Hyundai Exter SX O vs Venue HX4 Comparison: రూ.8 లక్షల నుంచి రూ.9 లక్షల బడ్జెట్‌లో SUV కొనాలనుకుంటే చాలా మంది ముందుగా హ్యుందాయ్‌ షోరూమ్‌ వైపు చూస్తారు. ఎందుకంటే అదే రేంజ్‌లో ఎక్స్‌టర్‌, వెన్యూ లాంటి రెండు మంచి ఆప్షన్లు ఉన్నాయి. మరి టాప్‌ స్పెక్‌ ఎక్స్‌టర్‌ SX(O) తీసుకోవాలా? లేక కొంచెం పెద్దదైన వెన్యూ HX4 తీసుకోవాలా?.

Continues below advertisement

డైమెన్షన్స్‌ - సైజులో వెన్యూ ముందుంది

 
 
హ్యుందాయ్ ఎక్స్‌టర్
హ్యుందాయ్ వెన్యూ
పొడవు
 
3,815mm
3,995mm
వెడల్పు
 
1,710mm
1,800mm
ఎత్తు
 
1,631mm
*1,650mm
వీల్ బేస్
 
2,450mm
2,520mm

సైజ్‌ విషయానికి వస్తే వెన్యూనే పెద్దది. ఎక్స్‌టర్‌తో పోలిస్తే 180 మిమీ పొడవు ఎక్కువ, 90 మిమీ వెడల్పు ఎక్కువ. వీల్‌బేస్‌ కూడా 70 మిమీ ఎక్కువ. అందుకే వెనుక సీట్లో ముగ్గురు కూర్చోవడం వెన్యూలో కొంచెం కంఫర్ట్‌గా ఉంటుంది.

Continues below advertisement

రెండింటికీ 15 ఇంచ్‌ వీల్స్‌ ఉన్నా, ఎక్స్‌టర్‌ టాప్‌ వేరియంట్‌లో డైమండ్‌ కట్‌ అల్లాయ్స్‌ ఇస్తారు. వెన్యూ HX4 మాత్రం స్టీల్‌ వీల్స్‌తో వస్తుంది. రూఫ్‌ రైల్స్‌ కూడా ఎక్స్‌టర్‌లో స్టాండర్డ్‌గా ఉంటాయి.

ఇంజిన్‌ & గేర్‌బాక్స్‌ - ఎక్స్‌టర్‌కు అదనపు ఆప్షన్‌

 
హ్యుందాయ్ ఎక్స్‌టర్ SX (O)
హ్యుందాయ్ వెన్యూ HX4
ఇంజిన్
 
1.2-litre four-cylinder petrol
1.2-litre four-cylinder petrol
పవర్
 
83hp
83hp
టార్క్
 
114Nm
115Nm
ట్రాన్స్మిషన్
 
5MT, 5AMT
5MT

రెండింటిలోనూ 1.2 లీటర్‌ నాలుగు సిలిండర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 83hp పవర్‌, సుమారు 115Nm టార్క్‌ ఇస్తుంది (ఎక్స్‌టర్‌లో 114Nm). స్మూత్‌గా పని చేసే ఇంజిన్‌ ఇది.

కానీ ముఖ్యమైన తేడా గేర్‌బాక్స్‌లో ఉంది. వెన్యూ HX4 కేవలం 5-స్పీడ్‌ మాన్యువల్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఎక్స్‌టర్‌ SX(O) మాత్రం 5-స్పీడ్‌ మాన్యువల్‌తో పాటు AMT ఆప్షన్‌ కూడా ఇస్తుంది. సిటీలో ట్రాఫిక్‌లో డ్రైవ్‌ చేసేవారికి ఇది పెద్ద ప్లస్‌.

ఎక్స్‌టీరియర్‌ ఫీచర్లు

ఎక్స్‌టర్‌ టాప్‌ వేరియంట్‌లో ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాంప్స్‌, ఆటో ఆన్‌/ఆఫ్‌ ఫంక్షన్‌, డైమండ్‌ కట్‌ అల్లాయ్స్‌, పెయింటెడ్‌ రూఫ్‌ రైల్స్‌ ఉంటాయి. అయితే పూర్తి LED హెడ్‌ల్యాంప్స్‌ మాత్రం లేవు.

