జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా 2026 ఆర్థిక సంవత్సరం ముగింపు వేళ కస్టమర్లను ఆకట్టుకోవడానికి భారీ డిస్కౌంట్ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. ఇయర్-ఎండ్ సేల్స్‌ను పెంచడమే లక్ష్యంగా తన పోర్ట్‌ఫోలియోలోని దాదాపు అన్ని కార్లపై రకరకాల బెనిఫిట్స్ ప్రకటించింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలపై (EV) ప్రత్యేక ఫోకస్ పెట్టిన ఈ కంపెనీ, క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, లాయల్టీ రివార్డులతో పాటు కార్పొరేట్ బెనిఫిట్స్‌ను కూడా అందిస్తోంది. బడ్జెట్ ఈవీల నుండి ప్రీమియం ఎస్‌యూవీల వరకు అన్ని సెగ్మెంట్లలో ఈ తగ్గింపులు వర్తిస్తాయి. ఈ నెలలో ఎంజీ గ్లోస్టర్ కొనేవారికి భారీ ఊరట లభిస్తుంది. అన్ని వేరియంట్లపై నేరుగా రూ. 3.5 లక్షల రిటైల్ బెనిఫిట్ లభిస్తోంది. దీనికి తోడు రూ. 20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా కలుపుకుంటే మొత్తం రూ. 3.7 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. ఫుల్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ప్రస్తుతం ఇదే అత్యుత్తమ డీల్ అని చెప్పవచ్చు.

లక్షల్లో పొదుపుఎంజీ లైనప్‌లో కీలకమైన హెక్టర్ మోడల్‌పై కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. ప్రీ-ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ పెట్రోల్, డీజిల్ వేరియంట్లపై రూ. 1.05 లక్షల వరకు రిటైల్ డిస్కౌంట్ లభిస్తోంది. ఎక్స్ఛేంజ్, లాయల్టీ ఆఫర్లు కలుపుకుంటే మొత్తం ప్రయోజనం రూ. 1.45 లక్షల వరకు ఉంటుంది. సరికొత్త ఫేస్‌లిఫ్టెడ్ హెక్టర్ డీజిల్ మాన్యువల్ వేరియంట్లపై రూ. 50,000 ఇన్సెంటివ్స్ ఉన్నాయి. అన్ని బెనిఫిట్స్ కలిపి దాదాపు రూ. 90,000 కంటే ఎక్కువ ఆదా అవుతుంది.

వాల్యూ డీల్బేస్ ట్రిమ్ మినహా ఆస్టర్ మిగిలిన అన్ని వేరియంట్లపై రూ. 20,000 రిటైల్ ఇన్సెంటివ్ అందుబాటులో ఉంది. ఎక్స్ఛేంజ్, లాయల్టీ బోనస్‌లతో పాటు కార్పొరేట్ డిస్కౌంట్లు కలిపితే మొత్తం రూ. 65,000 వరకు లాభం చేకూరుతుంది. మిడ్-సైజ్ ఎస్‌యూవీ కోరుకునే వారికి ఇది ఒక మంచి ఆప్షన్.

ఎలక్ట్రిక్ కార్లపై ఆఫర్లుఈవీ రంగంలో తమ పట్టును నిరూపించుకుంటున్న జెడ్ఎస్ ఈవీ (ZS EV) పై అన్ని వేరియంట్లలో రూ. 20,000 రిటైల్ బెనిఫిట్ ఉంది. ఇతర బోనస్ ఆఫర్లతో కలిపి మొత్తం రూ. 60,000 వరకు ప్రయోజనం లభిస్తుంది. ఇక చిన్న ఎలక్ట్రిక్ కారు కామెట్ ఈవీ (Comet EV) పై వేరియంట్‌ను బట్టి రూ. 10,000 నుండి రూ. 30,000 వరకు తగ్గింపు ఉంది. లాయల్టీ, కార్పొరేట్ బెనిఫిట్స్ కలిపితే దీనిపై రూ. 50,000 వరకు ఆదా చేయవచ్చు. కొత్త కారు కొనే ప్లాన్ ఉంటే మార్చి నెలలో ఎంజీ షోరూమ్‌ను సందర్శించడం లాభదాయకమ‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.