Ranveer Singh Car Collection 2026: బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ఎనర్జిటిక్ నటుడిగా రణవీర్ సింగ్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ధురంధర్ 1,2 పార్టుల స‌క్సెస్ తో జోష్ మీద ఉన్నారు. కేవలం నటనలోనే కాకుండా, తన విలక్షణమైన లైఫ్ స్టైల్, ఖరీదైన కార్ల విషయంలోనూ రణవీర్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ఆయన వద్ద ఉన్న కార్ల కలెక్షన్ రణవీర్ పర్సనాలిటీ లాగే చాలా బోల్డ్ గా, స్టైలిష్ గా ఉంటుంది. ఇందులో సూపర్ కార్లు, లగ్జరీ ఎస్‌యూవీలతో పాటు ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఉన్నాయి. రణవీర్ గ్యారేజీలో ఉన్న టాప్ 5 కార్ల విశేషాలు ఇప్పుడు చూద్దాం.

Continues below advertisement

జిఎమ్‌సి హమ్మర్ ఈవీ 3ఎక్స్ (GMC Hummer EV 3X)

రణ్ వీర్ కలెక్షన్‌లో ఇటీవల చేరిన అత్యంత అరుదైన వాహనం ఈ హమ్మర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. రోడ్డుపై దీని ఉనికి అద్భుతంగా ఉంటుంది. ఇందులో ఉండే 'క్రాబ్ వాక్' (Crab Walk) ఫీచర్ ద్వారా ఈ భారీ వాహనం వికర్ణంగా (Diagonally) ప్రయాణించగలదు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ ఎలక్ట్రిక్ జెయింట్ రణవీర్ క్రేజీ ఛాయిస్‌కు నిదర్శనంగా చెప్ప‌వచ్చు.

రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఎల్ డబ్ల్యూ బి (Range Rover Autobiography LWB)

రాజసం, సౌకర్యానికి మారుపేరుగా నిలిచే రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ రణవీర్ వద్ద ఉన్న అత్యంత విలాసవంతమైన కార్లలో ఒకటి. లాంగ్ వీల్ బేస్ (LWB) వెర్షన్ కావడం వల్ల లోపల చాలా విశాలంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా సెలిబ్రిటీల ఫేవరెట్ ఛాయిస్ అయిన ఈ కారు ప్రయాణంలో అత్యున్నత స్థాయి కంఫర్ట్ ఇస్తుంది.

Continues below advertisement

లాంబోర్గిని ఉరుస్ పర్ల్ క్యాప్సూల్ (Lamborghini Urus Pearl Capsule)

రణవీర్ గ్యారేజీలో ఉన్న అత్యంత స్టైలిష్ కారు ఇది. బోల్డ్ ఆరెంజ్ షేడ్‌లో ఉండే ఈ సూపర్ ఎస్‌యూవీ రణవీర్ ఎనర్జీకి పర్ఫెక్ట్ మ్యాచ్. ట్విన్-టర్బో V8 ఇంజిన్‌తో వచ్చే ఈ కారు కేవలం 3.6 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. వేగం, పవర్ కోరుకునే వారి కోసం తయారైన ఈ కారు అంటే రణ్ వీర్ కు చాలా ఇష్టం.

మెర్సిడెస్-మేబాక్ జీఎల్ఎస్ 600 (Mercedes-Maybach GLS 600)

లగ్జరీకి కేరాఫ్ అడ్రస్ ఈ మేబాక్ ఎస్‌యూవీ. కారు లోపల మసాజ్ ఛైర్స్ వంటి ఎన్నో ఫస్ట్-క్లాస్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. V8 ఇంజిన్‌తో పర్ఫార్మెన్స్ ఇస్తూనే, ప్రయాణికులకు ఒక విలాసవంతమైన అనుభూతిని ఇది అందిస్తుంది.

ఆస్టన్ మార్టిన్ రాపిడ్ ఎస్ (Aston Martin RAPIDE S)

స్టైల్, స్పీడ్ కలబోత ఈ ఫోర్-డోర్ స్పోర్ట్స్ కారు. పవర్‌ఫుల్ V12 ఇంజిన్‌తో వచ్చే ఈ కారు స్లీక్ డిజైన్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. స్పోర్ట్స్ కారు ఇచ్చే త్రిల్ తో పాటు నలుగురు ప్రయాణించే వీలు ఉండటం దీని ప్రత్యేకత. రణ్ వీర్ సింగ్ కార్ల కలెక్షన్ ఆయన సక్సెస్ కు, వాహనాల పట్ల ఆయనకున్న ప్యాషన్ కు ఒక నిదర్శనం. భవిష్యత్తులో మరిన్ని కొత్త మోడల్స్ ఆయన గ్యారేజీలోకి చేరే అవకాశం ఉంది.