Kawasaki Ninja 300 comparison: భారత మార్కెట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ట్విన్‌-సిలిండర్‌ స్పోర్ట్‌బైక్‌లలో Kawasaki Ninja 300నే అత్యంత చవకైన మోడల్‌. 2026 మోడల్‌గా కొత్త కలర్‌ ఆప్షన్లతో ఇది మళ్లీ షోరూమ్‌లోకి వచ్చింది. Ninja 300ని, ఈ మోటార్‌సైకిల్‌ ప్రధాన ప్రత్యర్థులు అయిన KTM RC 390, Yamaha R3తో పోల్చి చూస్తే ఏ బైక్‌ ఎవరికి సరిపోతుందో స్పష్టంగా అర్థమవుతుంది.

Continues below advertisement

ఇంజిన్‌ & పవర్‌ అవుట్‌పుట్‌

Ninja 300లో 296cc ట్విన్‌-సిలిండర్‌ ఇంజిన్‌ ఉంది. ఇది పవర్‌ను ఎక్కువగా హై రేవ్‌ రేంజ్‌లో ఇస్తుంది. Yamaha R3లో కూడా ఇదే తరహా ట్విన్‌-సిలిండర్‌ సెటప్‌ ఉంటుంది. అందుకే ఈ రెండు బైక్‌లు రైడింగ్‌లో స్మూత్‌గా ఉండటంతో పాటు ఆ సౌండ్‌ వినడానికి కూడా బాగుంటుంది.

Continues below advertisement

ఇదే సమయంలో KTM RC 390 మాత్రం సింగిల్‌-సిలిండర్‌ ఇంజిన్‌తో వస్తుంది. పాత జనరేషన్‌ 373cc ఇంజిన్‌ అయినప్పటికీ పవర్‌, టార్క్‌లో మిగతా రెండింటికంటే స్పష్టంగా ముందుంటుంది. అయితే స్మూత్‌నెస్‌ విషయంలో ట్విన్‌-సిలిండర్‌ బైక్‌లే కొంచెం మెరుగ్గా అనిపిస్తాయి.

 
కవాసాకి నింజా 300
యమహా YZF-R3
కేటీఎం RC 390
ఇంజిన్
 
296cc, twin-cyl, liquid-cooled
321cc, twin-cyl, liquid-cooled
373cc, single-cyl, liquid-cooled
పవర్‌
 
39hp at 11,000rpm
42hp at 10,750rpm
43.5hp at 9,000rpm
వెయిట్‌-టు-పవర్‌ రేషియో
 
217.88hp per tonne
248.52hp per tonne
252.91hp per tonne
టార్క్
 
26.1Nm at 10,000rpm
29.5Nm at 9,000rpm
37Nm at 7,000rpm
గేర్‌బాక్స్
 
6-speed
6-speed
6-speed

 బరువు & డైమెన్షన్స్‌

ఈ మూడు బైక్‌లలో Yamaha R3నే తేలికైనది. సీట్‌ హైట్‌ కూడా తక్కువగా ఉండటం వల్ల కొత్త రైడర్లకు ఇది అనుకూలంగా ఉంటుంది. Ninja 300 మాత్రం మిగతా రెండింటికంటే దాదాపు 10 కిలోలు ఎక్కువ బరువుగా ఉంటుంది. పెద్ద ఫ్యూయల్‌ ట్యాంక్‌ ఉన్నా కూడా ఈ బరువు తేడా స్పష్టంగా కనిపిస్తుంది.

గ్రౌండ్‌ క్లియరెన్స్‌ విషయానికి వస్తే Ninja 300కు 140mm మాత్రమే ఉండటం వల్ల మన రోడ్లపై స్పీడ్‌ బ్రేకర్ల దగ్గర కొంచెం జాగ్రత్త అవసరం.