వెన్యూ HX4లో LED టెయిల్‌ల్యాంప్స్‌, ఆటో ఫోల్డింగ్‌ ORVMలు ఉంటాయి. కానీ రూఫ్‌ రైల్స్‌ లేవు.

ఇంటీరియర్‌ - ఎక్స్‌టర్‌లో ఎక్కువ లగ్జరీ ఫీచర్లు

ఫీచర్ల పరంగా చూస్తే ఎక్స్‌టర్‌ SX(O) కొంచెం ముందుంటుంది. పవర్డ్‌ సన్‌రూఫ్‌, ఆటోమేటిక్‌ AC, కూల్డ్‌ గ్లోవ్‌బాక్స్‌, పార్ట్‌ లెదర్‌ సీట్లు, LED అంబియెంట్‌ లైటింగ్‌, OTA అప్డేట్స్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

వెన్యూ HX4లో పెద్ద టచ్‌స్క్రీన్‌, నాలుగు USB Type-C పోర్ట్స్‌ ఉన్నాయి. కానీ సన్‌రూఫ్‌ లేదు, మాన్యువల్‌ AC మాత్రమే ఉంటుంది.

డ్రైవింగ్‌ ఫీచర్లు

క్రూయిజ్‌ కంట్రోల్‌, పుష్‌ బటన్‌ స్టార్ట్‌ వంటి ఫీచర్లు ఎక్స్‌టర్‌ SX(O)లో మాత్రమే ఉన్నాయి. AMT వేరియంట్‌లో ప్యాడిల్‌ షిఫ్టర్లు కూడా ఇస్తారు. వెన్యూ HX4లో ఈ డ్రైవింగ్‌ ఫీచర్లు లేవు.

సేఫ్టీ

సేఫ్టీ విషయానికి వస్తే రెండు కార్లూ దగ్గర దగ్గరగా ఉన్నాయి. వెన్యూ HX4లో రియర్‌ డిఫాగర్‌ టైమర్‌తో ఉంటుంది. కానీ ఆటో హెడ్‌ల్యాంప్స్‌, ఫ్రంట్‌ పార్కింగ్‌ సెన్సర్లు లేవు. మొత్తానికి సేఫ్టీలో పెద్ద తేడా లేదు.

ధర - ఎక్స్‌-షోరూమ్‌

 
హ్యుందాయ్ ఎక్స్‌టర్ SX (O)
హ్యుందాయ్ వెన్యూ HX4

వ్యత్యాసం

పెట్రోల్ MT
 
రూ. 8.32 లక్షలు
రూ. 8.90 లక్షలు
రూ. 58,000
పెట్రోల్ AMT
 
రూ. 9.07 లక్షలు
-
-

ఎక్స్‌టర్‌ SX(O) మాన్యువల్‌ వెన్యూ కంటే సుమారు రూ.58,000 తక్కువగా ఉంటుంది (ఎక్స్‌-షోరూమ్‌ ధర). వెన్యూ HX4కు ఆటోమేటిక్‌ ఆప్షన్‌ లేదు. అందుకే AMT కావాలనుకుంటే ఎక్స్‌టర్‌ ఒక్కటే ఎంపిక.

మీకు పెద్ద సైజ్‌, కొంచెం ప్రీమియం డిజైన్‌ కావాలంటే వెన్యూ HX4 సరిపోతుంది. కానీ ఫీచర్లు ఎక్కువగా కావాలి, AMT ఆప్షన్‌ కావాలి, సన్‌రూఫ్‌ వంటి లగ్జరీ టచ్‌ కావాలి అంటే ఎక్స్‌టర్‌ SX(O) మంచి విలువ ఇస్తుంది.

సిటీలో ఎక్కువగా డ్రైవ్‌ చేసే తెలుగు రాష్ట్రాల కస్టమర్లకు, ముఖ్యంగా హైదరాబాద్‌, విజయవాడ ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుంటే, ఎక్స్‌టర్‌ AMT వేరియంట్‌ మరింత ప్రాక్టికల్‌ ఆప్షన్‌ అవుతుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.