Honda Unicorn Price, Mileage And Features In Telugu: తెలుగు రాష్ట్రాల్లో హోండా బైకులకు తెగ క్రేజ్‌ ఉంది, ఇష్టపడే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. హోండా టూ-వీలర్స్ సేల్స్‌ రిపోర్ట్‌ ఈ విషయాన్ని వెల్లడిస్తుంది. గత నెలలో, అంటే జులై 2025లో, దేశవ్యాప్తంగా ఈ కంపెనీ 5 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలను విక్రయించింది. ఈ ఎపిసోడ్‌లో, కంపెనీ ప్రసిద్ధ యునికార్న్ బైక్‌కు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. ఈ బండి టీవీఎస్‌ అపాచీ RTR 160 (TVS Apache RTR 160) & బజాజ్ పల్సర్ 150 (Bajaj Pulsar 150) వంటి బైక్‌లతో పోటీ పడుతోంది.

Continues below advertisement


హోండా యూనికార్న్‌ క్లాసిక్‌ డిజైన్‌తో ఎప్పటికీ ఆకట్టుకునే లుక్‌ కలిగి ఉంది. స్మూత్‌ ఫ్యూయల్‌ ట్యాంక్‌ డిజైన్‌ & క్రోమ్‌ ఫినిషింగ్‌ దీనిని సూపర్‌ ప్రీమియం బైక్‌లా చూపిస్తాయి. ఆకర్షణీయమైన LED హెడ్‌ల్యాంప్స్‌ & క్లియర్‌ లెన్స్‌ ఇండికేటర్లు మోడరన్‌ టచ్‌ ఇస్తాయి. కాంపాక్ట్‌ మోడల్‌ అయినప్పటికీ దీని బలమైన బాడీ స్ట్రక్చర్‌ సిటీ రైడింగ్‌ & లాంగ్‌ రైడ్స్‌ రెండింటికీ పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. 


తెలుగు రాష్ట్రాల్లో హోండా యునికార్న్ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.19 లక్షలు. హైదరాబాద్‌లో.. రిజిస్ట్రేషన్‌ కోసం దాదాపు రూ. 16,000, ఇన్సూరెన్స్‌ కోసం దాదాపు రూ. 13,000, ఇతర అవసరమైన ఖర్చులను కలుపుకుని ఈ బండిని 1.50 లక్షల ఆన్‌-రోడ్‌ రేటుకు కొనవచ్చు. విజయవాడలో రిజిస్ట్రేషన్‌ కోసం దాదాపు రూ. 17,000, ఇన్సూరెన్స్‌ కోసం దాదాపు రూ. 13,000, ఇతర అవసరమైన ఖర్చులను కలుపుకుని ఈ బండిని 1.56 లక్షల ఆన్‌-రోడ్‌ రేటుకు కొనవచ్చు. 


ఫీచర్లు
ఈ బైక్ ఫీచర్ల విషయానికి వస్తే.. హోండా యునికార్న్‌లో LED హెడ్‌లైట్, సింగిల్ ఛానల్ ABS, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ & సౌకర్యవంతమైన సీటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంకా, హోండా బైక్‌లో USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్ సౌకర్యం ఉంది, రైడింగ్‌ సమయంలోనే మీ మొబైల్‌ ఫోన్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు. హోండా యునికార్న్ అటు యువతకు & ఇటు పెద్దవాళ్లకు కూడా అతికినట్లు సరిపోయే బైక్ అవుతుంది.


పవర్ ట్రైన్ & వేగం
హోండా యునికార్న్‌లో 162.71cc సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్, BS-VI ఇంజిన్‌ ఉంది. ఈ ఇంజిన్ 13 bhp పవర్‌ను & 14.58 Nm పీక్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్‌ అయి ఉంటుంది. హోండా యునికార్న్‌ గరిష్టంగా గంటకు 106 కి.మీ. వేగం ఇస్తుంది. 


ఎంత మైలేజ్ ఇస్తుంది? 
వేగం, స్టైల్‌ మాత్రమే కాదు ఈ హోండా బైక్ ఇంధన సామర్థ్యంలోనూ మిన్నగా ఉంటుంది. దీని ARAI సర్టిఫైడ్‌ మైలేజ్‌ లీటరు పెట్రోలుకు 60 కిలోమీటర్లు. యూనికార్న్‌కు 13 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంది. మీరు ఈ ట్యాంక్ పూర్తిగా నింపితే, ARAI సర్టిఫైడ్‌ డేటా ప్రకారం, మీరు 780 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. అంటే, ఈ బైక్‌ ట్యాంక్‌ ఫుల్‌ చేసి, ఫ్యూయల్‌ బెంగ లేకుండా లాంగ్‌ డ్రైవ్‌లకు కూడా వెళ్లవచ్చు.


మల్టీ కలర్‌ ఆప్షన్స్‌ 
హోండా యునికార్న్‌ బైక్‌ను పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, రేడియంట్ రెడ్ మెటాలిక్ వంటి కలర్ ఆప్షన్స్‌లో కొనుగోలు చేయవచ్చు .


ఆసక్తికరమైన విషయం
హోండా యునికార్న్ గత 20 సంవత్సరాలుగా మార్కెట్లో ఉంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ 20 సంవత్సరాలలో ఆటోమేకర్లు హోండా యునికార్న్‌ డిజైన్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు.