2025 Independence Day Car Deals: 2025 పండుగ సీజన్ కు ముందు, భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, దాదాపు అన్ని ప్రధాన కారు కంపెనీలు మంచి డిస్కౌంట్లు, ఇతర ప్రయోజనాలు అందిస్తున్నాయి. మీరు ఎలక్ట్రిక్ కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఆగస్టు నెల మీకు గొప్ప అవకాశాన్ని తీసుకొచ్చింది. స్టెల్లాంటిస్ గ్రూప్, తన జీప్ & సిట్రోయెన్ కార్లపై ఆగస్టు 2025లో ప్రత్యేక ఇండిపెండెన్స్ స్పెషల్ ఆఫర్లను (Independence Day 2025 Car Offers) ప్రవేశపెట్టింది.        

జీప్ కంపాస్2024 జీప్ కంపాస్ మోడల్‌ కొన్నవాళ్లు రూ. 2.95 లక్షల వరకు ప్రయోజనాలు పొందుతారు. ఇందులో రూ. 1.77 లక్షల కన్స్యూమర్ ఆఫర్ & కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. 2024 జీప్ మెరిడియన్ మోడల్‌ మీద రూ. 2.3 లక్షల వరకు తగ్గింపు ఇస్తుండగా, 2025 యూనిట్లపై రూ. 80,000 వరకు ఆఫర్‌ అందిస్తున్నారు. సిట్రోయెన్ వాహనాలపై కూడా ఆకర్షణీయమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. సిట్రోయెన్ బసాల్ట్‌పై రూ. 2.8 లక్షల వరకు, సిట్రోయెన్ C3పై రూ. 1 లక్ష & సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్‌పై రూ. 1.15 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తాయి.         

నిస్సాన్ మాగ్నైట్ ఓనం సందర్భంగా, నిస్సాన్ మాగ్నైట్ టర్బో ఎడిషన్‌పై మొత్తం రూ. 1.03 లక్షల విలువైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో రూ. 15,000 కన్స్యూమర్ ఆఫర్, రూ. 55,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 5,000 స్పెషల్ ఆఫర్ & కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. అయితే, ఈ ఆఫర్లు ఎంపిక చేసిన వేరియంట్‌లకు మాత్రమే వర్తిస్తాయి. కాబట్టి, మీ దగ్గరలోని డీలర్‌షిప్‌నకు వెళ్లి వివరాలు తెలుసుకోవడం ముఖ్యం.       

వోక్స్‌వ్యాగన్‌ & స్కోడా స్కోడా కుషాక్ & స్లావియాపై రూ. 2.3 లక్షల వరకు ప్యాకేజీ ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో రూ. 1 లక్ష లాయల్టీ బోనస్, రూ. 40,000 విలువైన ఉపకరణాలు & రూ. 90,000 నగదు తగ్గింపు ఉన్నాయి. వోక్స్‌వ్యాగన్ వెహికల్స్‌పైనా ఇదే తరహా బెనిఫిట్స్‌ను కంపెనీ ఆఫర్‌ చేస్తోంది. టైగన్ & వర్టస్‌ మోడళ్లపై ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ స్కీమ్ & లాయల్టీ ఆఫర్‌ల కింద రూ. 80,000 వరకు ఆదా చేసుకోవచ్చు.       

టాటా మోటార్స్ - SUV & EV రెండింటిలోనూ ఆఫర్లుటాటా మోటార్స్ తన SUVలు & EV వాహనాలపై కూడా గొప్ప డిస్కౌంట్లను అందిస్తోంది. టాటా హారియర్ అడ్వెంచర్+ & సఫారీ అడ్వెంచర్+ కొనేవాళ్లు రూ. 1 లక్ష తగ్గింపు తీసుకోవచ్చు. ఆల్ట్రోజ్ రేసర్ ఎడిషన్ (2024 మోడల్)పై రూ. 85,000 కన్స్యూమర్ ఆఫర్ & ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి, డీలర్‌తో సరిగ్గా బేరం ఆడితే రూ. 1.75 లక్షల వరకు బెనిఫిట్స్‌ పొందవచ్చు. అదే సమయంలో, టాటా కర్వ్ EV & నెక్సాన్ EVపై రూ. 1 లక్ష వరకు బెనిఫిట్‌ ఆఫర్లను టాటా మోటార్స్‌ ప్రకటించింది.