Maruti Baleno Diwali Discounts Offers 2025: మీరు మారుతి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఈ పండుగ సీజన్ మంచి అవకాశం కావచ్చు. GST తగ్గింపు తర్వాత మారుతి బాలెనో గతంలో కంటే మరింత తక్కువ ధరకు వస్తోంది. అయితే, ఈ కారును కొనే ముందు దాని కొత్త ధర, ఫీచర్లు & మైలేజ్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

Continues below advertisement

మారుతి బాలెనోపై GST రేటు 28% నుంచి 18% కు తగ్గింది. తత్ఫలితంగా, ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణలో బాలెనో ప్రారంభ ధర ఇప్పుడు కేవలం ₹5.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) కు దిగి వచ్చింది. 

వేరియంట్ వారీగా మారుతి బాలెనో కొత్త ధర ఎంత? Maruti Baleno బేస్‌ వేరియంట్‌ అయిన Sigma వేరియంట్ కొత్త ధర ఇప్పుడు ₹5.99 లక్షలు కాగా, Delta వేరియంట్ ధర ₹6.79 లక్షలు. ఇంకా, Delta CNG వేరియంట్ ధర ₹7.69 లక్షలు, Zeta CNG వేరియంట్ ధర ₹8.59 లక్షలు. ఇవన్నీ ఎక్స్‌-షోరూమ్‌ రేట్లు. ఈ నెల (అక్టోబర్ 2025) మొత్తం ఈ కారుపై ₹70,000 వరకు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి.

Continues below advertisement

ఆన్‌-రోడ్‌ ధర ఎంత?మీరు, Maruti Baleno Sigma వేరియంట్ కొనాలని ప్లాన్‌ చేస్తే... ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 5.99 లక్షలు, రిజిస్ట్రేషన్‌ కోసం దాదాపు రూ. 89,000, ఇన్సూరెన్స్‌ కోసం దాదాపు రూ. 36,000, ఇతర అవసరమైన ఖర్చులు చెల్లించాలి. ఇవన్నీ కలిపి, బాలెనో సిగ్మా ఆన్‌-రోడ్‌ ధర దాదాపు రూ. 7.25 లక్షలు అవుతుంది.

మారుతి బాలెనో ఫీచర్లుమారుతి బాలెనోలో ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ & ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ఈ ఫీచర్లు చాలా వరకు టాప్-స్పెక్ మోడళ్లలో మాత్రమే అందుబాటులో ఉండటం గమనించదగ్గ విషయం. ఇది 1.2-లీటర్, నాలుగు-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో శక్తి పొందుతుంది, ఈ ఇంజిన్‌ 89 bhp & 113 Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది.

మారుతి కారు మైలేజ్ ఎంత?CNG మోడ్‌లో, బాలెనో 76 bhp పవర్ & 98.5 Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు. మైలేజ్ విషయానికొస్తే, కంపెనీ లెక్క ప్రకారం, కిలోగ్రాము CNG కి 30.61 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. పెట్రోల్ (మాన్యువల్) వేరియంట్ లీటరుకు 21.01 నుంచి 22.35 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుంది. ఆటోమేటిక్ మోడ్ 22.94 లీటరుకు కిలోమీటర్ల దూరాన్ని కవర్‌ చేస్తుంది. బాలెనోకు 37-లీటర్ పెట్రోల్ & 55-లీటర్ CNG ట్యాంక్ సామర్థ్యం ఉంది. ఈ రెండిటినీ ఫుల్‌ చేస్తే 1200 కిలోమీటర్ల దూరాన్ని చుట్టి రావచ్చు.

బాలెనో కొనడానికి ఉత్తమ మార్గం ఏది?GST కారణంగా రేటు తగ్గడం + దీపావళి ఆఫర్లు ఉన్న ఈ సమయమే బాలెనోను కొనడానికి బెస్ట్‌ టైమ్‌. ఈ కారు కొనడానికి పూర్తి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకుండా, కార్‌ లోన్‌ తీసుకుని, ఈజీ EMIలు చెల్లిస్తూ, మీ జేబుపై భారం లేకుండా బాలెనోను సొంతం చేసుకోవచ్చు. 

బాలెనో బదులు కొనదగిన కార్లుప్రస్తుతం, టాటా ఆల్ట్రోజ్, హ్యుందాయ్ i20, టయోటా గ్లాంజా & మారుతి స్విఫ్ట్ వంటి వాటితో బాలెనో పోటీ పడుతోంది. ఇవన్నీ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలోకి వస్తాయి. స్టైలింగ్, ఫీచర్లు, ఇంజిన్ ఎంపికలు & ధర ఆధారంగా బాలెనోకు ప్రత్యామ్నాయ కార్లుగా వీటిని ఎంపిక చేశారు. బాలెనో మీకు నచ్చకపోతే, వీటిలో దేనినైనా ఎంచుకోవచ్చు.