Hyundai Neira MPV Details: Hyundai తన కొత్త ఎలక్ట్రిక్ MPV Neira ఇంటీరియర్‌ను ఇండోనేషియాలో వెల్లడించింది. ఈ కారు ఎక్స్‌టీరియర్‌ను పరిచయం చేసిన కొన్ని రోజులకే క్యాబిన్ వివరాలను కూడా బయటపెట్టింది. ప్రస్తుతం 2026 Gaikindo Auto Week (GAW)లో ఈ మోడల్‌ను ప్రదర్శిస్తోంది. ఇండోనేషియాలోనే తయారవుతున్న ఈ MPV కోసం ప్రీ-బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. అయితే దీని పవర్‌ట్రెయిన్ వివరాలను మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

Continues below advertisement

Kia Carens Clavis EV ఆధారంగా రూపొందించిన Hyundai Neiraలో అదే ఇంటీరియర్ డిజైన్‌ను కొనసాగించారు. ఇందులో 7 సీట్ల లేఅవుట్, ఆధునిక ఫీచర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ కారు గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే.

 1. Kia Carens Clavis EV తరహా ఇంటీరియర్

Continues below advertisement

Hyundai Neira క్యాబిన్‌లో బ్లాక్, ఆఫ్-వైట్ కలర్ థీమ్‌ను ఉపయోగించారు. దీని డ్యాష్‌బోర్డ్, సెంటర్ కన్సోల్ డిజైన్ దాదాపుగా Kia Carens Clavis EV మాదిరిగానే ఉంటుంది. స్టీరింగ్ వీల్‌పై ఉన్న Morse Code లోగో మాత్రమే ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ కోడ్‌లోని అక్షరం 'H'ను సూచిస్తుంది.

మరో ముఖ్యమైన తేడా సీటింగ్ విషయంలో ఉంది. Neira కేవలం 7 సీట్ల లేఅవుట్‌లోనే వస్తుంది. Kia Carens Clavis EVలో మాత్రం 6 సీట్ల ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్‌లో వస్తువులు పెట్టుకునేందుకు స్టోరేజ్ స్పేస్‌లను ఏర్పాటు చేశారు. ముందు సీట్ల వెంటిలేషన్, సరౌండ్ వ్యూ కెమెరా, పార్కింగ్ సెన్సర్ల కోసం బటన్లు కూడా ఇందులోనే ఉన్నాయి. గేర్ సెలెక్టర్‌ను స్టీరింగ్ కాలమ్‌పై అమర్చారు.

 2. డ్యూయల్ డిజిటల్ స్క్రీన్లు, ప్రీమియం ఫీచర్లు

Hyundai Neiraలో 12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మరో 12.3 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ ఉన్నాయి. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వైర్‌లెస్ Android Auto, Apple CarPlay కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది.

ముందు సీట్లకు వెంటిలేషన్, పానోరమిక్‌ సన్‌రూఫ్, 8-స్పీకర్ Bose సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్, ఆటో డిమ్మింగ్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్ (IRVM) కూడా అందించారు. వీటితో పాటు Vehicle-to-Load (V2L) ఛార్జింగ్ సపోర్ట్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ కూడా ఉన్నాయి.

ఇది కూడా చదవండి: మీ కారు ఇంజిన్ ఎక్కడుంది? ముందు, వెనుక లేదా మధ్యలో.. ప్లేస్‌మెంట్‌ను బట్టి మారనున్న డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌!

 3. ఎక్స్‌టీరియర్‌లో Kia మోడల్‌తో పోలిస్తే మార్పులివే

Hyundai Neira డిజైన్ కూడా Kia Carens Clavis EVకి చాలా దగ్గరగా ఉంటుంది. ఇందులో మూడు పాడ్‌లతో కూడిన హెడ్‌ల్యాంప్స్, కనెక్టెడ్ LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ (DRLs) ఉన్నాయి.

అయితే ముందు భాగంలో కొన్ని మార్పులు చేశారు. బ్లాక్ ఫినిష్‌తో కూడిన క్లోజ్డ్ గ్రిల్‌కు ప్రత్యేక ప్యాటర్న్ ఎలిమెంట్స్ ఇచ్చారు. ఫ్రంట్ బంపర్‌ను మరింత దృఢంగా కనిపించేలా రూపొందించారు. ఇందులో ఫాగ్ ల్యాంప్స్ ఉండవు.

సైడ్ ప్రొఫైల్‌లో కొత్త అల్లాయ్ వీల్స్ కనిపిస్తాయి. వీల్ ఆర్చ్‌లు, డోర్ల దిగువ భాగంలో ఉండే సన్నని క్లాడింగ్, సిల్వర్ రూఫ్ రైల్స్ మాత్రం Kia మోడల్ తరహాలోనే ఉన్నాయి. ఈ MPV గ్రౌండ్ క్లియరెన్స్ 200mm.

వెనుక భాగంలో కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంప్స్‌ను Carens Clavis EV నుంచి తీసుకున్నారు. అయితే రియర్ బంపర్ కొత్తగా రూపొందించారు. ఇందులో మందంగా, మరింత స్పోర్టీగా కనిపించే సిల్వర్ ట్రిమ్‌ను ఇచ్చారు.

 4. Kia Carens Clavis EV బ్యాటరీ ఆప్షన్లు ఉండే అవకాశం

Hyundai Neira పవర్‌ట్రెయిన్ వివరాలను ఇంకా ప్రకటించలేదు. Kia Carens Clavis EV ఆధారంగా రూపొందించిన మోడల్ కావడంతో.. అదే బ్యాటరీ, మోటార్ ఆప్షన్లనే Neiraలో కూడా ఉపయోగించే అవకాశం ఉంది.

ప్రస్తుతం Kia Carens Clavis EVలో 42kWh, 51.4kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి. పెద్ద బ్యాటరీతో MIDC సర్టిఫైడ్ రేంజ్ గరిష్ఠంగా 490km వరకు ఉంటుంది. ఈ బ్యాటరీలను ముందు యాక్సిల్‌పై అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్‌తో జతచేశారు. బ్యాటరీ ఆప్షన్‌ను బట్టి ఈ మోటార్ 255Nm టార్క్‌తో పాటు 135hp లేదా 171hp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెండు వెర్షన్లలోనూ 100kW వరకు DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. దీనితో బ్యాటరీని 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 39 నిమిషాలు పడుతుంది. ఇవే స్పెసిఫికేషన్లు Neiraలో ఉంటాయా అన్నది అధికారికంగా నిర్ధారించలేదు.

ఇది కూడా చదవండి: కారు టైర్లలో గాలి ఎంత ఉండాలి? ఈ చిన్న తప్పు వల్ల మైలేజీ తగ్గడమే కాదు, ప్రమాదం పెరుగుతుంది!

 5. భారత్‌లోకి Neira వస్తుందా?

2025 Investor Day సందర్భంగా, 2030 నాటికి భారత్‌లో కొత్త MPVని తీసుకువస్తామని Hyundai వెల్లడించింది. ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్లలో ఈ కంపెనీకి రెండు MPVలు ఉన్నాయి, అవి.. మాస్ మార్కెట్ కోసం రూపొందించిన Stargazer, ప్రీమియం మోడల్ Staria.

ఇప్పుడు Neira కూడా అంతర్జాతీయ మార్కెట్లో మరో మాస్ మార్కెట్ MPVగా చేరనుంది. భారత్‌కు ఏ MPVని తీసుకురావాలనే విషయంలో Hyundai ఇంకా స్పష్టత లేదు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.