Best Selling Midsize SUV 2026: భారత్‌లో, మిడ్‌సైజ్ SUV మార్కెట్‌లో పోటీ మామూలుగా లేదు. కొత్త మోడళ్లు వరుసగా మార్కెట్లోకి వస్తూనే ఉన్నాయి. అయినా.. ఒక కారు ఆధిపత్యం మాత్రం ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉంది, ఆ కారే Hyundai Creta. ఎప్పటికప్పుడు కొత్తగా వస్తున్న మోడళ్లు Creta అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని చాలామంది భావించారు, కానీ అలా జరగలేదు.
Maruti Suzuki Victoris, Tata Sierra, Kia Seltos, Renault Duster వంటి కొత్త మోడళ్లు Cretaకు గట్టి పోటీ ఇస్తాయని అంచనాలు వచ్చాయి. వీటితో పాటు Skoda Kushaq & Volkswagen Taigun ఫేస్‌లిఫ్ట్ మోడళ్లు కూడా మార్కెట్లోకి వచ్చాయి. అయితే, 2026 తొలి ఆరు నెలల అమ్మకాల గణాంకాలు చూస్తే పరిస్థితి భిన్నంగా ఉంది. కొత్త ప్రత్యర్థులు వచ్చినా Creta తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.
నంబర్ వన్ స్థానంలో Creta2026 తొలి ఆరు నెలల్లో (జనవరి-జూన్) Creta నెలకు సగటున 15,000కు పైగా యూనిట్ల సేల్స్‌తో, మొత్తం 91,391 యూనిట్లను అమ్మింది. అయితే 2025 తొలి ఆరు నెలలతో పోలిస్తే అమ్మకాలు 9.12 శాతం తగ్గాయి. 2025 H1లో 1,00,560 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది అమ్మకాలు తగ్గినప్పటికీ ప్రత్యర్థి మోడళ్ల కంటే Creta చాలా ముందుంది. కొత్త SUVలు Cretaను అగ్రస్థానం నుంచి దించలేకపోయాయి.
రెండో స్థానంలో Victoris2026 H1లో Creta తర్వాత అత్యధికంగా అమ్ముడైన మిడ్‌సైజ్ SUVగా Maruti Suzuki Victoris నిలిచింది, 2026 తొలి ఆరు నెలల్లో మొత్తం 73,912 యూనిట్లను అమ్మింది. అయితే, Cretaతో పోలిస్తే Victoris 17,479 యూనిట్లు వెనుకబడింది. Victoris 2025 సెప్టెంబర్‌లో మార్కెట్లోకి వచ్చింది. CNG & స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్లు దీని ప్రత్యేకత. ఇంధన ఖర్చును తగ్గించుకోవాలనుకునేవాళ్లకు ఇది ఆకర్షణీయమైన ఆప్షన్. Maruti బ్రాండ్‌పై ఉన్న నమ్మకం కూడా Victorisకు కలిసొచ్చింది, రెండో స్థానం సాధించింది.
ఇది కూడా చదవండి: 5,600 కి.మీ. నడిచిన Hero Xpulse 210.. డైలీ జర్నీలో ఈ బండిలో బయటపడిన మైనస్‌లు ఏంటి?
Seltos అమ్మకాల్లో భారీ వృద్ధిKia Seltos, 62,805 యూనిట్ల సేల్స్‌తో మూడో స్థానంలో నిలిచింది. Cretaకు నేరుగా పోటీ ఇచ్చే మోడళ్లలో Seltos ఒకటి. ఇందులో దాదాపు Creta తరహా ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. ఆధునిక ప్లాట్‌ఫామ్, ఆకర్షణీయమైన ధర & మెరుగైన భద్రత కూడా ఉన్నాయి. రెండో తరం Seltos భారత్ NCAPలో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. దీంతో ఈ SUVపై ఆసక్తి పెరిగింది. 2026 H1లో Seltos అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన ఏకంగా 70.28 శాతం పెరిగాయి.
