JSW Motors భారత ఆటోమొబైల్ మార్కెట్లో తన పట్టును నిలుపుకునేందుకు పలు కొత్త కార్లను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. కంపెనీ జర్నీ Jetour T2 ప్రీమియం ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUVతో ప్రారంభం కావచ్చు. తరువాత పలు కొత్త మోడళ్లు రానున్నాయి. వీటిలో Chery పోర్ట్‌ఫోలియో నుంచి వస్తున్న iCaur V23 ఎలక్ట్రిక్ SUV ఉంది. ఈ SUV భారత్‌లో టెస్టింగ్ సమయంలో కనిపించింది. తన చిన్న కానీ బాక్సీ బలమైన డిజైన్ కారణంగా ఈ SUV Mahindra Thar సహా ఇతర వాహనాలకు ఎలక్ట్రిక్ ఆప్షన్‌గా గట్టి పోటీ ఇవ్వనుంది.
కార్ డిజైన్ ప్రత్యేకతలు
JSW iCaur V23 కారులో ప్రత్యేకత దీని డిజైన్. ఈ SUV చూసేందుకు చాలా బాక్సీగా, స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఇందులో రౌండ్ షేప్ LED హెడ్లైట్లు ఇస్తుంది. దీని ఫ్రంట్ లుక్‌ను ప్రత్యేకం చేస్తాయి. దీని నిటారైన బాడీ డిజైన్ దీనికి ఆఫ్-రోడింగ్ కోసం తయారు చేసిన SUV తరహా లుక్ ఇస్తుంది. సైజ్ చాలా పెద్దది కానప్పటికీ, డిజైన్ వల్ల ఇది చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. సాధారణంగా ఆఫ్ రోడింగ్ అడ్వెంచర్ కోసం రెడీ చేసే వాహనాల్లో ఇలాంటి డిజైన్ కనిపిస్తుంది. iCaur V23 వచ్చే ఏడాది లాంచ్ అయ్యే అవకాశం ఉంది. రూ.18 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ధరలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.
iCaur V23 పవర్ ఫుల్ ఆఫ్-రోడ్ SUV డిజైన్ ఉన్నప్పటికీ ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ కార్. దీని టాప్ స్పెక్ వెర్షన్లో ఆల్-వీల్ డ్రైవ్ AWD సిస్టమ్ ఇచ్చే చాన్స్ ఉంది. ఇందులో డ్యూయల్-మోటార్ సెటప్ రావొచ్చు. అంటే ముందు వెనుక రెండు యాక్సిల్స్‌పై ఎలక్ట్రిక్ మోటార్లు పనిచేస్తాయి. దీనివల్ల అధ్వానమైన రోడ్లు ఆఫ్-రోడ్ పరిస్థితులలో SUVకి మెరుగైన ట్రాక్షన్ లభించవచ్చు.
iCaur V23 భారత్‌లో 2 వేర్వేరు బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. ఇందులో సుమారు 59.93 kWh 81.76 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు రావొచ్చు. పెద్ద బ్యాటరీ ప్యాక్ ఉన్న వెర్షన్లో AWD డ్యూయల్-మోటార్ సెటప్ అవకాశం ఉంది. దీని డ్రైవింగ్ రేంజ్ దాదాపు 450 కిలోమీటర్ల వరకు ఉండవచ్చు. ఈ రేంజ్ భారత మార్కెట్లోకి వచ్చే మోడల్లో కూడా లభిస్తే, లాంగ్ జర్నీ చేసే వారికి ఇది బాగుంటుంది.
కార్ డిజైన్‌లో టైల్గేట్పై ఒక బాక్స్ అమర్చారు. ఇందులో ఛార్జింగ్ కేబుల్ ఉంచవచ్చు. ఎలక్ట్రిక్ కార్లో ఛార్జింగ్ కేబుల్‌ను ఉంచడానికి ప్రత్యేకమైన, ఈజీగా అందుబాటులో ఉండే స్టోరేజ్ సౌకర్యం అవసరం. ఈ ఫీచర్ V23ని ఇతర కాంపాక్ట్ ఎలక్ట్రిక్ వాహనాలకు దీన్ని భిన్నంగా నిలుపుతుంది.
కేబిన్ అతిపెద్ద ఆకర్షణ 15.6 ఇంచుల పెద్ద టచ్‌స్క్రీన్. ఈ స్క్రీన్ కార్ ఇన్ఫోటైన్మెంట్ ఇతర ఫంక్షన్లను నియంత్రిస్తుంది. iCaur V23 ని 5 సీటర్ గా రావొచ్చు. భారత మోడల్లో పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఇవ్వవచ్చు.
