జీప్ కంపెనీ మనదేశంలో కంపాస్ కారుతో మెయిన్ లీగ్‌లోకి ఎంటర్ అయింది. కాంపిటీషన్‌లో నెక్స్ట్ లెవల్‌కు వెళ్లడానికి మెరిడియన్‌ను లాంచ్ చేసింది. మరి ఈ మెరిడియన్ కారు ఎలా ఉంది? ఈ మూడు వరుసల ఎస్‌యూవీ వినియోగదారులకు చాయిస్‌గా మారగలదా? రివ్యూలో చూద్దాం...


లుక్స్ ఎలా ఉన్నాయి?
పైన చెప్పినట్లు ఇది ఒక మూడు వరుసల ఎస్‌యూవీ కారు. ఈ ధరలో ఉన్న మిగతా ఎస్‌యూవీలకు ఇది ప్రీమియం ఆల్టర్నేటివ్. దీని బ్రాండ్ చూడకపోయినా డిజైన్ చూసి ఇది జీప్ కంపెనీ కారు అని చెప్పవచ్చు. అంత ట్రెడిషనల్ జీప్ మార్కు డిజైన్‌తో ఈ కారు రూపొందించారు. ఈ కారు పొడవు 4769 మిల్లీమీటర్లుగా ఉంది. 18 అంగుళాల అలోయ్ వీల్స్‌ను ఇందులో అందించారు. ఇవి దీని బాడీకి పర్ఫెక్ట్ సైజు. దీని వెనకవైపు డిజైన్ చూస్తే అమెరికాలో విక్రయించే జీప్ కార్ల తరహాలో ఉంది. చూడటానికి బాగున్న పెద్ద ఎస్‌యూవీ కారు ఇది.


ఇంటీరియర్ ఆకట్టుకుందా?
దీని ఇంటీరియర్స్ కూడా కంపాస్ తరహాలో టఫ్ ఫీల్‌ను అందిస్తాయి. కారు లోపల చూడటానికి కంపాస్ తరహాలో ఉండటం ఒక్కటే మైనస్. అయితే చూడటానికి ప్రీమియం ఫీల్‌ను అందిస్తుంది. లెదర్ సీట్లను అందించారు. 10.1 అంగుళాల టచ్ స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఇందులో ఉన్నాయి. దీని టచ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. 360 డిగ్రీ కెమెరాను జీప్ ఈ కారులో అందించింది. ఆటో హ్యాండ్ బ్రేక్, టూ పేన్ పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ చార్జింగ్, వైర్‌లెస్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, మల్టీజోన్ క్లైమెట్ కంట్రోల్, పవర్డ్ లిఫ్ట్ గేట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, ఆరు ఎయిర్ బ్యాగ్స్ కూడా ఇందులో ఉన్నాయి.


కారు పెద్దగా ఉందా?
ఈ కారు సైజులో కూడా విశాలంగా ఉంది. వీల్ బేస్ పెద్దగా ఉంది. కాబట్టి రెండో వరుస వారికి లెగ్ రూం ఎక్కువ లభించినట్లే. మూడో వరుసలో కూర్చున్న వారికి కొంచెం ఇరుగ్గా అనిపించవచ్చు. కానీ అక్కడ పిల్లలను కూర్చోపెడితే మాత్రం సరిపోతుంది.


డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది?
ఇందులో 6-స్పీడ్ మాన్యువల్, 9-స్పీడ్ ఆటోమేటిక్ వేరియంట్లు ఉన్నాయి. ప్రసుతానికి 2.0 లీటర్ డీజిన్ ఆప్షన్ మాత్రమే ఇందులో అందించారు. దీని బీహెచ్‌పీ 170 కాగా.. పీక్ టార్క్ 350 ఎన్ఎంగా ఉంది. దీని టార్క్ బలంగా ఉంది కాబట్టి ఎక్కువ వేగంలో కూడా సులభంగానే వెళ్లవచ్చు. మెరీడియన్‌కు కాంపిటీషన్‌గా ఉన్న కార్లన్నిటిలో ఇదే డ్రైవింగ్ చేయడం సులభం. స్టీరింగ్ కూడా మరీ హెవీగా లేకుండా తిప్పడానికి సులభంగా ఉంది. 


ఓవరాల్‌గా చెప్పాలంటే...
ఓవరాల్‌గా చెప్పాలంటే జీప్ మెరీడియన్ కంపాస్ కంటే ఎంతో మెరుగ్గా ఉంది. ఇది చూడటానికి టఫ్‌గా ఉన్నప్పటికీ, మంచిగా బిల్డ్ చేశారు. ఈ ధరలో పాపులర్ చాయిస్ ఇదే అయ్యే అవకాశం ఉంది.


ఈ కారులో నచ్చినవి - లుక్స్, ఫీచర్లు, సామర్థ్యం, క్వాలిటీ
ఈ కారులో నచ్చనివి - ఇరుగ్గా ఉన్న మూడో వరుస, కంపాస్ కంటే పవర్ కాస్త  తక్కువగా ఉండటం


Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!


Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?