Heavy Rain Bike Tips Telugu :వర్షాకాలం వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విజయవాడ, విశాఖలో రోడ్లన్నీ జలమయం అయిపోతాయి. ఐటీ కారిడార్‌లు, ప్రధాన కూడళ్ల వద్ద నిమిషాల్లో నీరు నిలిచిపోయి ట్రాఫిక్‌ ఆగిపోతుంది. ఇలాంటి కుండపోత వర్షాల్లో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే క్రమంలో లేదా అత్యవసర పనులపై బయటకు వచ్చినప్పుడు అత్యధికంగా ఇబ్బంది పడేది టూ వీలర్‌ రైడర్లే. మోకాళ్ల లోతు నీళ్లలో బైక్‌ రైడింగ్‌ చేయడం లేదా నీటిలో ఇంజిన్ ఆగిపోవడం వల్ల వేలాది రూపాయల ఫైన్ పడినంత పని అవుతుంది. చిన్న నిర్లక్ష్యం వల్ల ఇంజిన్‌లోకి నీరు చేరి హైడ్రోలాక్ అవ్వడం, ఎలక్ట్రిక్‌ షార్ట్ సర్క్యూట్‌లు జరగడం, బ్రేక్‌లు ఫెయిల్యూర్‌  కావడం, చైన్ రస్ట్ పట్టడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వర్షాకాలంలో మీ మోటార్‌ సైకిల్‌ను ఎలాంటి మెయింటెనెన్స్‌ ఇబ్బందులు లేకుండా అత్యంత సురక్షితంగా కాపాడుకోవచ్చు. 

Continues below advertisement

నీటిలో బైక్ ఆగిపోతే చేయకూడని తప్పులు ఇవే!

వర్షపు నీరు నిలిచిన రోడ్డుపై వెళ్లేటప్పుడు బైక్ ఇంజిన్ ఉన్నట్టుండి ఆగిపోతే 90 శాతం మంది చేసే అతి పెద్ద పొరపాటు వెంటనే కంటిన్యూగా సెల్ఫ్‌ స్టార్ట్ లేదా కిక్‌ స్టార్ట్ చేస్తారు. సైలెన్సర్‌ లేదా ఎయిర్‌ ఫిల్టర్‌ ద్వారా నీరు ఇంజిన్ కంబషన్ ఛాంబర్‌లోకి ప్రవేశించినప్పుడు, మీరు పదే పదే స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తే పిస్టన్, క్రాంక్‌షాఫ్‌ తీవ్రంగా దెబ్బతింటాయి. నీటిని పిస్టన్‌ కంప్రెస్‌ చేయలేదు. కాబట్టి ఇంజిన్ బ్లాక్‌ పగిలిపోయే ప్రమాదం ఉంది. 

నీటిలో బైక్ ఆగిపోతే ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇంజిన్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించకండి కారు లేదా బైక్‌ను న్యూట్రల్ చేసిన, నెట్టుకుంటూ నీరు లేని ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్లండి. స్పార్క్‌ ప్లగ్‌, ఎయిర్‌ఫిల్టర్‌ పొడిగా మారే వరకు వేచి ఉండాలి. అవసరమైతే మెకానిక్‌ సాయంో సైలెన్సర్‌లోని నీటిని తొలగించిన తర్వాతే స్టార్ట్ చేయాలి. 

Continues below advertisement

సైలెన్సర్‌ అండ్ ఎయిర్‌ ఫిల్టర్‌ కేర్‌!

మునిగిపోయే నీటి గుంతలు ఉన్న రోడ్లపై నడపాల్సి వచ్చినప్పుడు ప్రత్యేకమైన రైడింగ్‌ టెక్నిక్స్‌ పాటించాలి. నీటిలో నుంచి వెళ్లేటప్పుడు బైక్‌ను ఎల్లప్పుడూ మొదటి గేర్‌లోనే ఉంచాలి. యాక్సిలరేటర్‌ను స్థిరంగా ఇస్తూ ఇంజిన్‌ రెవ్‌లు ఎక్కువ ఉండేలా చూడాలి. దీని వల్ల ఎగ్జాస్ట్‌ పైప్ ద్వారా నీరు వెళ్లేందుకు అవకాశం ఉండదు. నీటి మధ్యలో వెళ్తున్నప్పుడు క్లచ్‌ పూర్తిగా నొక్కడం, గేర్లు మార్చడం చేయొద్దు. ఇది ఎగ్జాస్ట్‌ ప్రెజర్‌ను తగ్గించి నీరు లోపలికి వెళ్లేలా చేస్తుంది. వాటర్‌ లెవల్‌ సైలెన్సర్‌ ఎత్తు లేదా ఎయిర్‌ ఫిల్టర్‌ బాక్స్ ఎత్తు కంటే ఎక్కువగా ఉంటే, ఆ నీటిలోకి బైక్‌ను అసలు పోనీయొద్దు. 

