మార్కెట్లోకి ఎన్ని కొత్త SUVలు విడుదలవుతున్నా, భారత్‌లో ఎంత పోటీ పెరిగినా కొన్ని వాటి స్థానాన్ని నిలబెట్టుకుంటున్నాయి. వాటిలో జనవరి 2026లో విడుదలైన హ్యుందాయ్ క్రెటా మిడ్-సైజ్ SUV విభాగంలో తన స్థానాన్ని పటిష్టం చేసుకుని విక్రయాల్లో దూసుకెళ్తోంది. ఈ నెలలో క్రెటా అత్యధికంగా అమ్ముడైన SUVగా నిలిచింది. మొత్తం 17,921 యూనిట్లు విక్రయాలు జరిగాయి. ఈ అద్భుతమైన పనితీరుతో, క్రెటా, టాటా సియెర్రా, మారుతి విక్టోరిస్, న్యూ జనరేషన్ కియా సెల్టోస్ వంటి ట్రెండింగ్ కార్లను కూడా హ్యూందాయ్ క్రెటా వెనక్కి నెట్టింది. భారత కస్టమర్‌లలో క్రెటా తన క్రేజ్ కాపాడుకుని విక్రయాల్లో దూసుకెళ్తోంది. 

Continues below advertisement

టాటా సియెరా, విక్టోరిస్‌ను అదిగమించిన క్రెటా 

జనవరి 2026లో హ్యుందాయ్ క్రెటా అమ్మకాలు టాటా సియెరా కంటే ఎక్కువగా నమోదయ్యాయి. టాటా సియెర్రా మొత్తం 7,003 యూనిట్లు అమ్ముడుకాగా, హ్యూందాయ్ క్రెటా 10,918 యూనిట్లను ఎక్కువగా విక్రయించి రికార్డ్ క్రియేట్ చేసింది.  మారుతి విక్టోరిస్ 15,240 యూనిట్లు అమ్ముడుపోగా, కియా సెల్టోస్ 10,639 యూనిట్లు విక్రయించింది. ఇవి రెండూ కూడా హ్యూందాయ్ క్రెటాను అధిగమించలేకపోయాయి. క్రెటా స్ట్రాంగ్ బ్రాండ్ ఇమేజ్, పలు వేరియంట్ ఆప్షన్లు, దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద డీలర్ నెట్‌వర్క్ ద్వారా నేరుగా ప్రయోజనం పొందుతోంది.

కొత్త కార్లు వస్తున్నా SUV విభాగంలో జోరు

విక్టోరిస్, సియెరా రెండూ ప్రస్తుతం భారత మార్కెట్‌లో కొత్తవి. అయితే విక్టోరిస్‌ను సెప్టెంబర్ 2025లో, టాటా సియెర్రాను  నవంబర్ 2025లో లాంచ్ చేశారు. అయినప్పటికీ, హ్యుందాయ్ క్రెటా అమ్మకాల్లో సత్తా చాటింది. మారుతి విక్టోరిస్ జనవరి 2026 నాటికి మొత్తం 50,000 యూనిట్లకు పైగా అమ్మకాలతో దూసుకెళ్తోంది. టాటా సియెర్రా అమ్మకాలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. అయితే జనవరి 2026లో మిడ్-సైజ్ SUV విభాగం అమ్మకాలు 70,898 యూనిట్లకు చేరాయి. ఇది సంవత్సరానికి దాదాపు 40 శాతం వృద్ధిని నమోదు చేసింది. 

Continues below advertisement

హ్యుందాయ్ క్రెటా భారత మార్కెట్లో కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, హోండా ఎలివేట్‌లకు గట్టి పోటీనిస్తోంది. మరోవైపు, ఇది టాటా సియెరా, రెనాల్ట్ డస్టర్, మహీంద్రా థార్ రాక్స్ వంటి పవర్ ‌ఫుల్  SUVలకు సైతం విక్రయాలలో పోటీనిస్తుంది.

హ్యూందాయ్ క్రెటా  

హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) భారత్‌లో కస్టమర్లను ఆకర్షిస్తున్న మిడ్-సైజ్ SUVలలో ఒకటి. దీని స్టైలిష్ లుక్, అత్యాధునిక ఫీచర్లు, పెర్ఫార్మెన్స్ కారణంగా ఇది మార్కెట్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. హ్యుందాయ్ క్రెటాకు ఇంజిన్, ధర, ఫీచర్లు ఇలా ఉన్నాయి. ఇంజిన్, పెర్ఫార్మెన్స్హ్యూందాయ్ క్రెటా 3 రకాల ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. 1.5 లీటర్ పెట్రోల్: ఇది సిటీ డ్రైవింగ్‌కు చాలా కంఫర్టబుల్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్: ఎక్కువ పవర్, స్పీడ్ కోరుకునే వారికి ఇది సరిపోతుంది1.5 లీటర్ డీజిల్: మైలేజ్, లాంగ్ డ్రైవ్స్ చేసేవారికి ఇది బెస్ట్.ట్రాన్స్‌మిషన్: ఇందులో మాన్యువల్, iMT, IVT, DCT వంటి విభిన్న గేర్ బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.

ఇంటీరియర్, ఫీచర్లుక్రెటా లోపల ప్రీమియం లుక్, టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చారు. పెద్ద సన్‌రూఫ్ కారుకు మంచి లగ్జరీ ఫీలింగ్‌ను ఇస్తుంది. 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, అదే పరిమాణంలో డిజిటల్ క్లస్టర్ ఉన్నాయి. వేసవి కాలంలో చల్లదనాన్ని ఇచ్చేలా సీట్లు డిజైన్ చేశారు. బ్లూలింక్ ద్వారా కారును మొబైల్ నుంచే కంట్రోల్ చేయవచ్చు.

సేఫ్టీ ఫీచర్లుకొత్త మోడళ్లలో సేఫ్టీకి హ్యుందాయ్ అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ADAS (Level 2) ఆటోమేటిక్ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్ వంటి 19 రకాల అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్స్ వస్తాయి. 4 వీల్స్‌కు డిస్క్ బ్రేక్స్ ఉండటం వల్ల మంచి కంట్రోల్ లభిస్తుంది. 360 డిగ్రీల కెమెరా కారు చుట్టూ ఉన్న దృశ్యాలను చూడటం ద్వారా పార్కింగ్ తేలికచేస్తుంది.  అవుతుంది.

ధరహ్యుందాయ్ క్రెటా ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 11 లక్షలకు ప్రారంభమై వేరియంట్‌ను బట్టి గరిష్టంగా రూ. 20.15 లక్షల వరకు ఉంటుంది.