కారు సెంట్రల్ లాక్ సిస్టమ్ వాహనదారుల భద్రతకు చాలా ముఖ్యం. ఇది దొంగతనం లేదా ఇతర ప్రమాదాల నుండి కారును సురక్షితంగా ఉంచుతుంది. కానీ కొన్నిసార్లు ఈ భద్రతే మీకు ఇబ్బందిగా మారవచ్చు. ఒకవేళ మీరు లేదా మీతో పాటు ఎవరైనా కారులో చిక్కుకుపోతే, భయపడకుండా ప్రశాంతంగా సమయస్ఫూర్తిగా వ్యవహరించడం అవసరం. ఇటువంటి అత్యవసర సమయంలో కొన్ని చిట్కాలు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

Continues below advertisement

అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, కారు లాక్ అయినప్పుడు మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవాలి. భయపడటం వల్ల సరైన నిర్ణయం తీసుకోలేరు. ప్రశాంతంగా ఉండి ఆలోచిస్తే, ఆ కారు నుండి బయటపడటం ఎలా అని మీరు ఆలోచించి చేసే ప్రయత్నాలతో బయటపడగలరు.

కారులో ఉన్న వస్తువులను ఉపయోగించండిఒకవేళ డోర్ తెరుచుకోకపోతే, కారు లోపల ఉన్న వస్తువులను ఉపయోగించాలి. ఉదాహరణకు, సీటు హెడ్‌రెస్ట్ (Headrest) తీసి, దాని మొనదేలిన భాగంతో కారు అద్దాన్ని పగలగొట్టవచ్చు. ఒకవేళ హెడ్‌రెస్ట్ రాకపోతే, సీట్ బెల్ట్ మెటల్ హుక్ లేదా స్క్రూడ్రైవర్, సుత్తి వంటివి అద్దాన్ని పగులగొట్టడానికి సహాయపడతాయి.

Continues below advertisement

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, అద్దాన్ని మధ్యలో పగులగొట్టడానికి బదులుగా ప్రక్క భాగంలో (Sides) కొట్టడం సులభం. అంచులు త్వరగా పగులుతాయి మరియు బయటకు రావడం సులభం అవుతుంది.

కొన్ని కార్లలో హెడ్‌రెస్ట్ ఫిక్స్‌డ్‌గా ఉంటుంది. దాన్ని మీరు సీటు నుండి వేరు చేయలేరు. అటువంటప్పుడు అద్దాన్ని పగులగొట్టడానికి సీట్ బెల్ట్ ఉపయోగించడం ముఖ్యం. కనుక కారులో సీట్ బెల్ట్ హుక్ ద్వారా ఇలా చేయవచ్చు. సీట్ బెల్ట్ హుక్ గట్టి లోహంతో తయారవుతుంది. దీనివల్ల అది చాలా గట్టిగా ఉంటుంది.

మీరు జాగ్రత్త వహించాలి..

ఇటువంటి పరిస్థితులను నివారించడానికి ముందుగానే జాగ్రత్త వహించాలి. ఎల్లప్పుడూ కారు నుండి దిగే ముందు చెక్ చేయాలి. పిల్లలను ఒంటరిగా వదిలి వెళ్లకండి. అవసరమయ్యే చిన్న చిన్న సహాయక వస్తువులను ఎప్పుడూ కారులో ఉంచుకోవడం అత్యవసర సమయాల్లో మీకు మేలు చేస్తాయి.