Honda SP 125 vs Hero Glamour: దేశంలో ఒక సామాన్యుడు, లేదా మధ్యతరగతి ఉద్యోగి టూ వీలర్ కొనాలని అనుకున్నప్పుడు అతని మెదడులో మెదిలే మొదటి ప్రశ్న మైలేజ్‌ ఎంత ఇస్తుంది? గతంలో కేవలం 100సీసీ బైకులకే పరిమితమైన ఈ మైలేజీ చర్చ ఇప్పుడు 125సిసి సెగ్మెంట్‌కు మారింది. స్టైలిష్‌ లుక్స్, కొంచెం ఎక్కువ పవర్‌, అదే సమయంలో జేబుకు చిల్లు పడకుండా ఉండే మైలేజీ ఇవి నేటి కస్టమర్ కోరుకుంటున్న అంశాలు. ఈ పోటీలో ప్రధానంగా వినిపించే రెండు పేర్లు హోండా ఎస్పీ 125, హీరో గ్లామర్‌ 125. 

Continues below advertisement

ఈ ఆర్టికల్‌లో ఈ రెండు బైకుల మధ్య ఉన్న సాంకేతిక వ్యత్యాసాలు క్లెయిమ్‌ చేసిన మైలేజీకి రియల్‌ వరల్డ్‌ మైలేజీకి ఉన్న తేడాలు, మీ కష్టార్జితానికి తగిన విలువను ఇచ్చే బైక్ ఏదో లోతుగా చూద్దాం. 

టెక్నాలజీతో కూడిన రిఫైన్‌మెంట్‌ హోండా ఎస్పీ 125

హోండా ఎస్పీ 125 ప్రస్తుతం మార్కెట్‌లో ఒక అడ్వాన్స్‌డ్‌ ప్యాకేజీలా కనిపిస్తుంది. దీని విజయం వెనుక ఉన్న ప్రధాన కారణం దాని ఇంజిన్ టెక్నాలజీ, మీకు వైబ్రేషన్‌ లేని స్మూత్‌ రైడింగ్‌ అనుభవం కావాలంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఇందులో 123. 94cc eSP ఇంజిన్ ఉంది. 

Continues below advertisement

ఇందులోని PGM-FIసిస్టమ్‌ సెన్సార్ల ద్వారా పెట్రోల్‌ను ఇంజిన్‌కు సరఫరా చేస్తుంది. దీని వల్ల పెట్రోల్ వృథా కాదు. కంపెనీ 63కిలోమీటర్‌ మైలేజీ అని చెబుతున్నప్పటికీ రియల్ వరల్డ్‌ టెస్టులో సిటీలో 58 నుంచి 62కిమీటర్ వరకు మైలేజ్ వస్తోంది. 

మస్కుల్ రైడ్‌ హీరో గ్లామర్‌ 125

హీరో గ్లామర్‌ దశాబ్దాలుగా భారతీయ రోడ్లపై నమ్మకానికి మారుపేరుగా నిలిచింది. ముఖ్యంగా బడ్జెట్‌ విషయంలో రాజీ పడలేని వారికి ఇది ప్రాధాన్యత. హీరో పేటెంటెడ్‌ i3S దీనికి ప్రధాన బలం. ట్రాఫిక్ సిగ్నల్‌ వద్ద బైక్‌ ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిన, క్లచ్‌ నొక్కగానే స్టార్ట్ అవుతుంది దీని వల్ల ఇంధనం ఆదా అవుతుంది. 

ఇది చూడటానికి మస్కులర్‌గా ఉంటుంది. దీని వెడల్పైన సీటు ఫ్యామిలీతో ప్రయాణించే వారికి మంచి కంఫర్ట్‌ను ఇస్తుంది. కంపెనీ 65కిలోమీట్‌ అని క్లెయిమ చేసినా, ఇది సిటీలో 52నుంచి 55 కిలోమీటర్ల మైలేజీ మాత్రమే లభిస్తోంది. 

రెండు బైకుల మధ్య ఉన్న ప్రధాన తేడాలు 

ఫీచర్లు  హోండా ఎస్పీ 125హీరో గ్లామర్‌ 125
ఇంజిన్123.94cc  124.7cc
గరిష్ట పవర్10.87PS10.53PS
రియల్ వరల్డ్ మైలేజ్‌59-63kmpl  52-58kmpl
ట్యాంక్‌ కెపాసిటీ11 లీటర్లు10 లీటర్లు 
ప్రారంభ ధరరూ. 88, 528  రూ. 81, 063

బైక్ కొనేటప్పుడే కాదు, దాని అమ్మేటప్పుడు వచ్చే విలువ కూడా ముఖ్యమే. 

హోండా ఇంజిన్లు మన్నిక వల్ల 3 ఏళ్ల తర్వాత కూడా 60-65 శాతం రీసేల్ వాల్యూ లభిస్తుంది. ఇది దీర్ఘకాలిక పెట్టుబడిగా భావించవచ్చు. హీరో గ్లామర్ స్పేర్ పార్ట్స్‌ ధరలు చాలా తక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా రిపేర్‌ చేయించుకునే సదుపాయం ఉండటం దీనికి ప్లస్ ప్రారంభ ధరలోనే మీరు ఏడెనిమిది వేలు ఆదా చేసుకోవచ్చు.

ఎవరికి ఏ బైక్ మంచిది?

హోండా ఎస్పీ 125 బైక్‌తో మీకు లేటెస్ట్ టెక్నాలజీ, అత్యుత్తమ మైలేజీ, స్మూత్‌ రైడింగ్ కావాలనుకుంటే ధర కొంచెం ఎక్కువైనా మైలేజ్‌ ద్వారా ఆ డబ్బు వెనక్కి వస్తుంది. హీరో గ్లామర్‌ ప్రారంభంలో తక్కువ బడ్జెట్‌ ఉండి. తక్కువ మెయింటెనెన్స్‌ ఖర్చులతో నడిచే బలమైన బైక్ కావాలనుకుంటే కొనుక్కోవవచ్చు.