Kia Carens Clavis HTE EX Trim Launched: కియా ఇండియా, తన మోస్ట్‌ పాపులర్‌ MPV కియా 'కారెన్స్‌ క్లావిస్' లైనప్‌ను మరింత బలోపేతం చేసింది. తాజాగా HTE (EX) అనే కొత్త వేరియంట్‌ను అధికారికంగా లాంచ్‌ చేసింది. ఈ వేరియంట్‌ HTE (O), HTK+ మధ్యలో ఉంటుంది. ముఖ్యంగా... సన్‌రూఫ్‌, ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌ వంటి ఫీచర్లను తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకురావడమే ఈ వేరియంట్‌ ప్రధాన లక్ష్యం.

Continues below advertisement

కొత్త కియా కారెన్స్‌ క్లావిస్‌ HTE (EX) వేరియంట్‌ ధరలు రూ.12.55 లక్షల నుంచి రూ.14.53 లక్షల వరకు (అన్ని ఎక్స్‌-షోరూమ్‌ ధరలు) ఉన్నాయి. ఈ వేరియంట్‌ కేవలం 7 సీటర్‌ ఆప్షన్‌లో మాత్రమే లభిస్తుంది.

మూడు ఇంజిన్‌ ఆప్షన్లతో HTE (EX)

Continues below advertisement

1.5 లీటర్‌ న్యాచురల్‌ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ - 115 hp

1.5 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ - 160 hp

1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ - 116 hp

ఈ మూడు ఇంజిన్‌లకు మాన్యువల్‌ గేర్‌బాక్స్‌ మాత్రమే ఉంటుంది. ఆటోమేటిక్‌ ఆప్షన్‌ ఈ వేరియంట్‌లో ఇవ్వలేదు.

కియా కారెన్స్‌ క్లావిస్‌ HTE (EX) ధరలు

HTE (EX) పెట్రోల్‌ MT ---- రూ.12.55 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ ధర)

HTE (EX) టర్బో పెట్రోల్‌ MT ---- రూ.13.42 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ ధర)

HTE (EX) డీజిల్‌ MT ---- రూ.14.53 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ ధర)

ఈ అప్డేట్‌తో కారెన్స్‌ క్లావిస్‌ ఇప్పుడు మొత్తం 8 వేరియంట్లలో అందుబాటులో ఉంది.

ఈ వేరియంట్‌లోకి కొత్తగా ఏం వచ్చింది?

HTE (EX) వేరియంట్‌ ప్రత్యేకత ఏమిటంటే, ఇది కారెన్స్‌ క్లావిస్‌లో సన్‌రూఫ్‌, ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌ అందించే అతి తక్కువ ధర వేరియంట్‌. ఇప్పటివరకు ఈ సౌకర్యాలు HTK+ (O) నుంచి మాత్రమే లభించేవి. ఇప్పుడు దాదాపు రూ.3 లక్షల తక్కువ ధరలో సన్‌రూఫ్‌ అనుభూతి లభిస్తోంది.

ఇందులో సింగిల్‌ పేన్‌ సన్‌రూఫ్‌, ఆటో AC, డ్రైవర్‌ విండోకు వన్‌ టచ్‌ అప్‌&డౌన్‌, LED DRLs‌, క్యాబిన్‌లో LED లైట్లు ఉన్నాయి. ఇంటీరియర్‌లో బేజ్‌-బ్లాక్‌ కలర్‌ థీమ్‌ కొనసాగుతోంది.

ఇతర ముఖ్య ఫీచర్లు

HTE (EX) వేరియంట్‌లో 8 ఇంచుల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, వైర్‌లెస్‌ ఆండ్రాయిడ్‌ ఆటో, ఆపిల్‌ కార్‌ప్లే, 6 స్పీకర్‌ సౌండ్‌ సిస్టమ్‌, రియర్‌ పార్కింగ్‌ కెమెరా, పవర్డ్‌ ORVMలు, సెమీ డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ ఉన్నాయి.

రియర్‌ విండో సన్‌షేడ్స్‌, టిల్ట్‌ అడ్జస్టబుల్‌ స్టీరింగ్‌ వీల్‌, ఆడియో కంట్రోల్స్‌ కూడా ఇందులో ఉన్నాయి.

వీల్స్‌, సేఫ్టీ వివరాలు

పెట్రోల్‌ వేరియంట్‌కు 15 ఇంచుల బ్లాక్‌ అలాయ్‌ వీల్స్‌ ఇవ్వగా, డీజిల్‌ వేరియంట్‌కు 16 ఇంచుల స్టీల్‌ వీల్స్‌ స్టైలిష్‌ కవర్స్‌తో వస్తాయి. LED హెడ్‌ల్యాంప్స్‌ ఇవ్వలేదు. బదులుగా ఆటో ప్రొజెక్టర్‌ హాలోజన్‌ లైట్లు ఉన్నాయి.

సేఫ్టీ విషయంలో 6 ఎయిర్‌బ్యాగ్స్‌, రియర్‌ పార్కింగ్‌ సెన్సర్లు, TPMS, ISOFIX చైల్డ్‌ సీట్‌ మౌంట్స్‌, నాలుగు చక్రాలకు డిస్క్‌ బ్రేకులు స్టాండర్డ్‌గా ఉన్నాయి.

ఏయే కార్లతో పోటీలో ఉంది?

కియా కారెన్స్‌ క్లావిస్‌కు ప్రధానంగా మారుతి ఎర్టిగా, మారుతి XL6, టయోటా రూమియన్‌, అలాగే సాధారణ కియా కారెన్స్‌ నుంచి పోటీ ఎదురవుతోంది.

మొత్తంగా చూస్తే, కొత్త HTE (EX) వేరియంట్‌ కారెన్స్‌ క్లావిస్‌ను మరింత విలువైన MPVగా మార్చింది. తక్కువ ధరలో సన్‌రూఫ్‌, ఆటో AC కోరుకునే తెలుగు కుటుంబాలకు ఇది మంచి ఎంపికగా మారనుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.