Kawasaki Z650 Price And Specifications: కవాసాకి Z650... ఈ పేరు వినగానే చాలా మందికి ముందుగా గుర్తుకు వచ్చేది దాని అగ్రెసివ్ డిజైన్. కవాసాకి ప్రసిద్ధి చెందిన Sugomi స్టైలింగ్‌తో రూపొందిన Z650 బైక్, Z900 లాంటి పెద్ద బైక్ స్థాయిలో అమ్మకాలు లేకపోయినా, పెర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం ఏమాత్రం రాజీ పడదు. మీరు ఒక ప్రీమియం నేకడ్ స్పోర్ట్స్ బైక్ కొనాలనుకుంటే, Z650ను షార్ట్‌లిస్ట్ చేసే ముందు ఈ 5 ముఖ్యమైన విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి.
1. ఇంజిన్ పవర్ ఎంత?
Kawasaki Z650లో 649cc లిక్విడ్ కూల్డ్, ప్యారలల్ ట్విన్ ఇంజిన్ ఉంది. ఇది 8,000rpm వద్ద 68hp పవర్, 6,700rpm వద్ద 64Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ ఇంజిన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ ఉండటంతో గేర్ షిఫ్టింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. సిటీ రైడింగ్ అయినా, హైవే రైడింగ్ అయినా ఈ ఇంజిన్ నమ్మకంగా పనిచేస్తుంది.
2. బైక్ బరువు ఎంత?
Z650 కర్బ్ వెయిట్ 188 కిలోలు మాత్రమే. ఇది కవాసాకి 650cc సెగ్మెంట్‌లోనే అతి తక్కువ బరువు ఉన్న బైక్. ముఖ్యంగా పవర్ టు వెయిట్ రేషియో 361.70hp/tonne ఉండటంతో, ఈ ధర శ్రేణిలో ఇది చాలా శక్తిమంతమైన ఎంపికగా నిలుస్తుంది. కొత్తగా బిగ్ బైక్ రైడ్ చేయాలనుకునే వారికి ఇది మంచి ప్లస్ పాయింట్.
3. సీట్ హైట్ ఎంత?
ఈ బైక్ సీట్ హైట్ 790mm. సీట్ డిజైన్ న్యారోగా ఉండటంతో, సగటు ఎత్తు ఉన్న రైడర్లు కూడా సులభంగా కాళ్లు నేలపై పెట్టగలుగుతారు. రోజువారీ వినియోగంలోనూ, లాంగ్ రైడ్స్‌లోనూ ఇది కంఫర్ట్‌ను అందిస్తుంది.
4. ఫీచర్లు ఏం ఉన్నాయి?
Kawasaki Z650లో 4.3 అంగుళాల ఫుల్ కలర్ TFT డిస్‌ప్లే ఉంది. Rideology యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు, ఆల్ LED లైటింగ్, మూడు స్థాయిల ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్ ఛానల్ ABS వంటి భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఫీచర్లు బైక్‌ను మరింత ప్రీమియంగా మార్చాయి.
5. ధర ఎంత? ఆన్ రోడ్ ఖర్చు ఎంత?
Kawasaki Z650 ఎక్స్-షోరూమ్ ధర (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) రూ.7.26 లక్షలు.
హైదరాబాద్‌లో ఆన్ రోడ్ ధర సుమారు రూ.8,92,839 కాగా, విజయవాడలో ఆన్ రోడ్ ధర సుమారు రూ.8,48,994గా ఉంటుంది.
అంతర్జాతీయంగా Z650 S అనే కొత్త వేరియంట్‌ను కవాసాకి పరిచయం చేసింది. ఇది భవిష్యత్తులో భారత్‌లోకి వచ్చే అవకాశముంది.
మొత్తానికి, డిజైన్, పనితీరు, ఫీచర్లు, రైడింగ్ ఈజ్ అన్నింటిలోనూ బ్యాలెన్స్ ఉన్న నేకడ్ స్పోర్ట్స్ బైక్ కావాలంటే Kawasaki Z650 ఒక గట్టి ఎంపికగా చెప్పుకోవచ్చు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.