ఎలక్ట్రికల్‌ అండ్ ఇగ్నిషన్ సిస్టమ్‌ రక్షణ

ఆధునిక బైక్‌లలో డిజిటల్ మీటర్లు, ఈసీయూ, సెన్సార్లు, ఎల్‌ఈడీ హెడ్‌లైట్స్‌ వంటి సున్నితమైన ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్‌ ఉంటాయి. వర్షపు నీరు వీటికి పెద్ద శత్రువు. వర్షంలో బైక్‌ స్టార్ట్‌ కాకపోవడానికి 80శాతం కారణం స్పార్క్‌ ప్లగ్‌ క్యాప్‌లోకి నీరు చేరడమే. స్పార్క్‌ప్లగ్‌ క్యాప్‌కు సిలికాన గ్రీస్‌ లేదా డైఎలెక్ట్రిక్‌ గ్రీస్‌ రాయడం ద్వారా నీరు లోపలికి వెళ్లకుండా ఇన్సులేషన్ క్రియేట్ చేయవచ్చు. 

ఇగ్నిషన్ స్విచ్చ్, హార్న్‌ బటన్, సెల్ఫ్‌ స్టార్ట్‌, బ్యాటరీ టెర్మినల్‌పై WD-40 మాయిశ్చర్‌ డిస్‌ప్లేస్‌మెంట్‌ స్ప్రే కొట్టడం వల్ల తేమ చేరకుండా షార్ట్ సర్క్యూట్ కాకుండా చేసుకోవచ్చు. బ్యాటరీ టెర్మినల్స్‌ వద్ద రస్ట్‌ పట్టకుండా పెట్రోలియం జెల్లీ లేదా ఆటోమోటివ్‌ గ్రీస్‌ అప్లై చెయ్యాలి. 

డ్రైవ్‌ చైన్ అండ బ్రేకింగ్ సిస్టమ్‌

వర్షపు నీరు రోడ్డుపై ఉండే బురద, ఇసుకతో కలిసి బైక్ ఓపెన్ డ్రైవ్‌ చైన్, బ్రేక్‌ ప్యాడ్లను త్వరగా పాడుచేస్తుంది. ప్రతి 300-500కిలోమీటర్లు లేదా భారీ వర్షాకాలంలో నడిపిన ప్రతిసారీ చైన్ క్లీనర్‌ ఉపయోగించి బురదను శుభ్రం చేసి,హై విస్కాసిటీ చైన్ ల్యూబ్‌ అప్లై చేయాలి. గ్రీస్‌ లేదా వాడిన ఇంజిన్ ఆయిల్‌ వాడితే దుమ్మును ఎక్కువగా ఆకర్షిస్తుంది. తడిసిన రోడ్లపై డిస్క్ బ్రేక్‌ రోటార్ల మధ్య బుర చేరి వింత శబ్దాలు రావడమే కాకుండా బ్రేకింగ్ సామర్థ్యం తగ్గుతుంది. వర్షంలో  రైడింగ్‌ పూర్తయ్యాక బ్రేక్ కాలిపర్లపై స్వచ్ఛమైన నీటిని పోసి శుభ్రం చేయాలి. 

పార్కింగ్ హ్యాక్స్‌

తడి వాతావరణంలో మెటల్ భాగాలై తుప్పు పట్టడం సర్వసాధారణం. పెయింట్‌ పీలింగ్‌, ఫ్యూయల్‌ ట్యాంక్‌ తుప్పు పట్టడం వంటివి బైక్ రీసేల్ వాల్యూను తగ్గస్తాయి. వర్షాకాలం ప్రారంభానికి ముందే బైక్ అండర్‌ బాడీ, ఫ్రేమ్‌ సైలెన్సర్‌ బయటి భాగంపై యాంటీ రస్ట్‌ ప్రొటెక్టివ్‌ కోటింగ్‌ వేయించడం మంచిది. బైక్‌ను ఎప్పుడూ పాత చెట్ల కింద పార్క్ చేయొద్దు. ఈదురు గాలులకు కొమ్మలు విరిగిపడే ప్రమాదంతోపాటు చెట్ల నుంచి పడే రసాలు పెయింట్‌ను పాడుచేస్తాయి. బైక్‌పై వెంటనే వాటర్‌ప్రూఫ్‌ కవర్‌ వేయకూడదు. అలా చేస్తే లోపల తేమ పేరుకుపోయి ఎలక్ట్రికల్‌ కాంపోనెంట్లు త్వరగా పాడవుతాయి. బైక్ పూర్తిగా పూర్తిగా ఆరిన తర్వాతే కవర్ కప్పాలి. 

మీ ఇన్సూరెన్స్‌ పాలసీలో ఇంజిన్ ప్రొటెక్ట్‌ కవర్‌ ఉందో లేదో సరి చూసుకోండి. సాధారణ కాంప్రహెన్సివ్‌ ఇన్సూరెన్స్‌ నీటిోల మునిగిపోవడం వల్ల దెబ్బతిన్న ఇంజిన్‌ రిపేర్ ఖర్చులను కవర్ చేయదు. ఈ చిన్న యాడ్‌ఆన్ తీసుకోవడం వల్ల 15 వేల నుంచి 40 వేల వరకు రిపేర్ బిల్లుల భారం నుంచి తప్పించుకోవచ్చు.