Protection Tips To Diesel Car This Winter: చలికాలం వస్తే డీజిల్ కార్లు ఎక్కువగా ఇబ్బందులు పెడతాయి. ఉదయం స్టార్ట్ అవ్వకపోవడం, ఇంజిన్ స్పందన తగ్గిపోవడం, ఫ్యూయల్ గట్టి పడటం, బ్యాటరీ పవర్ తగ్గిపోవడం - ఇవన్నీ భారత దేశంలో చాలా రాష్ట్రాల్లో సాధారణ సమస్యలు. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, వైజాగ్‌ వంటి ప్రాంతాల్లో కూడా రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల డీజిల్ కార్లకు చిన్న లేదా పెద్ద సమస్యలు తలెత్తుతాయి. కానీ ముందే కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ డీజిల్ కారు వింటర్‌లో కూడా స్మూత్‌గా పని చేస్తుంది. దీనికోసం పాటించాల్సిన 8 ముఖ్య సూచనలు ఇవీ:

Continues below advertisement

1. వింటర్ గ్రేడ్ డీజిల్ వాడండి (ఫ్యూయల్ జెల్లింగ్ ఆపుతుంది)చలి ఎక్కువైనప్పుడు డీజిల్ గట్టిపడి జెల్లీలా మారుతుంది. దీన్ని ఫ్యూయల్ జెల్లింగ్ అంటారు. ఇలాంటి ఫ్యూయల్ ఫిల్టర్‌ గుండా సరిగ్గా వెళ్లకపోవడంతో కారు స్టార్ట్ కాకపోవచ్చు. అందుకే వింటర్ గ్రేడ్ డీజిల్ దొరికితే అదే వాడండి. సురక్షితంగా ఉండాలంటే STP Diesel Treatment వంటి యాంటీ-జెల్ వంటివి కూడా ప్రతి రీఫిల్‌లో వేయడం మంచిది.

2. ఫ్యూయల్ ట్యాంక్ ఎప్పుడూ ఫుల్‌గా ఉంచండిట్యాంక్ సగమే ఉన్నప్పుడు లోపల తేమ పేరుకుని మంచుగా మారుతుంది. ఇది ఫ్యూయల్ లైన్లను బ్లాక్‌ చేస్తుంది. ట్యాంక్ ఫుల్‌గా ఉంచితే ఈ సమస్య ఉండదు. చలికాలంలో ఇది చాలా చిన్న టిప్‌, కానీ అత్యంత ఉపయోగకరమైన విషయం.

Continues below advertisement

3. బ్యాటరీను ముందే టెస్ట్ చేయించుకోండిచలి సమయంలో బ్యాటరీ పనితీరు సహజంగానే తగ్గుతుంది. పవర్ తగ్గితే కారు లైన్‌లోకి రావడానికి ఎక్కువ టైమ్‌ తీసుకుంటుంది. అందుకే సీజన్ ప్రారంభంలోనే బ్యాటరీ టెస్ట్ చేయించి, టెర్మినల్స్‌పై ఉండే కార్బన్ తుడిచేయండి. చార్జింగ్ సిస్టమ్ సరిగా పనిచేస్తుందో లేదో కూడా చెక్ చేయించండి.

4. సరైన వింటర్ గ్రేడ్ ఇంజిన్ ఆయిల్ వాడండిచలికాలంలో ఇంజిన్ ఆయిల్ కూడా మందంగా మారుతుంది. దీని వల్ల కోల్డ్ స్టార్ట్ సమయంలో ఆయిల్ సరిగ్గా సర్క్యులేట్ అవ్వదు. మెకానిక్ సూచనల ప్రకారం 5W-30 లేదా 5W-40 వంటి వింటర్ గ్రేడ్‌ సింథటిక్ ఆయిల్ వాడడం. ఇలా చేస్తే కోల్డ్ స్టార్ట్ సాఫ్ట్‌గా జరుగుతుంది.

5. కూలెంట్ లెవెల్ తప్పనిసరిగా చెక్ చేయండికూలెంట్ కేవలం వేడి తగ్గించడానికే కాదు, చలి సమయాల్లో ఇంజిన్ గడ్డ కట్టకుండా కూడా కాపాడుతుంది. కూలంట్ లెవెల్ సరిగ్గా ఉందా, వాటర్–యాంటీఫ్రీజ్ మిశ్రమం మాన్యువల్ ప్రకారం ఉందా అన్నది చూసుకోండి. అవసరమైతే హైడ్రోమీటర్‌తో టెస్ట్ చేయించండి.

6. గ్లో ప్లగ్స్‌ని చెక్ చేయించుకోండిడీజిల్ ఇంజిన్లలో గ్లో ప్లగ్స్ చిన్న హీటర్స్‌లా పని చేస్తాయి. ఇవి సరిగా లేకపోతే కోల్డ్ స్టార్ట్ సమస్యలు తప్పవు. ఉదయం స్టార్ట్ అవ్వడానికి టైం తీసుకోవడం, వైట్ స్మోక్ రావడం, ఇంజిన్ షేక్ అవ్వడం వంటివి కనిపిస్తే గ్లో ప్లగ్స్ మార్చే టైమ్ వచ్చిందని అర్థం.

7. కారు స్టార్ట్ చేసిన వెంటనే రేవ్ చేయకండిచలికాలంలో ఉదయం పూట కారు స్టార్ట్ చేసిన తర్వాత 3 నుంచి 5 నిమిషాలు ఇంజిన్‌ వార్మప్ కోసం వదిలేయండి. వెంటనే యాక్సిలరేట్ చేస్తే ఇంజిన్‌పై ఒత్తిడి పెరుగుతుంది. అదే విధంగా, కారును గ్యారేజ్‌లో లేదా షెల్టర్డ్ స్థలంలో పార్క్ చేస్తే చలిలో ఇంజిన్ ఎక్కువగా చల్లబడకుండా ఉంటుంది.

8. వింటర్ ముందు కారుకు ఓవరాల్ సర్వీస్ చేయించండిబెల్ట్స్‌, హోసెస్‌, ఫిల్టర్స్‌ చెక్ చేయించుకోవడం వల్ల చిన్న సమస్యలను ముందే గుర్తించవచ్చు. వింటర్ సీజన్‌లో హైవే ట్రావెల్స్ ప్లాన్ చేస్తే ఇది తప్పనిసరి.

ఈ 8 సింపుల్ హాక్స్‌ పాటిస్తే మీ డీజిల్ కారు చలికాలంలో కూడా హెల్దీగా, రెస్పాన్సివ్‌గా పని చేస్తుంది. కోల్డ్ స్టార్ట్ సమస్యలు తగ్గుతాయి, ఫ్యూయల్ జెల్లింగ్ & బ్యాటరీ ఇష్యూలు రావు. చిన్న జాగ్రత్తలే పెద్ద ఇబ్బందులను దూరం చేస్తాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.