 
కవాసాకి నింజా 300
యమహా YZF-R3
కేటీఎం RC 390
కెర్బ్ వెయిట్‌
 
179kg
169kg
172kg
సీటు ఎత్తు
 
780mm
780mm
835mm
గ్రౌండ్ క్లియరెన్స్
 
140mm
160mm
153mm
ఇంధన ట్యాంక్ సామర్థ్యం
 
17 litres
14 litres
13.7 litres
వీల్ బేస్
 
1,405mm
1,380mm
1,347mm

సస్పెన్షన్‌, టైర్లు & బ్రేకులు

Ninja 300 డిజైన్‌ పదేళ్లకు పైగా పాతది కావడంతో దాని హార్డ్‌వేర్‌లో వయసు కనిపిస్తుంది. స్టీల్‌ ఫ్రేమ్‌, సాధారణ టెలిస్కోపిక్‌ ఫోర్క్‌, బయాస్‌-ప్లై టైర్లు ఇందులో ఉన్నాయి.

ఈ విషయంలో KTM RC 390 స్పష్టంగా ముందుంటుంది. రేడియల్‌ మౌంటెడ్‌ ఫ్రంట్‌ బ్రేక్‌ కాలిపర్‌, పెద్ద డిస్క్‌లు, కొంత అడ్జస్టబిలిటీ ఉన్న సస్పెన్షన్‌తో ఇది స్పోర్టీ రైడింగ్‌కు బాగా సరిపోతుంది.

 
కవాసాకి నింజా 300
యమహా YZF-R3
కేటీఎం RC 390
సస్పెన్షన్‌ (F/R)
 
Telescopic fork / Monoshock
USD fork / Monoshock
USD fork / Monoshock
టైర్లు (F/R)
 
110/70-17 / 140/70-17
110/70-R17 / 140/70-R17
110/70-R17 / 150/60-R17
బ్రేకులు (F/R)
 
290mm disc / 220mm disc
298mm disc / 220mm disc
320mm disc / 230mm disc

ఫీచర్లు

ఫీచర్ల విషయంలో KTM RC 390కి తిరుగులేదు. బైడైరెక్షనల్‌ క్విక్‌షిఫ్టర్‌, కలర్‌ TFT డిస్‌ప్లే, ట్రాక్షన్‌ కంట్రోల్‌, స్విచ్‌బుల్‌ ABS వంటి ఆధునిక సౌకర్యాలు ఇందులో ఉన్నాయి.

భారత్‌లో అమ్ముతున్న Yamaha R3 అంతర్జాతీయ మోడల్‌తో పోలిస్తే ఒక జనరేషన్‌ పాతది. స్లిప్పర్‌ క్లచ్‌ కూడా ఇందులో లేదు. Ninja 300కు ఇటీవల ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాంప్స్‌, ఎత్తైన విజర్‌ ఇచ్చారు కానీ మిగతా విషయాల్లో ఇది దాదాపు 2013 మోడల్‌లాగే ఉంటుంది.

ధర & వాల్యూ

ఈ మూడింటిలో Ninja 300నే అత్యంత చౌక ట్విన్‌-సిలిండర్‌ స్పోర్ట్‌బైక్‌. ఫీచర్లు, పవర్‌ చూస్తే RC 390 మంచి 'వాల్యూ ఫర్‌ మనీ'గా అనిపిస్తుంది. అయితే ట్విన్‌-సిలిండర్‌ ఫీల్‌ కావాలంటే Ninja 300 లేదా Yamaha R3 లో ఒకటి ఎంచుకోవాలి.

 
కవాసాకి నింజా 300
యమహా YZF-R3
కేటీఎం RC 390
ధర (ఎక్స్‌-షోరూమ్‌, తెలుగు రాష్ట్రాలు)
 
రూ. 3.17 లక్షలు
రూ. 3.39 లక్షలు
రూ. 3.23 లక్షలు

ఇటీవల మార్కెట్‌లోకి వచ్చిన Aprilia RS 457 కూడా ఒక ఆప్షన్‌ అయినప్పటికీ, ధర ఎక్కువగా ఉండటంతో పాటు ఇంజిన్‌ సంబంధిత సమస్యలపై వార్తలు వినిపిస్తున్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.