Honda Hornet 2.0 Price And Features: 'హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా', మన మార్కెట్‌లో ఉన్న అత్యంత నమ్మకమైన బ్రాండ్‌లలో ఒకటి. ఆ కంపెనీ నుంచి వచ్చిన హోండా హార్నెట్‌ 2.0 బైక్‌ యూత్‌తో పాటు డైలీ కమ్యూటర్లను కూడా బాగా ఆకట్టుకుంటోంది. 2020 ఆగస్టు 27న భారత మార్కెట్‌లో లాంచ్‌ అయిన ఈ బైక్‌... స్టైలిష్‌ డిజైన్‌, శక్తిమంతమైన ఇంజిన్‌, మంచి మైలేజ్‌తో ఇప్పటికీ మంచి డిమాండ్‌ను కొనసాగిస్తోంది. మీరు ఈ బైక్‌ కొనాలనుకుంటే, ముందుగా తెలుసుకోవాల్సిన 5 ముఖ్య విషయాలు ఇవే.

Continues below advertisement

1. హోండా హార్నెట్‌ 2.0 ఇంజిన్‌ పవర్‌ ఎంత?

హోండా హార్నెట్‌ 2.0లో 184.4cc సింగిల్‌ సిలిండర్‌, ఎయిర్‌-కూల్డ్‌ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజిన్‌ 8,500 rpm వద్ద 17.03 bhp గరిష్ట శక్తిని, 6,000 rpm వద్ద 15.9 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 6-స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌ను జత చేశారు. స్లిప్‌ అండ్‌ అసిస్ట్‌ క్లచ్‌ ఉండటం వల్ల గేర్‌ మార్పులు స్మూత్‌గా ఉంటాయి. సిటీ రైడింగ్‌, హైవే క్రూజింగ్‌ రెండింటికీ ఈ పవర్‌ సరిపోతుంది.

Continues below advertisement

2. మైలేజ్‌, బరువు వివరాలు

హోండా తెలిపిన ప్రకారం, హార్నెట్‌ 2.0 లీటరుకు 42.3 కి.మీ. మైలేజ్‌ ఇస్తుంది. 200cc సెగ్మెంట్‌లో ఇది మంచి నంబర్‌గా చెప్పుకోవచ్చు. ఈ బైక్‌ కెర్బ్‌ వెయిట్‌ (ఫ్యూయల్‌, ఆయిల్స్‌ నింపిన తర్వాతి బరువు) కేవలం 142 కిలోలు మాత్రమే. తక్కువ బరువు ఉండటం వల్ల ట్రాఫిక్‌లో హ్యాండిల్‌ చేయడం సులభం. ఇందులో 12 లీటర్ల ఫ్యూయల్‌ ట్యాంక్‌ ఉంది. అలాగే, ఈ బైక్‌ E20 ఇంధనానికి అనుకూలంగా ఉండటం భవిష్యత్తు దృష్ట్యా ప్లస్‌ పాయింట్‌.

3. హోండా హార్నెట్‌ 2.0లో ఫీచర్లు ఏవి?

ఇటీవల హోండా ఈ బైక్‌ను అప్‌డేట్‌ చేసి, TFT డిస్‌ప్లేను అందించింది. ఇది స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీకి సపోర్ట్‌ చేస్తుంది. అదనంగా, ఆల్‌-LED లైట్లు, గోల్డెన్‌ USD ఫ్రంట్‌ ఫోర్క్‌, డ్యూయల్‌-చానల్‌ ABS, ట్రాక్షన్‌ కంట్రోల్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ సెగ్మెంట్‌లో ఇవన్నీ ఉండటం హార్నెట్‌కు మంచి విలువను ఇస్తాయి.

4. కలర్‌ ఆప్షన్లు

హోండా హార్నెట్‌ 2.0 ఒక్క వేరియంట్‌లోనే లభిస్తుంది. అయితే, నాలుగు ఆకర్షణీయమైన రంగుల ఆప్షన్లు ఉన్నాయి. మ్యాట్‌ యాక్సిస్‌ గ్రే మెటాలిక్‌, మ్యాట్‌ మార్వెల్‌ బ్లూ మెటాలిక్‌, మ్యాట్‌ సంగ్రియా రెడ్‌ మెటాలిక్‌, పెర్ల్‌ ఇగ్నియస్‌ బ్లాక్‌ కలర్స్‌లో ఈ బైక్‌ అందుబాటులో ఉంది. అన్ని కలర్స్‌కీ గోల్డెన్‌ USD ఫోర్క్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

5. ధర, ప్రత్యర్థులు

హోండా హార్నెట్‌ 2.0 ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ.1.47 లక్షలు. హైదరాబాద్‌లో చూస్తే, ఆన్‌-రోడ్‌ ధర సుమారు రూ.1.86 లక్షలు ఉంటుంది. విజయవాడ సహా అన్ని తెలుగు నగరాల్లోనూ స్వల్ప తేడాతో దాదాపు ఇదే ఆన్‌రోడ్‌ ధర అమల్లో ఉంది. 

ఈ సెగ్మెంట్‌లో హార్నెట్‌ 2.0కి ప్రధాన ప్రత్యర్థులుగా TVS అపాచీ RTR 200 4V, బజాజ్‌ పల్సర్‌ N160 ఉన్నాయి.

చివరగా... స్టైలిష్‌ లుక్‌, శక్తిమంతమైన ఇంజిన్‌, మంచి మైలేజ్‌, హోండా విశ్వసనీయత - ఇవన్నీ ఒకే బైక్‌లో కావాలంటే హోండా హార్నెట్‌ 2.0 ఒక బ్యాలెన్స్‌డ్‌ ఆప్షన్‌. రోజువారీ ప్రయాణాలు, వీకెండ్‌ రైడ్స్‌ రెండింటికీ సరిపోయే బైక్‌ కోసం చూస్తున్న వారికి ఇది ఖచ్చితంగా పరిశీలించదగ్గ ఎంపిక.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.