ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హోండా కొత్త వ్యూహంలో భాగంగా భారత్‌లో ప్రీమియం సెగ్మెంట్లోకి తిరిగి రావడానికి ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగా హోండా ZR-V (Honda ZR-V) శ్రీకారం చుట్టనుంది. ఈ SUVని తొలిసారిగా భారత ఆటో మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. హోండా కంపెనీ దీనిని ఒక ప్రత్యేక 'హలో మోడల్' (Halo Model) గా పరిచయం చేయాలని భావిస్తోంది. ఈ కారు బ్రాండ్ ఇమేజ్‌ను బలోపేతం చేయడానికి లాంచ్ చేస్తున్నారు. 

Continues below advertisement

హోండా ZR-Vని భారత్‌లో పూర్తిగా దిగుమతి చేసుకుంటారు. కాబట్టి దీని ధర కూడా ప్రీమియం సిరీస్‌లో ఉండే అవకాశం ఉంది. గతంలో భారత్‌లో విక్రయించిన హోండా CR-V కంటే పై కేటగిరీలో నిలుస్తుంది. ఇది స్కోడా కొడియాక్ (Skoda Kodiaq), ఫోక్స్‌వ్యాగన్ టైరాన్ (Volkswagen Tayron) వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తూనే 5 సీటర్ SUVలకు గట్టి పోటీ ఇవ్వనుంది. 

హోండా జెడ్‌ఆర్ బీ డిజైన్ ఎలా ఉంటుంది? డిజైన్ విషయానికి వస్తే హోండా ZR-V సుమారు 4.5 మీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉంటుంది. దాంతో పెద్ద రోడ్డుపై ఇది స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. దీని ఫ్రంట్ లుక్ చాలా బోల్డ్, స్పోర్టీగా ఉంటుంది. ఇందులో షార్ప్ హెడ్‌లైట్లు, పెద్ద గ్రిల్ ఇవ్వనున్నారు. ప్రీమియం, స్టైలిష్ కారును కోరుకునే వారిని దృష్టిలో ఉంచుకుని ఈ SUVని రూపొందించారు.

Continues below advertisement

ఫీచర్ల పరంగా కూడా ఈ కారు మోడ్రన్, అడ్వాన్స్‌డ్‌గా ఉంటుంది. ఇందులో వెంటిలేటెడ్ సీట్లు ఇస్తున్నారు. ఇవి ఎండాకాలంలో మీ జర్నీని సౌకర్యవంతంగా మారుస్తాయి. డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ద్వారా డ్రైవర్, ప్యాసింజర్ తమకు నచ్చిన విధంగా టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. వీటితో పాటు పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ టెయిల్‌గేట్, మరెన్నో ఆధునిక ఫీచర్లు వల్ల ఇది లగ్జరీ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి.

హోండా ZR-V పవర్‌ట్రెయిన్ హోండా ZR-V ఎస్‌యూవీ అతిపెద్ద ప్రత్యేకత దీని హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్. ఈ టెక్నాలజీ పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటారును అవసరానికి తగ్గట్లుగా ఉపయోగిస్తుంది. దీనివల్ల కారు ఎక్కువ మైలేజీ ఇచ్చే అవకాశాలు పెరుగుతాయి. మీకు తక్కువ ఫ్యూయల్ ఖర్చవుతుంది. రిపోర్టు ప్రకారం, ఈ SUV ఫుల్ ట్యాంక్‌తో దాదాపు 1000 కిలోమీటర్ల వరకు నాన్ స్టాప్ రేంజ్ ఇస్తుంది. ఈ సెగ్మెంట్‌లోని ఇతర SUVలలో ఇటువంటి హైబ్రిడ్ వ్యవస్థ లేకపోవడంతో ఇది బిగ్ గేమ్ ఛేంజర్‌గా మారేందుకు అవకాశాలు ఉన్నాయి. 

కానీ భారత మార్కెట్లో హోండా ZR-Vని పెద్ద ఎత్తున విక్రయించరు. ఇది లిమిటెడ్ రేంజ్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ చెబుతోంది. తమ ప్రత్యేక కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని ఈ మోడల్ పరిచయం చేస్తున్నారు. భారత్‌లో మరిన్ని కొత్త, అడ్వాన్స్‌డ్ కార్లను తీసుకురావడానికి హోండా కంపెనీ సిద్ధమవుతోందని చూపించడానికి ఈ లాంచ్ చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి హోండా ZR-V అనేది ప్రీమియం, మోడ్రన్ టెక్నాలజీతో వస్తున్న స్టైలిష్ SUVగా నిలువనుంది. మరోవైపు భారత్‌లో హోండా కంపెనీ పూర్వవైభవం కోసం ఈ కారుతో నాంది పలకాలని భావిస్తోంది.