Toyota Innova Hycross Price, Mileage And Features In Telugu: భారతీయ మార్కెట్‌లో, ప్రీమియం పీపుల్‌కు బాగా నచ్చిన కార్లలో టయోటా ఇన్నోవా హైక్రాస్ ఒకటి. ఇది 7-సీటర్ కారు, పెద్ద ఫ్యామిలీకి హాయిగా సరిపోతుంది. దీని బేస్ మోడల్ GX 7 STR (పెట్రోల్) కు కూడా మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. ఇన్నోవా హైక్రాస్ ఎక్స్-షోరూమ్ ధర (Toyota Innova Hycross ex-showroom price) రూ. 19 లక్షల 94 వేల నుంచి ప్రారంభమై రూ. 31 లక్షల 34 వేల వరకు ఉంటుంది. ఇంత రేటా అని భయపడొద్దు, ఈ కారును కొనడానికి మీరు ఒకేసారి పూర్తి చెల్లింపు చేయవలసిన అవసరం లేదు. ఈ కారును బ్యాంక్ రుణంపై కూడా కొనుగోలు చేయవచ్చు.
టయోటా ఇన్నోవా హైక్రాస్‌ను EMI పై ఎలా కొనుగోలు చేయాలి? తెలుగు రాష్ట్రాల్లో, టయోటా ఇన్నోవా హైక్రాస్ బేస్ మోడల్ ఆన్-రోడ్ ధర (Toyota Innova Hycross on-road price) రూ. 25 లక్షల 30 వేల వరకు ఉంటుంది. రెండు రాష్ట్రాల్లోని వేర్వేరు పన్నుల కారణంగా, ఈ కారు ఆన్-రోడ్ ధరలో స్వల్ప తేడా ఉండవచ్చు. ఈ కారు కొనడానికి బ్యాంకు నుంచి లోన్ తీసుకోవచ్చు. మీరు కేవలం రూ. 5.30 లక్షలను డౌన్ పేమెంట్ చేస్తే, మిగిలిన 20 లక్షల రూపాయలను బ్యాంక్ మంజూరు చేస్తుంది. తీసుకున్న రుణంపై నిర్దిష్ట వడ్డీతో కలిపి, EMI రూపంలో బ్యాంకుకు తిరిగి చెల్లిస్తే సరిపోతుంది. ఖరీదైన ప్రీమియం & లగ్జరియస్ కారు మీ సొంతం అవుతుంది.
బ్యాంక్, రూ. 20 లక్షల కారు లోన్‌ను 9 శాతం వార్షిక వడ్డీ రేటుతో మంజూరు చేసిందని భావిద్దాం.
ఫైనాన్షియల్ ప్లాన్
9 శాతం వార్షిక వడ్డీ రేటు చొప్పున బ్యాంక్ రూ. 20 లక్షల రుణం మంజూరు చేసిందని భావిద్దాం. ఇప్పుడు EMI లెక్క చూద్దాం.
7 సంవత్సరాల కాలం కోసం బ్యాంక్ లోన్ తీసుకుంటే, ప్రతి నెలా రూ. 32,178 EMI బ్యాంక్‌కు చెల్లించాలి.
6 సంవత్సరాల కాలం కోసం బ్యాంక్ లోన్ తీసుకుంటే, ప్రతి నెలా రూ. 36,051 EMI చెల్లించాలి.
5 సంవత్సరాల కాలం కోసం బ్యాంక్ లోన్ తీసుకుంటే, ప్రతి నెలా రూ. 41,517 EMI కట్టాలి.
4 సంవత్సరాల కాలం కోసం బ్యాంక్ లోన్ తీసుకుంటే, ప్రతి నెలా రూ. 49,770 EMI బ్యాంక్‌లో జమ చేయాలి.
లోన్ టెన్యూర్ (రుణం తిరిగి తీర్చే కాలం) ఎక్కువ పెట్టుకుంటే EMI భారం తగ్గుతుంది, కానీ వడ్డీతో కలిపి చెల్లించాల్సిన మొత్తం పెరుగుతుంది.
బ్యాంక్ మంజూరు చేసే రుణ మొత్తం మీ క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది. మీ క్రెడిట్ స్కోర్ & క్రెడిట్ హిస్టరీ మెరుగ్గా ఉంటే, మరింత తక్కువ వడ్డీకే ఇంకా ఎక్కువ రుణం మంజూరయ్యే అవకాశం ఉంది. ఇంకా.. మీరు ఎక్కువ మొత్తాన్ని డౌన్ పేమెంట్ చేయగలిగితే రుణ వాయిదా (EMI)ను తగ్గించుకోవచ్చు.
టయోటా ఇన్నోవా హైక్రాస్‌ను రుణంపై కొనడానికి మీ నెలవారీ జీతం దాదాపు లక్ష రూపాయలకు తగ్గకూడదు. బ్యాంక్ రుణం తీసుకునే ముందు అన్ని పత్రాలను జాగ్రత్తగా చదవడం ముఖ్యం.