ప్రస్తుతం వర్షాకాలం కావడంతో వానలు బాగా పడుతున్నాయి. ఈ సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలను చార్జింగ్ పెట్టడం సురక్షితమేనా అనే ఆలోచన చాలా మందికి వస్తుంది. సాధారణంగా నీరు, కరెంటు కలవడం చాలా ప్రమాదకరం. కానీ ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో అటువంటి భయాలు అవసరం లేదు. పెట్రోల్, డీజిల్ కార్లను ఎలా ఉపయోగిస్తారో, ఈ వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కార్లను కూడా అలాగే ఉపయోగించవచ్చు.


మార్కెట్లో అందుబాటులో ఉన్న అన్ని ఎలక్ట్రిక్ వాహనాల్లో ఐపీ రేటింగ్ సిస్టం ఉంది. ఇది మీ ఎలక్ట్రిక్ వాహనం బ్యాటరీని దుమ్ము, నీటి నుంచి కాపాడుతుంది. అయితే మిగతా కార్ల లాగానే నీరు ఎక్కువగా నిలిచిన రోడ్లపై ఎలక్ట్రిక్ వాహనాలను నడపకపోవడం మంచిది.


ఈ కార్లలో ఐపీ67 రేటింగ్‌ను అందించారు. అంటే ఒక మీటరు కంటే ఎక్కువ లోతులో 30 నిమిషాల కంటే ఎక్కువ సేపు కారు ఉండకూడదన్న మాట. ఇదొక్కటి తప్ప వర్షం పడిన సమయంలో మీ ఎలక్ట్రిక్ వాహనానికి ఎటువంటి సమస్య లేదన్న మాట.


పరిస్థితులు ఎంత ప్రమాదకరంగా మారినప్పటికీ కారులో ఎన్నో ప్రొటెక్టివ్ లేయర్స్ ఉన్నాయి. కాబట్టి నీరు లోపలికి వచ్చినా ఎటువంటి ప్రమాదం ఉండదన్న మాట. దీంతో డ్రైవర్‌కు కూడా ఎటువంటి సమస్యా ఉండదు. వర్షం పడే సమయంలో చార్జింగ్ పెట్టాల్సి వస్తే ఎటువంటి భయం లేకుండా పెట్టవచ్చు. ఎందుకంటే ఇందులోని ప్రతి పరికరం వెదర్ ప్రూఫ్‌తో రానుంది. ఒకవేళ మీ కారు చార్జింగ్‌లో ఉన్నప్పుడు వర్షం పడినప్పటికీ ఎటువంటి సమస్య ఉండదన్న మాట. ఎందుకంటే ఎలక్ట్రిక్ కార్లు విక్రయించే ముందు అవి వెదర్ ప్రూఫా, కాదా అని చెక్ చేయాల్సి ఉంటుంది.


Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!


Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?