు పొందారని అనుకుందాం. 

రూ.12.23 లక్షలను 9 శాతం వడ్డీ రేటు చొప్పున తీసుకుంటే EMI లెక్క ఇదీ..

4 సంవత్సరాలకు కార్‌ లోన్‌ తీసుకుంటే, ప్రతి నెలా రూ. 30,434 EMI చెల్లించాలి.

5 సంవత్సరాల కోసం రుణం తీసుకుంటే, EMI రూ. 25,387 అవుతుంది. 

6 సంవత్సరాల టెన్యూర్‌తో అప్పు చేస్తే, నెలనెలా రూ. 22,045 బ్యాంక్‌లో జమ చేయాలి.

7 సంవత్సరాల కాలానికి రుణం మంజూరైతే, EMI రూ. 19,677 అవుతుంది.

రుణంపై వడ్డీ రేటు అనేది మీ క్రెడిట్‌ స్కోర్‌, క్రెడిట్‌ హిస్టరీ, బ్యాంక్‌ పాలసీని బట్టి మారుతుంది.

కియా కేరెన్స్ క్లావిస్ పవర్ ట్రైన్

కియా కారెన్స్ క్లావిస్ పవర్‌ పెర్ఫార్మెన్స్‌ మూడు ఇంజిన్‌ ఆప్షన్స్‌పై ఆధారంగా ఉంటుంది. 

మొదటిది 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్. ఇది గరిష్టంగా 160 PS పవర్‌ను & 253 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో స్మూత్‌గా పరుగులు తీస్తుంది, డ్రైవర్‌పై భారాన్ని తగ్గిస్తుంది.

రెండోది 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ (NA) పెట్రోల్ ఇంజిన్. ఇది గరిష్టంగా 115 PS పవర్‌ను జనరేట్‌ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంది, అద్భుతమైన డ్రైవ్‌ అనుభవాన్ని అందిస్తుంది. 

మూడోది 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్. ఇది గరిష్టంగా 116 PS పవర్‌ను జనరేట్‌ చేస్తుంది. ఇది 6MT (మాన్యువల్‌) & 6AT ‍(ఆటోమేటిక్‌)‌ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. ఇంకా.. ఇది ప్రస్తుత కారెన్స్ మోడల్ తరహాలో 6iMT & 7DCT ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్‌లోనూ లభిస్తుంది.