Hyundai Festive Season Offers: హ్యుందాయ్‌ కార్ల అభిమానులకు ఫెస్టివ్ సీజన్ ప్రారంభంలోనే గుడ్‌ న్యూస్‌. ఇటీవల సెంట్రల్ గవర్నమెంట్‌ తీసుకొచ్చిన GST తగ్గింపు నిర్ణయంతో, హ్యుందాయ్ ఇండియా తన మొత్తం పాసింజర్‌ వెహికల్‌ రేంజ్‌ ధరలను భారీగా తగ్గించింది. ఈ తగ్గింపు కొత్త GST రేట్లు అమల్లోకి వచ్చే సెప్టెంబర్ 22 నుంచే కస్టమర్లకు వర్తిస్తుంది.

Continues below advertisement

ధరలు ఎంత వరకు తగ్గాయి? 
హ్యుందాయ్‌ ఇండియా డేటా ప్రకారం, మోడల్‌ను బట్టి తగ్గింపు వేర్వేరుగా ఉంటుంది. Hyundai Tucson SUV రేటు గరిష్టంగా రూ. 2.4 లక్షల వరకు ధర తగ్గింది. ఇది హ్యుందాయ్‌ లైనప్‌లోనే పెద్ద బెనిఫిట్‌. అంతేకాకుండా Venue, Creta, i20, Exter, Alcazar లాంటి తెలుగు ప్రజలకు ఇష్టమైన పాపులర్‌ మోడళ్లపై కూడా గణనీయమైన తగ్గింపు ఇచ్చారు.

వినియోగదారులకు లాభం
పండుగ సీజన్‌లో కొత్త కారు కొనే ప్లాన్‌ వేసుకున్న వారికి ఇది నిజంగా బంపర్‌ ఆఫర్‌. ఇప్పటి వరకు కొంచెం హయ్యర్‌ బడ్జెట్‌లో ఉన్న కొన్ని మోడళ్లు ఇప్పుడు మరింత అందుబాటు ధరల్లోకి మారాయి. ముఖ్యంగా మిడ్-రేంజ్‌ SUVలు Venue, Creta, Alcazar మీద వచ్చే ధర తగ్గింపు మధ్య తరగతి వినియోగదారులకు పెద్ద లాభం అవుతుంది.

మోడల్‌ పేరు గరిష్ట తగ్గింపు
Hyundai Nios రూ. 73,808 వరకు 
Hyundai Aura రూ. 78,465 వరకు 
Hyundai Exter రూ. 89,209 వరకు 
Hyundai i20 రూ. 98,053 వరకు 
Hyundai i20 N Line రూ. 1,08,116 వరకు 
Hyundai Venue రూ. 1,23,659 వరకు 
Hyundai Venue N Line రూ. 1,19,390 వరకు 
Hyundai Verna రూ. 60,640 వరకు 
Hyundai Creta రూ. 72,145 వరకు 
Hyundai Creta N Line రూ. 71,762 వరకు 
Hyundai Alcazar రూ. 75,376 వరకు 
Hyundai Tucson రూ. 2,40,303 వరకు

మార్కెట్‌లో ఇంపాక్ట్
ధరల తగ్గింపు నిర్ణయం హ్యుందాయ్‌కి ఒక విధంగా మాస్టర్‌ స్ట్రోక్‌ అని చెప్పొచ్చు. ఒకవైపు GST తగ్గింపు బెనిఫిట్‌ నేరుగా కస్టమర్లకు ట్రాన్స్‌ఫర్ చేయడం, మరోవైపు ఫెస్టివ్ సీజన్ సేల్స్‌ పెంచుకోవడం - ఈ రెండు లక్ష్యాలను కచ్చితంగా చేరుకోవాలని హ్యుందాయ్‌ చూస్తోంది. ఈ తగ్గింపుతో Maruti, Kia, Tata లాంటి పోటీ బ్రాండ్లపై కూడా ప్రెషర్‌ పెరుగుతుందని ఆటో ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు.

ముఖ్యంగా లాభపడేవారు ఎవరు?

టక్సన్ SUV కొనాలనుకున్న వాళ్లు - నేరుగా రూ. 2.40 లక్షల వరకు సేవ్ అవుతారు.

క్రెటా, వెన్యూ ఫ్యాన్స్‌ - బడ్జెట్‌ ఫ్రెండ్లీ రేంజ్‌లో SUVల ధరలు తగ్గడం మధ్య తరగతి కుటుంబాలకు మంచి ఆఫర్‌లా ఉంటుంది.

i20, ఎక్స్‌టర్‌ లాంటి చిన్న కార్లు - యువతకు, సిటీ డ్రైవర్స్‌కి ఎకానమికల్‌గా దొరుకుతాయి.

ఆల్కజార్ 7-సీటర్ కొనేవారు - పెద్ద కుటుంబాలకు మరింత అందుబాటు ధరగా మారుతుంది.

మార్కెట్‌లో ఇంపాక్ట్
ధరల తగ్గింపు నిర్ణయం హ్యుందాయ్‌కి ఒక విధంగా సవాల్‌, మరొక విధంగా లాభం అని చెప్పొచ్చు. ఒకవైపు GST తగ్గింపు బెనిఫిట్‌ నేరుగా కస్టమర్లకు ట్రాన్స్‌ఫర్ చేయడం కంపెనీ షాక్‌ అయితే, మరోవైపు ఫెస్టివ్ సీజన్ సేల్స్‌ పెంచుకునే ఛాన్స్‌ ఉండడం లాభదాయకం. హ్యుందాయ్‌ ఈ రెండు లక్ష్యాలను కచ్చితంగా చేరుకోవాలని హ్యుందాయ్‌ చూస్తోంది. ఈ తగ్గింపుతో Maruti, Kia, Tata లాంటి పోటీ బ్రాండ్లపై కూడా ప్రెషర్‌ పెరుగుతుందని ఆటో ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు.

హ్యుందాయ్‌ తాజా నిర్ణయంతో “Value for Money” బ్రాండ్ ఇమేజ్‌ను మరింత బలంగా నిలబెట్టుకుంటుంది. GST తగ్గింపుతో వచ్చిన లాభాన్ని కస్టమర్లకు పాస్‌ చేయడం ద్వారా ఫెస్టివ్ సీజన్‌లో సేల్స్‌ కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉంది.