Hyundai Alcazar vs Kia Carens: ప్రీమియం, కంఫర్ట్ సెగ్మెంట్లో సెవెన్ సీటర్ కారు కొనడం కోసం చూస్తున్నారా? అయితే, మీకు హ్యుందయ్ అల్కజార్, కియా కారెన్స్ మంచి ఆప్షన్లుగా ఉంటాయి. అయితే, ఈ రెండు కార్లలో ఏది బెస్ట్ అనే వివరాలను ఒకసారి పరిశీలిద్దాం. కియా కారెన్స్ ఒక ఎంపీవీ (మల్టిపర్పస్ వెహికిల్), అల్కజార్ ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్). అయితే స్పెసిఫికేషన్స్ పరంగా కంపేర్ చేసి చూస్తే చాలా తేడాలు ఉన్నాయి. ఈ రెండు కార్లు ధర విషయంలో కాస్త వ్యత్యాసం బాగానే ఉంది.


Alcazar vs Carens ఏది పెద్దది?
హ్యుందయ్ ఆల్కజార్ 4540 మిల్లీ మీటర్ల పొడవుతో ఉండగా.. కియా కారెన్స్ 4560 మిల్లీ మీటర్ల పొడవును కలిగి ఉంది. ఇక కారు వెడల్పు పరంగా రెండూ 1800 మిల్లీ మీటర్లతో ఒకే విధంగా ఉంటాయి. కారెన్స్ ‌కు 16 ఇంచెస్ వీల్స్ ఉండగా.. అల్కజార్‌లో 18 ఇంచెస్ వీల్స్ ఉన్నాయి. అయితే, కారెన్స్ కొన్ని ఎస్‌యూవీ డీటైలింగ్స్‌తో ఎంపీవీ స్టాన్స్‌తో క్రాస్‌ఓవర్‌గా ఉన్నప్పటికీ, అల్కజర్ మాత్రం భారీగా కనిపిస్తుంది. పొడవు, ఎత్తు విషయంలో కాస్త పెద్దగా కనిపిస్తుంది.


ఏ కారు ఎక్కువ ఫీచర్లను కలిగి ఉంది?
కారెన్స్ దాని టాప్‌ స్పెసిఫికేషన్స్‌లో సన్‌రూఫ్, 10.25 అంగుళాల స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్స్, బ్యాక్ ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్, బోష్ ఆడియో సిస్టమ్, సెకండ్‌ వరుసలో కెప్టెన్ సీట్స్, వెనుక సన్‌షేడ్ కర్టెన్స్, సెకండ్ రో సీట్స్, ఎలక్ట్రిక్ రిలీజ్ ఇంకా మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి. ఇక ఆల్కజార్ విషయంలో సెకండ్ రోలో సీట్లు పొడిగించుకునే ఫీచర్ ఉంది. దాంతో తొడలకు మంచి సపోర్ట్ ఉంటుంది. సెకండ్ రోలో కూడా సీట్ వెంటిలేషన్, వెనుక నుంచి ఎలక్ట్రిక్ ఫ్రంట్ సీట్ అడ్జస్ట్ మెంట్ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఇందులో ఇండివిడ్యువల్ ఆర్మ్‌రెస్ట్‌లతో పాటు సన్‌బ్లైండ్‌లతో ఉన్న టేబుల్‌ను కూడా పొందొచ్చు. ఆల్కజార్ ఎలక్ట్రిక్ బూట్ రిలీజ్ ను కలిగి ఉంది. పనోరమిక్ సన్‌రూఫ్ వాయిస్ ఎనేబుల్డ్, ఇంకా ఫ్రంట్ లో డ్యూయల్ పవర్డ్ సీట్స్ ఉన్నాయి.


ఏ కారులో ఎక్కువ పవర్ ఉంది?
టాప్-ఎండ్ కారెన్స్ 1.5-లీటర్, టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 7-స్పీడ్ డీసీటీతో 160 హెచ్‌పీ, 253 ఎన్ఎం, 6 - స్పీడ్ ఏటీతో 116 హెచ్‌పీ, 1.5 డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. ఇంకో 1.5 లీటర్ ఇంజిన్ లో 1.5 టర్బో ఐఎంటీ క్లచ్‌లెస్ మాన్యువల్‌ను కలిగి ఉండగా.. ఈ వేరియంట్ పెట్రోల్ ఎంట్రీ లెవల్ ధరను మరింతగా తగ్గిస్తుంది. అల్కజార్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ స్టాండర్డ్‌తో 6 - స్పీడ్ మాన్యువల్, 7 - స్పీడ్ డీసీటీతో పాటు మాన్యువల్, 6 - స్పీడ్ ఏటీతో 1.5 లీటర్ డీజిల్‌తో వస్తుంది.


వ్యాల్యూ ఫర్ మనీ ఏది?
కారెన్స్ ప్రాథమిక వేరియంట్ రూ.10.5 లక్షలతో మొదలై టాప్ ఎండ్ రూ.19.9 లక్షల వరకు ఉంది. అల్కాజర్‌లో ప్రాథమిక వేరియంట్ రూ.14.99 లక్షల నుంచి మొదలై రూ.21.55 లక్షల వరకు ఉంది. మొత్తానికి అల్కజార్ అడిషనల్ ఫీచర్లతో మరింత ప్రీమియం ఎస్‌యూవీ కావాలనుకునే వారి కోసం బాగుంటుంది. పైగా ఇందులో ఎక్కువ స్థలం, రేర్ సీట్‌లో కంఫర్ట్ కూడా బాగుంటుంది. ఇటు కారెన్స్ ధర అల్కజార్ తో పోలిస్తే మరింత తక్కువగా ఉన్నందున కారెన్స్ అనేది బడ్జెట్ పరంగా అనుకూలంగా ఉంటుంది.