Best Mileage Electric Bikes: భారత్‌ చమురు సంక్షోభం ముంగిట ఉంది. అందుకే వీలైనంత వరకు ఎలక్ట్రిక్ వాహనాలు యూజ్ చేయాలని ప్రభుత్వాలే ప్రోత్సహిస్తున్నాయి. రాయితీలు కూడా ఇస్తున్నాయి. దీనికి తోడు కంపెనీలు కూడా మంచి మైలేజీ, వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టుగానే మోడల్స్ డిజైన్ చేస్తున్నాయి. దీంతో యువత కూడా వాటి పట్ల మక్కువ పెంచుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం మార్కెట్‌లో(Indian Bike Market 2026) మంచి రేంజ్ అంటే 150 కిలోమీటర్లకు మించిన రేంజ్ కలిగిన ఈ బైక్స్ గురించి చూద్దాం. 

Continues below advertisement

ఈవీలు దించుతున్న ప్రముఖ కంపెనీలు

150 రేంజ్‌కు మించిన విభాగంలో చూస్తే ప్రస్తుతం 389కిపైగా విభిన్న మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో స్టైలిష్ డిజైన్, అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు, అత్యుత్తమ పనితీరును అందించే వాహనాలు ఉన్నాయి. ఈ ఏడాది వాహన కంపెనీలు తమ ఫ్లాగ్‌షిప్ మోడళ్లను మార్కెట్‌లోకి వదిలేశారు. ముఖ్యంగా యూత్ ఐకాన్‌గా మారిన కేటీఎం, అత్యధిక విక్రయాలు జరిపే హోండా, టీవీఎస్(TVS Electric Bikes) సంస్థలు కొత్త బెంచ్ మార్క్‌లను సెట్ చేశాయి 

Continues below advertisement

పెట్రోల్ భారం పెరుగుతున్న వేళ ఈవీలు మంచి ప్రత్యామ్నాయంగా మారాయి.  ఇందులో మొదటిది టీవీఎస్ ఆర్బిటర్. ఇది 88, 250 నుంచి 1.05 లక్షల ధరలో లభిస్తోంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 86 నుంచి 158 కిలోమీటర్లు వరకు ప్రయాణించవచ్చు. హీరో మోటోకార్ప్‌ అనుబంధ సంస్థ విడా నుంచి వచ్చిన వీఎక్స్‌2 మోడల్‌ 73,850 ప్రారంభ ధరతో 142 కిలోమీటర్ల రేంజ్ ఇస్తోంది. 

Also Read:పెట్రోల్ వర్సెస్ ఎలక్ట్రిక్ బైక్స్: వాహనదారులకు ఏది బెస్ట్ ఆప్షన్?

రేంజ్‌కు తగ్గట్టుగా బైక్‌లు

ఎలక్ట్రిక్ విభాగంలో ఫ్లయింగ్‌ ఫ్లీ సీ 6 ఒక ప్రీమియం ఆప్షన్. 2.79 లక్ష ధర కలిగిన ఈ బైక్‌ 154 కిలోమీటర్ల రేంజ్‌ను, గంటలకు 115 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందిస్తుంది. వీటితోపాటు ఓబెన్‌ ఎలక్ట్రిక్ రార్‌ వో(180 కిలోమీటర్ల రేంజ్), యమహా EC-06(169KM రేంజ్), కైనెటిక్ డీఎక్స్ వంటి మోడళ్లు మార్కెట్‌లోకి గట్టి పోటీనిస్తున్నాయి. 

హై ఎండ్‌లోనూ తిరుగులేని బైక్‌లు

హై- ఎండ్ మోటార్‌ సైకిళ్ల విభాగంలో బీఎండబ్ల్యూ, హార్లేడేవిడ్‌న్, డ్యూకాటీ వంటి సంస్థలు పోటీలో ఉన్నాయి. విలాసవంతమైన బీఎండబ్ల్యూ ఎం 1000ఆర్‌ ధర 33. 50 లక్షలుగా ఉంది. ఇది గంటకు 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. సాహసయాత్రలు చేసే వారి కోసం బీఎండబ్ల్యూ ఎఫ్‌ 450 జీఎస్‌ 4.70 లక్షల నుంచి అందుబాటులో ఉంది. హార్లే డేవిడ్‌సన్ క్లాసిక్ లుక్‌ ఇష్టపడే వారి కోసంం స్ట్రీట్‌ బాబ్‌ 20.23లక్షలకు లభిస్తోంది. డ్యుకాటీ తన డెస్మో 450 ఎంఎక్స్‌ మోడల్‌ను 17.24 లక్షలకు విక్రయిస్తోంది. ట్రయంఫ్‌ నుంచి స్క్రాంబ్లర్‌ 400XC, థ్రక్స్‌టన్ 400 మార్కెట్‌లో మంచి ఆదరణ పొందుతున్నాయి. 

యూత్, మధ్యతరగతి మార్కెట్‌ లక్ష్యంగా కొత్త వ్యూహం 

యువతను ఆకట్టుకునేలా  కేటీఎం 160 డ్యూక్‌ 1.71 లక్షల ధరతో అందుబాటులోకి వచ్చింది. ఇది 164cc ఇంజిన్, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. పర్ఫార్మెన్స్‌ ప్రియుల కోసం కేటీఎం 390డ్యూక్‌, కేటీఎం 390 అడ్వేంచర్‌ (KTM 390 Duke)వంటి మోడళ్లు మార్కెట్‌లో సందడి చేస్తున్నాయి. మధ్యతరగతి వినియోగదారుల కోసం హోండా సీబీ 125 హార్నెట్‌ 1.03 లక్షలకు లభిస్తుండగా, హీరో మోటోకార్ప్‌ గ్లామర్‌ ఎక్స్‌ 86, 570 రూపాయల నుంచి 95, 790 మధ్య లభిస్తుంది. గ్రామర్ ఎక్స్ లీటర్‌కు 65కిలోమీటర్‌ మైలేజీని ఇస్తూ సామాన్యుడికి ఊరటనిస్తోంది. 

Also Read: కుటుంబ ప్రయాణాలకు అనువైన టాప్‌ ఎంపీవీలు ఇవే! ధర, ఫీచర్స్‌ ఇతర వివరాలు తెలుసుకోండి!

టీవీఎస్‌ నుంచి ఎన్‌టార్క్ 150 మోడల్‌ 1.09 లక్షల నుంచి 1.18 లక్షల మధ్య లభిస్తోంది. ఇది 150 సీసీ ఇంజిన్‌తో గరిష్టంగా గంటలకు 104 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. నేటి బైక్‌లు కేవలం ఇంజిన్ మీద మాత్రమే కాకుండా అత్యాధునిక సాఫ్ట్‌వేర్, భద్రతా ఫీచర్లపై కూడా ఆధారపడి పని చేస్తున్నాయి. చాలా మోడల్లు ఏబీఎస్‌తో వస్తున్నాయి. పైన చెప్పిన మోడల్స్‌లో 66 ఏబీఎస్ ఫీచర్ కలిగి ఉన్నాయి. 

Also Read:10 లక్షల బడ్జెట్‌తో లభించే అత్యుత్తమ కార్లు! ఫీచర్లు, మైలేజీ వివరాలు ఇవే!

డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, నేవిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ ఇప్పుడు సర్వసాధారమైపోయింది. హై ఎండ్‌ బైక్‌లలో ట్రాక్షన్ కంట్రోల్, క్రుయీజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ బైక్‌లలో ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ద్వారా తక్కువ సమయంలోనే బ్యాటరీని ఫుల్ చేయవచ్చు. 

ఏ బడ్జెట్ ప్రకారం ఏ బైక్‌లు కొనుగోలు చేయవచ్చు?  

వినియోగదారులు లక్షలోపు బడ్జెట్‌తో అయితే హీరో గ్లామర్ ఎక్స్, టీవీఎస్ ఆర్బిటర్, విడా VX2 బెస్ట్ ఆప్షన్. అదే లక్ష నుంచి 2 లక్షల బడ్జెట్‌లో అయితే కేటీఎం 160 డ్యూక్, హోండా సీబీ 125 హార్నెస్ట్‌, రాయల్ ఎన్‌ఫీల్డ్‌ 350 లభిస్తాయి. 

Also Read:Electric Bike లో క్లచ్‌ పనితీరు ఏంటీ? Honda కొత్త EVలో ఫేక్ క్లచ్ ఇవ్వడానికి కారణమిదే

రెండు నుంచి 5 లక్షల బడ్జెట్‌లో కేటీఎం 390 అడ్వేంచర్‌, బీఎండబ్ల్యూ ఎఫ్‌ 450 జీఎస్‌, ట్రయంఫ్‌ స్క్రాంబ్లర్‌ 400 ఎక్స్‌సీ లభిస్తాయి. ఐదు లక్షల రూపాయలకుపై చెల్లించే స్థోమత ఉంటే బీఎండబ్ల్యూ ఎస్‌ 1000 R, హార్లే డేవిడ్‌సన్ స్ట్రీట్ బాబ్, డ్యూకాటీ డెస్మో 450MX వస్తాయి. 

భారత్‌ టూవీలర్ మార్కెట్ 2026లో పెట్రోల్ ఇంజిన్లు సమర్థను పెంచుతూనే  ఎలక్ట్రిక్ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. రాబోయే రోజుల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్ 750, యమహా యారెక్స్‌-ఈ వంటి మోడళ్లు మార్కెట్‌లోకి రానున్నాయి. 

Also Read:పోర్షే నుంచి లంబోర్ఘిని వరకు... ఎన్టీఆర్ గ్యారేజీలో కార్ కలెక్షన్, ఆయన టోటల్ నెట్ వర్త్ తెలుసా?