Sierra, Duster కూడా పోటీలోనే..Creta పోటీగా ఇప్పటివరకు వచ్చిన అత్యంత బలమైన ప్రత్యర్థుల్లో Tata Sierra ఒకటి. అయితే, 2026 తొలి ఆరు నెలల్లో Sierra అమ్మకాలు Creta అమ్మకాలలో సగం కంటే తక్కువగా (43,420) ఉన్నాయి. Sierraకు ప్రారంభంలో ఉత్పత్తి పరిమితులు ఎదురయ్యాయి. డిమాండ్‌కు అనుగుణంగా Tata ప్రతి నెలా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతోంది. ఫీచర్ల విషయంలో Sierra ముందున్నప్పటికీ, Cretaతో పోలిస్తే దాని ధర ఎక్కువగా ఉంది. ఫిట్ & ఫినిష్, అమ్మకాల తర్వాత సేవలపై ఉన్న అభిప్రాయాలు కూడా ప్రభావం చూపుతున్నాయి.
Renault కొత్త Dusterను మార్చిలో తీసుకొచ్చింది. ఏప్రిల్ నుంచి డెలివరీలు ప్రారంభమయ్యాయి. అయితే తొలి ఆరు నెలల అమ్మకాలలో (6,039) Duster పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఉత్పత్తిని దశలవారీగా పెంచుతున్న కారణంగా అమ్మకాలు తక్కువగా ఉండొచ్చని అంచనా. దూకుడైన డిజైన్, పోటీ ధర & మంచి ఫీచర్లు Dusterకు బలాలు. అయితే ఇందులో టర్బో పెట్రోల్ ఇంజిన్ మాత్రమే ఉండటం కొంతమంది కొనుగోలుదారులను దూరం చేస్తోంది. దీపావళి నాటికి స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆప్షన్ వచ్చే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: గత ఆరు నెలల్లో జనం ఎగబడి కొన్న కార్లు ఇవే - బాలెనో, డిజైర్, విండ్సర్‌కు జేజేలు
Skoda Kushaq (6,460) & Volkswagen Taigun ఫేస్‌లిఫ్ట్ (4,006) కూడా మార్చి & ఏప్రిల్‌లో మార్కెట్లోకి వచ్చాయి. కొత్త ఫీచర్లు, మార్పులు వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అయితే వీటిలో టర్బో పెట్రోల్ ఇంజిన్లు మాత్రమే ఉన్నాయి. పరిమాణం పరంగా కూడా ఇవి సెగ్మెంట్‌లో కొంత చిన్నవే. అందుకే డ్రైవింగ్‌ను ఆస్వాదించాలనుకునే వారికి ఇవి ఎక్కువగా సరిపోతాయి.
Cretaను ఎందుకు ఆపలేకపోతున్నారు?Creta విజయానికి ప్రధాన కారణం దాని బ్రాండ్ ఇమేజ్. భారతీయలు కారు కొనే విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు. రోడ్లపై ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో Cretaలు కనిపించడం కూడా ఆ మోడల్‌పై నమ్మకాన్ని పెంచుతోంది. అమ్మకాలు ఎక్కువగా ఉండటం వల్ల రీసేల్ విలువ కూడా మెరుగ్గా ఉంటుంది. ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం.
విశ్వసనీయత మరో ప్రధాన కారణం. Cretaలో మంచి ఫీచర్లు, సౌకర్యవంతమైన ఇంటీరియర్, మెరుగైన నిర్మాణ నాణ్యత & రిఫైన్డ్ డ్రైవింగ్ అనుభవం ఉన్నాయి. వివిధ ఇంజిన్ ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి.
మిడ్‌సైజ్ SUV విభాగంలో డీజిల్ ఇంజిన్ అందించే కొద్ది మోడళ్లలో Creta ఒకటి. నగర ప్రయాణాల కోసం NA పెట్రోల్ ఇంజిన్ ఉంది. స్పోర్టీ డ్రైవింగ్ కోరుకునేవారి కోసం Creta N Line కూడా ఉంది.
అంటే కుటుంబ అవసరాలు, రోజువారీ ప్రయాణాలు, ఇంధన సామర్థ్యం, సౌకర్యం లేదా స్పోర్టీ డ్రైవింగ్.. ఏ అవసరం ఉన్నా Cretaలో ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇదే దాని అసలు బలం. అందుకే కొత్త SUVలు ఎన్ని వచ్చినా మిడ్‌సైజ్ SUV మార్కెట్లో Creta ఆధిపత్యం ఇప్పటికీ కొనసాగుతోంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
