Lamborghini Huracan Features: రాంఛీ: సోషల్ మీడియా ఎంతో మంది జీవితాలను మార్చేసింది. రాత్రికి రాత్రే దేశ వ్యాప్తంగా సెలబ్రిటీలు అయిన వారు ఉన్నారు. ఒక్క వీడియోతో, ఒక్క చిన్న ఘటనతో కొత్త కెరీర్ వైపు అడుగులు వేసి సక్సెస్ అవుతున్నారు. సోషల్ మీడియా కంటెంట్ క్రియేట్ చేయడం పలు రంగాల వారికి కొత్త కెరీర్‌గా మారింది. అలాంటి కంటెంట్ క్రియేటర్లలో ఒకరైన జార్ఖండ్‌కు చెందిన ట్రక్ డ్రైవర్ రాజేష్ ఏకంగా లంబోర్గిని కారు నడిపాడు. అతను తన YouTube ఛానెల్ R Rajesh Vlogsలో ట్రక్ డ్రైవింగ్ లైఫ్, తన టూర్‌లకు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేసి ఫేమస్ అయ్యాడు. దేశంలోని అత్యంత ప్రసిద్ధ ట్రక్ డ్రైవర్లలో ఒకడిగా రాజేష్ నిలిచాడు. ఇటీవల రాజేష్‌కు తొలిసారిగా ఫేమస్ కంపెనీ Lamborghini Huracan సూపర్ కారును నడిపిన ఒక వీడియో వైరల్ అయింది.
ట్రక్ డ్రైవర్‌కు Lamborghini నడిపే అవకాశం ఎలా వచ్చింది?
ట్రక్ డ్రైవర్ రాజేష్ తన కొడుకుతో కలిసి అస్సాంకు వెళ్లారు. ట్రక్ లోడింగ్, అన్‌లోడింగ్ పనులతో వారు కొన్ని రోజులు అక్కడే ఉన్నారు. ఈ సమయంలో, అతను తన స్నేహితులను కలుసుకున్నాడు. స్థానిక మార్కెట్‌కు వెళ్లాడు. అప్పుడు రాజేష్ స్నేహితుడు తన Lamborghini Huracan కారును చూపించాడు. అంతటితో ఆగకుండా లంబోర్గిని కారు నడపమని రాజేష్‌కు చెప్పాడు. మొదట ఇది కలనా, నిజమా అని రాజేష్ అనుకున్నాడు. ఇంతకు ముందు అలాంటి సూపర్ కారును రాజేష్ చూడలేదు. అతను డ్రైవర్ సీటులో కూర్చోవడానికి బదులుగా మరో సీటులో కూర్చోవాలనుకున్నాడు, కాని కారు యజమాని బలవంతంగా అతన్ని డ్రైవింగ్ సీటులో కూర్చోబెట్టి లంబోర్గిని కారు ఫీచర్లను వివరించాడు.
Lamborghini Huracan ఎలా ఉంది?
Lamborghini Huracan అనేది బెస్ట్ స్పోర్ట్స్ కారు. లంబోర్గిని ఈ మోడల్ కార్ల ధర రూ.3 కోట్ల నుంచి దాదాపు రూ.4.5 కోట్ల వరకు ఉంది. ఇది ప్రత్యేకంగా అధిక వేగంతో పాటు లగ్జరీని ఇష్టపడే వారి కోసం తయారు చేశారు. ఇది 5.2-లీటర్ల పవర్‌ఫుల్ V10 ఇంజిన్ కలిగి ఉంది. ఇది దాదాపు 610 నుంచి 640 bhp శక్తిని.. 560 నుంచి 565 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. కారులో 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఇచ్చారు. దాంతో గేర్ షిఫ్టింగ్ చాలా సున్నితంగా చేస్తుంది.
ఈ కారు స్ట్రాడా, స్పోర్ట్, కోర్సా వంటి వివిధ డ్రైవింగ్ మోడ్‌లతో మార్కెట్లోకి వచ్చింది. డ్రైవర్ తన ఇష్టాన్ని, రోడ్డు పరిస్థితి ఆధారంగా ఈ మోడ్‌లను ఎంచుకోవచ్చు. ఇది Lamborghini ప్రత్యేక ఇంటిగ్రేటెడ్ వెహికల్ డైనమిక్స్ (LDVI) సిస్టమ్ కలిగి ఉంది, ఇది డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగుపరుస్తుంది. సేఫ్టీ విషయానికి వస్తే.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, బలమైన అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది. Lamborghini Huracan అనేది వేగం, లగ్జరీ, అధిక భద్రత ఫీచర్లు కలిగిన ఒక సూపర్ కారు.
ట్రక్ డ్రైవర్ రాజేష్ లంబోర్గిని కారు డ్రైవ్ చేసే అవకాశం వచ్చిన విషయం వైరల్ అవుతోంది. అతడు వినయపూర్వకంగా ఉంటాడు. ట్రక్ డ్రైవర్ జీవితాన్ని మనకు వీడియోల ద్వారా కళ్లకు కట్టినట్లు చూపిస్తాడు. అయితే మొదటిసారిగా రాజేష్ ఒక సూపర్ కారును డ్రైవింగ్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది.