EV Sales November 2025: భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ నవంబర్ నెలలో మరొక భారీ వృద్ధిని నమోదు చేసుకుంది. మొత్తం 14,739 ఎలక్ట్రిక్ కార్లు రిజిస్టర్ కావడంతో, ఇది 2025లో ఐదో అత్యుత్తమ నెలగా నిలిచింది. గత ఏడాది (2024) నవంబర్‌తో పోలిస్తే ఈసారి సేల్స్ 61 శాతం పెరిగాయి. EV సెగ్మెంట్ ఎంత వేగంగా ముందుకు సాగుతోందో ఇది స్పష్టంగా చూపిస్తుంది.

Continues below advertisement

నవంబర్ సేల్స్‌లో, ముఖ్యంగా, టాటా మోటార్స్ తన ఆధిపత్యాన్ని మరింత బలపరచుకుంది. Punch EV, Nexon EV, Tiago EVలకు వస్తున్న డిమాండ్ కారణంగా టాటా 42% మార్కెట్ షేర్ సాధించింది. ఇది భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికిల్స్ సెగ్మెంట్‌లో ఇప్పటికీ టాటాకే స్పష్టమైన ఆధిక్యం ఉందని చూపిస్తుంది.

MG & Mahindra – రెండో స్థానానికి పోటీMG మోటార్ నవంబర్‌లో 25% మార్కెట్ షేర్ సాధించి బలమైన స్థానం కాపాడుకుంది. ముఖ్యంగా Windsor EVనే దాని సేల్స్‌కి ప్రధాన బలం. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత, MGకి ఇది తక్కువ సేల్స్‌ ఉన్న రెండో నెల అయినప్పటికీ, మొత్తం పనితీరు స్థిరంగా ఉంది. కంపెనీ, మొత్తం కలిపి 1 లక్ష ఎలక్ట్రిక్ వెహికిల్స్ సేల్స్‌ను కూడా ఇటీవల దాటింది.

Continues below advertisement

మహీంద్రా కూడా BE 6, XEV 9e వంటి మోడళ్లతో EV సెగ్మెంట్‌లో పట్టు సాధించగలగింది. అలాగే కొత్తగా లాంచ్ చేసిన XEV 9S కారణంగా కంపెనీ సేల్స్ మరింత పెరిగాయి. నవంబర్‌లో మహీంద్రా 2,940 ఎలక్ట్రిక్ SUVs అమ్మి 20% మార్కెట్ షేర్ దక్కించుకుంది.

Kia, BYD, Hyundai – స్థిరమైన రైజర్లుKia నవంబర్‌లో 463 యూనిట్ల సేల్స్‌తో, గత ఏడాది ఇదే నెలతో పోల్చితే నాలుగు స్థానాలు ఎగబాకింది, ఇప్పుడు నాలుగో స్థానం పొందింది. Carens Clavis EV ఈ పురోగతికి ప్రధాన కారణం.

BYD ఇండియా మాత్రం ఐదో స్థానానికి దిగజారింది. కంపెనీ Sealion 7 మోడల్ ధరలను జనవరిలో పెంచే అవకాశం ఉండగా, డిసెంబర్ 31కి ముందు బుక్‌ చేసుకుంటే పాత ధరలే వర్తిస్తాయి.

Hyundai నవంబర్‌లో 372 EVలు అమ్మి, భారీగా 1,671% YoY (గత ఏడాదితో పోలిస్తే) వృద్ధి సాధించింది. Creta Electric ఈ వృద్ధికి ప్రధాన బలం.

Citroen మాత్రం కేవలం 30 యూనిట్లు మాత్రమే విక్రయించడంతో 63% తగ్గుదల కనిపించింది.

లగ్జరీ EV మార్కెట్ – చిన్నదైనా బలమైన వృద్ధినవంబర్ 2025లో లగ్జరీ కార్ బ్రాండ్లు అన్నీ కలిసి 417 EVలు అమ్మాయి, ఇది 66% YoY వృద్ధి.

BMW ఇండియా 267 యూనిట్ల సేల్స్‌తో లగ్జరీ EV సెగ్మెంట్‌లో 64% షేర్ దక్కించుకుంది. Mercedes-Benz 69 యూనిట్లతో రెండో స్థానంలో నిలిచింది. Volvo 28, Porsche 4 యూనిట్లు అమ్మాయి.

కొత్త బ్రాండ్లు – Vinfast & Tesla హైలైట్నవంబర్‌లో అత్యంత పెద్ద సర్‌ప్రైజ్‌ Vinfast. కేవలం ఒక నెలలోనే 288 యూనిట్లు అమ్మి, మొత్తం EV బ్రాండ్లలో 7వ స్థానానికి వేగంగా చేరుకుంది. ఇది BMW కంటే ఎక్కువ సేల్స్ చేయడం గమనార్హం. VF6, VF7 SUVsకి మంచి రెస్పాన్స్ వచ్చింది. కంపెనీ ఫిబ్రవరి 2026లో 7-సీటర్ Limo Green MPVను కూడా లాంచ్ చేయనుంది.

Tesla, గత నెలలో 48 Model Y యూనిట్లు అమ్మి, లగ్జరీ EV కార్లలో 3వ స్థానంలో నిలిచింది.

2025 మొత్తం సేల్స్ కొత్త రికార్డ్ వైపు...2025లో, జనవరి–నవంబర్ వరకు నమోదైన మొత్తం EV ప్యాసింజర్ కార్ల సేల్స్ 1.6 లక్షల యూనిట్లను దాటాయి, ఇది 2024 మొత్తం సేల్స్‌ను ఇప్పటికే మించిపోయింది.

మారుతి e-Vitara వంటి మోడళ్ల లాంచ్‌తో, ఈ ఏడాది మొత్తం 1.75 లక్షల నుంచి 1.80 లక్షల యూనిట్లు సేల్స్ నమోదయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.