Car Maintenance Guide: చాలా మందికి కారులో తిరగాలనే ఉంటుంది. కానీ దాని మెయింటెనెన్స్‌ భారంగా భావించి కారు అనే ఆలోచనను పక్కన పెట్టేస్తుంటారు. కాస్త ముందడుగు వేద్దామంటే పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయ. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వేళ ఫిల్లింగ్ స్టేషన్ల ముందు భారీగా బారులు తీరిన వాహనాలు చూస్తుంటే భయపడిపోయే వారు చాలా మంది ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కారు అవసరం ఉన్నా సరే కొనడానికి భయపడే వారి కోసం కొన్ని చిట్కాలు చూద్దాం. ఈ చిట్కాలు పాటిస్తే మీరు తక్కువ ఖర్చుతోనే కారును నడపొచ్చు. 

Continues below advertisement

కారు ఎప్పుడు కూడా ఒకేరకమైన వేగంతో నడపాలి. అధిక వేగంతో నడిపినా, మరీ తక్కువ వేగంతో నడిపినా ఇంజిన్‌పై భారం పడుతుంది. దీని వల్ల ఎక్కువ ఇంధనం ఖర్చు అవుతుంది. అందుకే బ్యాలెన్స్డ్‌గా కారు నడపడం నేర్చుకుంటే మీకు పెట్రోల్, డీజిల్ ఖర్చు తగ్గుతుంది. సాధారణ వేగంతో నడిపితే ఇంధనం ఖర్చు తగ్గడమే కాకుండా, ఇంజిన్‌ లైఫ్ కూడా మెరుగుపడుతుంది. రిపేర్‌లు తగ్గిపోతాయి. 

చాలా మంది క్లచ్‌ వాడకంలో చేసే తప్పులు చేస్తుంటారు. అవసరం ఉన్నా లేకపోయినా సరే క్లచ్‌ను తొక్కిపెట్టి ఉంటారు. ఇది కూడా మీ కారు మైలేజీ పడిపోవడానికి కారణం కావచ్చు. ఇంధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది. ముఖ్యంగా ట్రాఫిక్‌లో వెళ్లేటప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. పదే పదే క్లచ్ నొక్కిపెట్టి ఉంటారు. ఇది ఇంధనాన్ని భారీగా ఖర్చు చేయడమే కాకుండా క్లచ్‌ కూడా త్వరగా అరిగిపోతుంది. 

Continues below advertisement

అవసరమైనప్పుడు గేర్‌లు మార్చడం. చాలా మంది ఈ విషయంలో కూడా తప్పులు చేస్తుంటారు. గేర్ మార్చాల్సి వచ్చినప్పుడు క్లచ్‌పై కాలు వేసి నడిపిస్తుంటారు. గేర్ మార్చకుండానే వెళ్తుందని భావిస్తుంటారు. ఇలా చేయడం వల్ల మీ కారు ఇంజిన్‌పై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. ఇంధనం కూడా ఎక్కువ తీసుకుంటుంది. ఏ వేగంలో వెళ్తున్నామో గ్రహించి దానికి అనుగుణంగానే గేర్‌లు మారుస్తూ ఉండాలి. 

మరికొందరు కారు ఎక్కువ సమయం ఆపాల్సి వచ్చినప్పుడు కూడా ఇంజిన్ ఆఫ్ చేయకుండా ఉంచుతారు. ఇది కూడా మీ పెట్రోల్ ఖర్చును పెంచేస్తుంది. దీని వల్ల కాలుష్యం కూడా పెరుగుతుంది. అందుకే 30 సెకన్లు కంటే ఎక్కువ ఆగిన ప్రతిసారీ ఇంజిన్ అఫ్ చేయడం మీ కారుకు మీ జేబులు మంచిది. 

సర్వీసింగ్ విషయంలో కూడా తప్పులు జరుగుతుంటాయి. టైం లేదని, లేదా సర్వీసింగ్ సెంటర్ దూరంగా ఉందని చెప్పి చాలా మంది సర్వీసింగ్ చేయడంలో అలసత్వం చూపిస్తుంటారు. ఇది కూడా మీ కారు మైలేజీని భారీగా తగ్గిస్తుంది. పెట్రోల్ ఖర్చు పెరుగుతుంది. సర్వీసింగ్ చేయడం వల్ల ఫిల్టర్స్, ఇంజిన్ ఆయిల్ ఇలా ప్రతి విషయంలో జాగ్రత్తపడొచ్చు. ఫలితంగా కారు ఇంజిన్‌కు లైఫ్ వస్తుంది. 

కార్ల టైర్ల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కారు మాన్యువల్‌లో పేర్కొన్నట్టు కార్ల టైర్లలో గాలి ఉండాలి. లేకుంటే ఆ ప్రభావం మీ కారు ఇంజిన్‌పై పడుతుంది. గాలి తక్కువ ఉన్న సమయంలో డ్రైవింగ్ చేస్తే కారును ముందుకు తీసుకెళ్లడానికి ఎక్కువ ఒత్తిడికి గురి కావాల్సి ఉంటుంది. దీని వల్ల ఎక్కువ పెట్రోల్, డీజిల్ వినియోగించాల్సి వస్తుంది. 

అన్నింటి కంటే ముఖ్యమైంది. తక్కువ దూరాలకు ఈవీలు కానీ, లేదా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కానీ వాడటం మంచిది. రోజు వారి చిన్న చిన్న దూరాలను నడవడం ద్వారా మీరు ఆరోగ్యంగా ఉంటారు. డబ్బులు కూడా మిగులుతాయి.