భారత మార్కెట్లో క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఏ కొత్త మోడల్ మార్కెట్లోకి వచ్చినా సేల్స్ పరంగా కంపెనీలు ఆశించిన ఫలితాలు వస్తున్నాయి. ఎందుకంటే వీటి రన్నింగ్ కాస్ట్ పెట్రోల్, డీజిల్ కంటే తక్కువగా ఉండటంతో పాటు పర్యావరణానికి కూడా తక్కువ హాని చేస్తాయి. పెట్రోల్, డీజిల్ కార్లలా వీటి ద్వారా అధిక పొల్యూషన్ ఉండదు. ఈ పెరుగుతున్న ఈవీ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని హోండా కొత్త, ప్రత్యేకమైన చిన్న ఎలక్ట్రిక్ కారు హోండా సూపర్ ఎన్ ఈవీ (Honda Super N EV)ని లాంచ్ చేసింది. ఈ కారు ప్రత్యేకంగా సిటీలో ఆఫీసుకు, రోజువారీ ప్రయాణాల కోసం రూపొందించింది. ఇందులో ఉపయోగించిన టెక్నాలజీ దీనిని సాధారణ ఎలక్ట్రిక్ కార్ల కంటే భిన్నంగా చేసి కస్టమర్లను ఆకట్టుకుంటోంది. 

Continues below advertisement

ఈ కారు చూడటానికి చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. Honda Super N EV డిజైన్ పాత కాలపు కార్ల తరహాలో డిజైన్ చేశారు. ముఖ్యంగా 1980వ దశకంలోని హోండా సిటీ టర్బో II (Honda City Turbo II)ని ఇది పోలి ఉంటుందని కంపెనీ చెబుతోంది. కారు లుక్ కొంచెం బాక్సీగా,  వెడల్పుగా ఉండటం వల్ల ఇది రోడ్డుపై ఇతర కార్ల కంటే భిన్నంగా కనిపిస్తుంది. దీనితో పాటు ట్రాఫిక్, ఇరుకైన వీధుల్లో కూడా సులభంగా డ్రైవింగ్ చేసేలా కారు తయారుచేశారు. అంటే హోండా సూపర్ ఎన్ ఈవీతో సిటీ రోడ్లపై ఏ ఇబ్బంది లేకుండా చక్కర్లు కొట్టవచ్చు. 

హోండా ఈవీ (EV) ప్రత్యేకతలు ఇవే

Continues below advertisement

హోండాకు చెందిన ఈ ఎలక్ట్రిక్ కార్ అతిపెద్ద ప్రత్యేకత దాని డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్. సాధారణంగా ఎలక్ట్రిక్ కార్లు నిశ్శబ్దంగా వెళ్తున్నట్లు ఉంటాయి. వాటిలో గేర్ మార్చినట్లు కూడా మీకు ఉండదు. కానీ ఇందులో పెట్రోల్ కారు నడుపుతున్న ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా ప్రత్యేక ఫీచర్లు ఇచ్చారు. ఇందులో 7 స్పీడ్ డిజిటల్ గేర్ సిస్టమ్ ఇచ్చారు. దీనివల్ల డ్రైవర్‌కు మాన్యువల్ కారు నడుపుతున్నట్లు ఫీలవుతారు. ఇందులో యాక్టివ్ సౌండ్ కంట్రోల్ ఉంది. ఇది వేగానికి తగ్గట్లుగా ఇంజిన్ శబ్దాన్ని జనరేట్ చేస్తుంది.

కారులో ప్రత్యేకమైన బూస్ట్ మోడ్ (Boost Mode) కూడా ఉంది. ఈ మోడ్‌లో ఒక బటన్ నొక్కగానే కారు పవర్ పెరుగుతుంది. దీని సాధారణ పవర్ దాదాపు 47 kW ఉండగా, బూస్ట్ మోడ్ ఆన్ చేస్తే సుమారు 70 kW వరకు చేరుకుంటుంది. వేగం బాగా పెంచాల్సిన సమయంలో ఈ ఫీచర్ ఉపయోగించవచ్చు. బూస్ట్ మోడ్ ఆన్ చేసినప్పుడు కారు లోపల లైట్ల రంగు మారుతుంది. ఇది డ్రైవింగ్‌ను  స్పోర్టీగా మారుస్తుంది.

కారు ఇంటీరియర్ లో ఏం ఇచ్చారు..

ఈవీ ఇంటీరియర్ విషయానికి వస్తే, కారు లోపల చాలా ఆకర్షణీయంగా, ప్రీమియంగా ఉంది. ఇందులో బ్లూ థీమ్ అందించారు. ఇది కారుకు క్లాసిక్, మోడ్రన్ లుక్ ఇస్తుంది. ఇది చిన్న కారు అయినప్పటికీ, కూర్చోవడానికి స్పేస్ సరిపోతుంది. సీట్లు సౌకర్యవంతంగా ఇచ్చారు. వినియోగదారులు తమ ఇష్టానుసారం రంగులు, డిజైన్‌లను కస్టమైజ్ చేసుకునే అవకాశం కల్పించారు. 

రేంజ్ పరంగా కూడా ఈ కారు కస్టమర్లను ఆకట్టుకుంటోంది. హోండా సమాచారం ప్రకారం, ఇది ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే దాదాపు 320 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. రోజువారీ సిటీ డ్రైవింగ్‌కు ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది. అయితే డ్రైవింగ్ స్టైల్, రోడ్డు పరిస్థితులను బట్టి ఈ రేంజ్ కొంచెం తక్కువగానూ ఉండవచ్చు.