Hyundai Creta Electric launched in India: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతుంది. ఈ డిమాండ్ కు తగ్గట్లు ఆటో మొబైల్ కంపెనీలు కొత్త కొత్త మోడల్ ఈవీలను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నాయి. ఈ క్రమంలోనే హ్యుందాయ్ కంపెనీ జనవరి 17న జరిగిన ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో తన హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌ను ప్రారంభించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్ యూవీ భారతదేశంలోని సాధారణ వినియోగదారులకు బెస్ట్ ఆప్షన్ గా మారింది. ఈ ఎలక్ట్రిక్ కారు కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి వస్తుందా.. దాని ఫీచర్లను, డ్రైవింగ్ ను ఎంజాయ్ చేయాలని చూస్తున్నారు. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ ప్రారంభ ధర రూ. 17.99 లక్షలు. ఇది రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభిస్తుంది.హైఎండ్‌ ఫీచర్లు కలిగిన కారు ధర రూ.23.29 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. 

క్రెటా లాగే కొత్త కారుహ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌లో రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలు ఇవ్వబడ్డాయి. మొదటిది 42కిలో వాట్ స్ బ్యాటరీ ప్యాక్, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 390 కిలోమీటర్ల మేరకు ప్రయాణించవచ్చు. రెండవది 51.4 కిలో వాట్స్  బ్యాటరీ ప్యాక్, ఇది 473 కిలోమీటర్ల వరకు పరిధిని ఇస్తుంది. దీని వేరియంట్లలో ఎగ్జిక్యూటివ్, స్మార్ట్, ప్రీమియం, ఎక్సలెన్స్ ఉన్నాయి. దేశంలో పాపులర్‌ కార్లలో హ్యుందాయ్‌ విక్రయిస్తున్న క్రెటా ఒకటి. ఇదే పేరుతో ఈవీ వెర్షన్‌ను హ్యుందాయ్‌ తీసుకువచ్చింది. డిజైన్‌ పరంగానూ క్రెటాను పోలి ఉంటుంది. ఈ మోడల్‌లో కస్టమర్‌లు ఎనిమిది రంగుల ఆప్షన్లను పొందుతారు. ఇందులో రెండు డ్యూయల్-టోన్ కలర్స్ కూడా ఉన్నాయి.

హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ ఫీచర్లు   ఈ ఎలక్ట్రిక్ SUV ప్యాసింజర్ వాక్-ఇన్ పరికరం వంటి కొన్నిస్పెషల్ ఫీచర్లను కలిగి ఉంది. దీని ద్వారా వెనుక సీటులో ఉన్న వ్యక్తులు ముందు సీట్లకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవచ్చు. దీనితో పాటు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేషన్‌తో కూడిన డ్యూయల్ పవర్డ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, ADAS లెవల్ 2, 360 డిగ్రీల కెమెరా, డిజిటల్ కీ, 360డిగ్రీ కెమెరా  ఉంటుంది.ఎకో, నార్మల్‌, స్పోర్ట్స్‌ మోడ్‌లు ఉంటాయి. ఈ కారుకు ముందువైపు ఛార్జింగ్‌ పోర్ట్‌ ఇస్తున్నారు.

బ్యాటరీ 8 సంవత్సరాల వారంటీ ఛార్జింగ్ ఛార్జ్ చేయడానికి హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌కు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్,  యాప్ ఆప్షన్ అందించింది. దీని ద్వారా వినియోగదారులు సులభంగా ఛార్జ్ చేయవచ్చు. ఈ కారు NMC బ్యాటరీతో అమర్చబడి ఉంది. దీనికి 8 సంవత్సరాల వారంటీ లభిస్తుంది. ఇది 51.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో 171bhp ఎలక్ట్రిక్ మోటారుతో శక్తినిస్తుంది. ఇది గొప్ప డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది.  ఈవీ సెగ్మెంట్‌లో టాటా కర్వ్‌, మహీంద్రా బీఈ 6, ఎంజీ జడ్‌ఎస్‌ ఈవీ వంటి కార్లకు హ్యుందాయ్‌ క్రెటా పోటీ ఇవ్వనుంది.